Fodder seeds
-
ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం విత్తనాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానికంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సీఎస్హెచ్–24 జొన్న రకం పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 శాతం సబ్సిడీపై 1,503.87 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా స్థానికంగా ఉన్న పశు సంపద, డిమాండ్ ఆధారంగా ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. 20 సెంట్ల నుంచి ఎకరం వ్యవసాయ పొలం కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 5 నుంచి 20 కిలోల వరకు సరఫరా చేయనున్నారు. మార్కెట్లో ఐదు కిలోల ప్యాకెట్ విలువ రూ.436.75 ఉండగా, ప్రభుత్వం రూ.327.55 సబ్సిడీగా భరిస్తుంది. రైతు కేవలం రూ.109.20 చెల్లిస్తే చాలు. వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ విత్తనం చల్లుకుంటే మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆరేడు పశువులకు కనీసం ఆరు నెలలపాటు పశుగ్రాసానికి లోటు లేకుండా అందించవచ్చు. వీటిలో అత్యధికంగా 8–10 శాతం వరకు మాంసకృత్తులతో పాటు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆసక్తి గల రైతులు సమీప ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా బుక్ చేసుకుని సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తం చెల్లిస్తే 24 గంటల్లోనే సరఫరా చేస్తారు. ఆర్బీకేల్లో సంప్రదించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. అర్హత, ఆసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆర్బీకేల్లోని పశుసంవర్థక సహాయకులను సంప్రదించండి. నాణ్యమైన సీఎస్హెచ్–24 విత్తనాన్ని తీసుకొని అదును దాటిపోకుండా నాటుకోవాలి. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్థక శాఖ -
ఎండిపోతున్న పంటలు
అందుబాటులో ఉన్న పశుగ్రాస విత్తనాలు జిల్లాలో ప్రస్తుతం ఎస్ఎస్జీ-825 హైబ్రీడ్ విత్తనాలు 150 టన్నులు ఉన్నాయి. వీటిని 75 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నాం. కిలో రూ.36 కాగా రాయితీ పోను రైతులకు రూ.9కు అందజేస్తున్నాం. సర్టిఫైడ్, అడ్వంటా యూపీఎల్ అనే రెండు కొత్త రకాల గడ్గి విత్తనాలను రాయితీపై పంపిణీ చేశాం. ఈసారి న్యూట్రిఫీడ్ అనే పశుగ్రాసం విత్తనాలు(సజ్జ రకం) 75 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నాం. ఇవి కిలో రూ.144.50. ఎకరానికి రెండు కేజీలు సరిపోతాయి. అడ్వంటా, యూపీఎల్ రకం విత్తనాలైతే ఎకరాకు 20 కేజీలు అవసరమవుతాయి. దిగుబడి సుమారుగా 120-130 టన్నుల గడ్డి వస్తుంది. ఏడుసార్లు కోత కోయవచ్చు. న్యూట్రిఫైడ్ రకంలో పాయిజన్ ఉండదు. జిల్లాలో సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పామూ రు మండలాల్లో గ్రాసం కొరత ఉంది. ఇప్పటి వరకు 12 టన్నుల గడ్డి విత్తనాలు పంపిణీ చేశాం. మరో 17 మండలాల్లో 38 టన్నుల విత్తనాలను ఇవ్వనున్నాం. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పాడి రైతులు విత్తనాలు తీసుకెళ్లి గడ్డి పెంచుకుంటే సమస్య ఉండదు. సుగర్ గ్రేజ్ ఇది హైబ్రీడ్ జొన్న రకం. రైతులు కిలో విత్తనాలకు రూ.84.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాకు 5 కేజీలు అవసరమవుతాయి. రెండు సార్లు కోతకు వస్తుంది. గడ్డి తీయగా ఉంటుంది. ఈ గడ్డి పశువులకు వేస్తే పాల దిగుబడి పెరుగుతుంది. విత్తనాలు నాటేటప్పుడు సాళ్ల మధ్య 4-5 అంగుళాల దూరం ఉంచాలి. ఎకరాకు 30 కిలోల నత్రజని, 12 కిలోల పొటాష్ వేయాలి. 10-15 రోజులకోసారి నీరు పెట్టాలి. నాటిన 50 నుంచి 55 రోజుల తర్వాత 50 శాతం పూత దశలో మొదటి కోత కోయాలి. ప్రతి 35-40 రోజులకు ఒక కోత చొప్పున మూడు కోతలు కోయాలి. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుంది. న్యూట్రిఫీడ్ న్యూట్రిపీడ్ పలు దఫాలుగా కోత కోసేందుకు అనువైన పచ్చిగడ్డి రకం. కొత్తగా వస్తున్న ఈ పశుగ్రాసం విత్తనాలు అన్ని రకాల నేలలకు, ముఖ్యంగా మెట్ట సేద్యంకు అనుకూలమైనవి. ఇవి నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఈ గడ్డి పశువులకు బలాన్నిస్తుంది. త్వరగా మేపుటకు అనుకూలమైనది. అధిక పాల దిగుబడికి దోహద పడుతుంది. న్యూట్రిఫీడ్ పచ్చిమేతలో ఉండే విటమిన్ ఏ పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఒక పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. నీటి వసతి గల ఒక ఎకరా భూమిలో న్యూట్రిఫీడ్ సాగు చేస్తే ఐదారు పశువులకు సరిపోతుంది. వర్షాధారం కింద సాగు చేస్తే రెండు పశువులకు సరిపోతుంది.