మా నాన్నను తప్పుపట్టొద్దు | do not blame my father, appeals captain iryanto's daughter | Sakshi
Sakshi News home page

మా నాన్నను తప్పుపట్టొద్దు

Published Tue, Jan 6 2015 7:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

మా నాన్నను తప్పుపట్టొద్దు

మా నాన్నను తప్పుపట్టొద్దు

విమానం కుప్పకూలిపోవడంలో తమ తండ్రిని తప్పు పట్టొద్దని ఎయిర్ ఏషియా విమాన పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజెలా చెబుతోంది. చిట్ట చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులో ప్రయాణికులను కాపాడేందుకే ప్రయత్నించారని, ఆమాటకొస్తే.. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణికులకు హాని కలిగించాలని అనుకోరని ఆమె చెప్పింది. పైగా కెప్టెన్ ఇర్యాంటో కూతురిగా తాను ఆ విషయాన్ని అసలు ఒప్పుకోనని తెలిపింది. ఆయన కూడా ప్రమాదంలో మరణించారని, ఇప్పటికి ఇంకా అసలాయన మృతదేహం కూడా లభించలేదని.. దాంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని చెప్పింది.

జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం క్యూజడ్850లో సిబ్బంది సహా మొత్తం 162 మంది ఉండగా కేవలం 34 మృతదేహాలను మాత్రమే ఇంతవరకు వెలికితీశారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంకా బయటపడలేదు. అది వస్తే తప్ప చివరి నిమిషంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే అవకాశం లేదు. ఈలోపు పైలట్ ఇర్యాంటోను తప్పుబట్టడం సరికాదని ఆయన కుమార్తె ఏంజెలా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement