Flower cultivation
-
ఉపాధి పరిమళం!
పెరవలి : గోదారికి ఆనుకుని ఉన్న గ్రామం అది. ఊరు ఊరంతా పూల తోటలమయం. ఊళ్లోనే కాదు.. ఊరికి ఏ పక్కన వెళుతున్నా పూల సువాసనలు ముక్కు పుటాలను తాకి మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. రంగు రంగుల పూల మొక్కలు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక శీతాకాలంలో అయితే మంచు తెరల మధ్య ఆ గ్రామం భూతలస్వర్గమే! తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామ ప్రత్యేకత ఇది. పూల మార్కెట్లో జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. సుమారు 5 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 1100 కుటుంబాలున్నాయి. 3,500 మంది జనాభా ఉంది. 1200 ఎకరాలు పంట భూమి ఉండగా.. 800 ఎకరాల్లో వివిధ రకాల పూలనే సాగు చేస్తుండటం విశేషం. ఏడాది పొడవునా ఉపాధి గ్రామంలో నివసిస్తున్న 1100 కుటుంబాల్లో 900 కుటుంబాలు పూల వ్యాపారం, పూల సాగు పైనే ఆధారపడ్డాయి. గ్రామంలోని మహిళలంతా ఇంటి వద్దే ఉండి పూల మాలలు, దండలు కడుతూ ఉపాధి పొందుతున్నారు. కిలో పూలు మాలగా కట్టినందుకు బంతిపూలకు రూ.40, కనకాంబరాలకు రూ.150, కాగడాలు, మల్లెలు, విరజాజులు వంటి వాటికి రూ.100 తీసుకుంటారు. ఇలా ప్రతి ఇంటి నుంచి ఒక్కో మహిళ రోజుకు రూ.200 నుంచి రూ.400 వరకు సంపాదిస్తోంది. శుభముహుర్తాలు, పండుగలప్పుడైతే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఇక యువకులు పెండ్లి మండపాలకు పూలను డెకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలోని పురుషులు చాలామంది తెల్లవారు జామున సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వివిధ ప్రాంతాలకు వెళ్లి పూలను అమ్ముతుంటారు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి పూలను అమ్మి.. ఆ డబ్బుతో పూట మార్కెట్‌కు వెళ్లి కావాల్సిన పూలను కొనుగోలు చేసి ఇంటికొస్తారు. తిరిగి వాటిని మాలలుగా కట్టించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు వివిధ ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలు జరుపుకొని రాత్రి 9 గంటలకు ఇళ్లకు చేరతారు. ఇలా ఏడాది పొడవునా వీరు ఉపాధి పొందుతూనే ఉంటారు. చిరు వ్యాపారులు పూలను కొని మాకు అందిస్తే.. మేం మాలలుగా కట్టి ఇస్తాం. ఇంటి దగ్గరే ఉండి రోజుకు 200 నుంచి 400 దాకా ఆదాయాన్ని పొందుతున్నాం. – షేక్ హసేన్ బేబీ, గృహిణి, కాకరపర్రుమా గ్రామంలో యువకులంతా పూలను సాగు చేయడంతో పాటు పెండ్లి మండపాలకు పూలను డేకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చాలామంది యువకులు సైకిళ్లు, బైక్‌లపై పూల అమ్మకాలు చేస్తుంటారు. – కాపకా సూర్యనారాయణ, చిరువ్యాపారి, కాకరపర్రు -
Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది. మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..లతిక సుథాన్ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్‌లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.మొక్కల పాఠాలు..కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.ఇవి చదవండి: iSmart హోమ్స్ -
ఆర్కిడ్ పూలు అమ్మి నెలకు లక్షలు సంపాదిస్తున్న రైతు
-
ఆర్కిడ్ పూలు మొక్కలు బతికేందుకు కేవలం నీటి తుంపరల తడి చాలు
-
మల్లె సాగులో మెళకువలు... ఎకరానికి 4 లక్షల లాభం
-
సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు
-
ఆర్కిడ్స్ పూల సాగుతో మంచి లాభాలు
-
మల్లెపూల సాగుతో నెలకు 70 వేలు సంపాదిస్తున్న రైతు
-
వాడని పూలే వికసించెనే.. కనక వర్షం కురిపిస్తున్న గెర్బెరా పూల సాగు
కోశాక నీటి తడిలో ఉంచితే 15 రోజుల పాటు వాడవు గెర్బెరా పూలు. జార్ఖండ్‌లో ఈ పూలు కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు జెమ్‌షడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రియాంక, ప్రీతిలను అడిగితే చాలు వెంటనే లోడ్ పంపిస్తారు. లాకౌట్ కాలంలో తండ్రికి పనిపోవడంతో ఖాళీగా ఉన్న పొలంలో అలంకరణ పూలైన గెర్బెరాను సాగు చేశారు వీరు. ఇవాళ ఎందరో రైతులు వీరి బాటలో నడుస్తున్నారు. జార్ఖండ్‌లో వీరి పుణ్యమా అని వాడని పూలు వికసిస్తున్నాయి. పెళ్లిళ్లు, మీటింగ్‌లు, వేడుకలు... వేదికలను అలంకరించడానికి పూలు కావాలి. ఫ్లవర్ బోకేలకు కూడా పూలు కావాలి. ఆ సమయంలో అందరూ కోరేది గెర్బెరా పూలు (జెర్బెరా అని కూడా అంటారు. ఆఫ్రికన్ డైసీ దీని మరో పేరు). కాని ఇవి చాలా తక్కువ ప్రాంతాల్లో పండిస్తారు. ఎక్కువగా బెంగళూరు నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళతాయి. వీటిని జార్ఖండ్ రాష్ట్రానికి తెచ్చిన ఘనత మాత్రం ఇద్దరు అక్కచెల్లెళ్లకు దక్కింది. వీరిని ఇప్పుడు అక్కడ ముద్దుగా ‘జెమ్షెడ్పూర్ సిస్టర్స్’ అంటున్నారు. వీరి పేర్లు ప్రియాంక భగత్, ప్రీతి భగత్. ప్రియాంక ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ప్రీతి సీనియర్ ఇంటర్. జెమ్షెడ్పూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలాపత్థర్ అనే ఊళ్లో వీరు ఈ అద్భుతం సాధించారు. లాక్డౌన్లో.. కాలాపత్థర్లో అందరూ రైతులు లేదా రోజు కూలీలు. భూమి ఉన్నా వ్యవసాయం చేయక కూలి పనులకు వెళుతుంటారు. లేదా పక్కనే ఉన్న జాదుగోడ అనే పట్టణంలోని ఫ్యాక్టరీలో వర్కర్లుగా వెళుతుంటారు. ప్రియాంక, ప్రీతిల తండ్రి నవకిశోర్ భగర్ కూడా ఫ్యాక్టరీలో వర్కర్. కాని కోవిడ్ వల్ల లాక్డౌన్ రావడంతో ఫ్యాక్టరీ మూత పడింది. పని లేదు. ఆ సమయంలో పెద్ద కూతురు ఇంటర్లో, చిన్న కూతురు హైస్కూల్లో ఉన్నారు. పెద్ద కూతురు ప్రియాంక ‘బతకడం ఎలా?’ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే గెర్బెరా పూలు వ్యాపార పంటగా మంచి లాభాలు ఇస్తుంది అని ఉంది. వాళ్లకు భూమి ఉంది. వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం తెలుసు. ‘మనం పండిద్దాం నాన్నా’ అన్నారు కూతుళ్లిద్దరు. జార్ఖండ్ మొత్తానికి మనమే సప్లై చేయవచ్చు అని కూడా అన్నారు. కాని ఈ పంటకు పెట్టుబడి జాస్తి. దాదాపు లక్ష రూపాయలు కావాలి. తల్లి తన నగలు కుదువకు ఇస్తానంది. ఆ డబ్బు తెచ్చి ఇద్దరు కూతుళ్లు వాళ్లకున్న భూమిలో గెర్బెరా పూల సాగు మొదలెట్టారు. లాభాలు తెచ్చే పూలు.. గెర్బెరా పూలు త్వరగా వాడవు. ఒక సీసాలో నీళ్లు పోసి కాడలు వస్తే 15 రోజులు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. చెట్టుకు వదిలినా ఎక్కువ రోజులు వాడకుండా ఉంటాయి. అందువల్ల సీజన్లో వీటిని దూరాలకు కూడా రవాణా చేసి లాభాలు పొందవచ్చు. ‘పండగలు, వివాహాల సీజన్‌ను గమనించుకుని పూలను కోయడం ఉంచడం మేనేజ్ చేయాలి’ అంటారు అక్కచెల్లెళ్లు. ఇప్పుడు మార్కెట్లో ఒక్క పూవు 15 నుంచి 30 రూపాయలు పలుకుతుంది. ఈ పంట ఒక్కసారి వేసే మూడేళ్లు దిగుమతి ఇస్తుంది. పూలు పూస్తూనే ఉంటాయి. ‘డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి చేయగలిగితే లక్షలు చూడొచ్చు’ అంటున్నారు ఈ సోదరీమణులు. వీళ్లకు వస్తున్న ఆదాయం చూసి చుట్టుపక్కల రైతులందరూ ఈ పూలసాగులోనే దిగారు. దాంతో జెమ్షెడ్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల చేలన్నీ ఈ రంగుపూలతో కళకళలాడుతున్నాయి. రిస్క్ కూడా ఉంది.. అలాగే రిస్క్ కూడా ఉంది. అన్‌సీజన్‌లో ఈ పూలు ఎవరూ కొనరు. దాంతో కోసి పక్కన పడేయాలి. చీడ పీడల వల్ల పూలు ఒకవైపే వికసించడం, ముడుచుకుపోవడం జరుగుతుంది. ఆ చీడలను కూడా తొలగించుకోవాలి. ‘మేము అవన్నీ జాగ్రత్తగా చేస్తున్నాం’ అంటున్నారు వీరిద్దరు. వీరి చదువు ఆటంకాలు కూడా తీరిపోయాయి. ప్రియాంక అగ్రికల్చరల్ బిఎస్సీ చదవాలనుకుంటోంది. చిన్నామె లా చదవాలనుకుంటోంది. తల్లిదండ్రులు దర్జాగా ఉన్నారు. వాడని పూలు వికసిస్తే ఇంత హేపీగా ఉంటుంది. -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వాతావరణ సమాచారం వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్సైట్ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్ అబ్జర్వేషన్‌లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. గుబాళించిన పూల సాగు మార్కెట్లో అలంకరణ పూలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. గిరిజనులను ప్రోత్సహిస్తాం వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్‌ఫ్లవర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. – డాక్టర్ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
పూలబాట కాదు...ముళ్లబాటే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పూలరైతు ముందున్నది పూలబాటేమీ కాదు, ముళ్లబాటే. సిరులు కురిపించాల్సిన విరులు నష్టాలనే మిగిల్చాయి. పడిపోయిన ధరలు పూలరైతును నట్టేట ముంచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ తగ్గడంతో పూలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడేమో కానీ, పూలు తెంపిన కూలీలకు చెల్లించాల్సిన కూలీ, వాటిని మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనేనాథుడు లేక చెత్తకుప్పల పాలుచేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహాది శుభకార్యాలు లేకపోవడం కూడా పూలధరల పతనానికి కారణమవుతోంది. భారీ అంచనాలతో చేపట్టిన పూలసాగు నష్టాలనే మూటగట్టిన పరిస్థితులు, రైతుల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రాజధాని అవసరాలకు సరిపడా పూలు రంగారెడ్డి జిల్లాలోనే సాగవుతాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్, షాబాద్, మండలాల్లో పూలసాగు అధికంగా ఉంది. ఈ మండలాల్లో చామంతి, బంతి, తెల్ల చందమామ, గులాబీ, చాందిని తదితర రకాల పూలతోటలను రైతులు పెంచుతున్నారు. గతేడాది 2 వేల హెక్టార్లలో పూలతోటలు సాగు చేయగా, ఈ ఏడాది ఏకంగా 4,500 హెక్టార్లలో పూదోటలు పెంచారు. దీంతో అవసరాలను మించి పూలఉత్పత్తులు మార్కెట్‌కు పోటెత్తడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో పూలదిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇది కూడా పూలరైతుల నష్టాలకు కారణమైంది. ధరలు పతనం పూల ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి. చామంతి కిలో రూ.15 నుంచి రూ.20, బంతి రూ.4 నుంచి రూ.10, చందమామ పూలు రూ.5 నుంచి రూ.10, చాందిని రూ.5 నుంచి రూ.10, జర్మనీ పూలు రూ.10 నుంచి రూ.20, గులాబీ రూ.25 నుంచి రూ.30 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు గిట్టుబాటుకాక విలవిల్లాడుతున్నారు. కన్నీరే మిగిలింది పూలసాగుతో నష్టాలే మిగిలాయి. పండించిన పూలకు పెట్టుబడి కూడా రాలేదు. మార్కెట్‌కు తీసుకెళ్తే కిరాయి కూడా రావడం లేదని పొలాల్లోనే పూలను వదిలేస్తున్నాం. – నాగారం మహేశ్, నదీమ్‌నగర్ కొనేవారు కరువు డిసెంబర్ వరకు అయ్యప్ప పూజలు, సంక్రాంతి ఉండటంతో పూలధరలు కాస్తాకూస్తో ఉండేవి. ఆ తర్వాత శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో పూలకు గిరాకీ లేదు. దిగుబడి పెరిగినా, కొనేవారు లేరు. నిల్వ ఉంచుకునే వ్యవస్థ కూడా లేదు. – గుంటం సైపాల్‌రెడ్డి, ఆమ్డాపూర్ మద్దతు ధర కల్పించాలి రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత సర్కారుదే. పూల సాగుతో ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు మద్దతు ధర ప్రకటించాలి. తద్వారా రైతాంగానికి భరోసా కల్పించాలి. – అంజయ్యగౌడ్, నక్కపల్లి -
గులాబీ.. లాభాల జిలేబీ!
మండలంలోని హైతాబాద్, మద్దూరు, సోలిపేట్, సర్దార్‌నగర్, పెద్దవేడు, రేగడిదోస్వాడ, అప్పరెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు పూల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. గులాబీ రకాలైన రుబీ, టైగర్, సెంట్, ముత్తు తదితర రకాలతోపాటు ఫైవ్‌స్టార్ రకం గులాబీని అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల రైతులు తక్కువ పెట్టుబడితో.. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గులాబీ తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం రాయితీలను సైతం అందిస్తోంది. బెంగళూర్‌లోని హొసూరు పట్టణంలోని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.15 నుంచి రూ.20 వరకు లభిస్తుంది. వీటిని తెచ్చి రైతులు పూల సాగు చేస్తున్నారు. అందుబాటులో మార్కెట్ సదుపాయం హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రైతులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కిలో పూలు రూ.50 ధర పలుకుతున్నాయి. వేసవిలో, పెళ్లిళ్లు, పూజలు, పండగలు తదితర సీజన్లలో రూ.150 నుంచి 200 వరకు కిలో పూలు విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూయడంతో ధర హెచ్చు తగ్గులైనా ఎకరానికి ఖర్చులు పోను రూ.50 వేలకుపైనే లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాగు ఇలా.. అన్ని పంటల మాదిరిగానే గులాబీ పంటకు కూడా దుక్కి కలియ దున్నాలి. మొక్కల మధ్య మూడు అడుగులు, సాగుకు మధ్య ఆరు అడుగులు ఉండేలా రెండు అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసిన మట్టిలో సేంద్రియ ఎరువు, గుళికలు, ట్రైకోడర్మవిరిడితో కలిపి సగం వరకు పూడ్చాలి. మొక్కలకున్న పాలిథిన్ కవర్లు తీసివేసి నాటాలి. మామిడి, జామ తదితర పండ్ల తోటల్లోనూ అంతర పంటలుగా గులాబీ సాగుచేయవచ్చు. ఎకరానికి 2500 నుంచి 3 వేల మొక్కలు నాటవచ్చు. నెలరోజుల అనంతరం మొగ్గలు వచ్చే సమయంలో రసాయనిక ఎరువులు డీఏపీ, క్యాల్షియం పొటాష్ కూడా వేయాలి. నెలరోజుల నుంచి మొగ్గలు తొడిగి పూలు పూస్తూనే ఉంటాయి. చీడపీడల బెడద పెద్దగా ఉండదు. మచ్చతెగులు, పచ్చ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ మందును లీటర్ నీటికి 30 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరిగేంతవరకు తోట సేద్యం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చేస్తూనే ఉండాలి. పూలు పూయడం ప్రారంభమయ్యాక రోజు విడిచి రోజు పూలను తెంపుకోవచ్చు.