Forefront
-
5జీ: మేమే ముందు అంటున్న ఎయిర్టెల్, జియోకు షాకేనా?
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీకి మద్దతుగా శక్తివంతమైన నెట్‌వర్క్‌తో 5జీ సేవలను భారత్‌కు పరిచయం చేయడంలో కంపెనీ ముందంజలో ఉంటుందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. అందరి కంటే ముందుగా భారత్‌లో 5జీ పరీక్షలను జరిపినట్టు ఎయిర్టెల్ 2021-22 వార్షిక నివేదికలో గుర్తు చేశారు. ’ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగండి’ అనే శీర్షికతో వాటాదార్లకు ఆయన సందేశం ఇచ్చారు. ‘రాబోయే కాలంలో అసెట్ లైట్ విధానాన్ని కొనసాగిస్తూనే డిజిటల్ సేవలు కంపెనీ ఆదాయానికి అనేక బిలియన్ డాలర్లను జోడిస్తాయి. ఎయిర్టెల్ డిజిటల్ ప్రయాణంలో అందించిన ప్రారంభ విజయాలు ఈ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. 5జీ క్లౌడ్ గేమింగ్ అనుభవాన్ని ప్రదర్శించిన తొలి భారతీయ టెలికం సంస్థగా నిలిచాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ట్రయల్స్ చేపట్టిన మొదటి ఆపరేటర్ పేరు తెచ్చుకున్నాం. కోవిడ్-19 కొత్త రకాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, అంతకంతకూ పెరుగుతున్న వస్తువుల ధరలు, అధిక ద్రవ్యోల్బణం మధ్య 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక ప్రకాశ వంతమైన ప్రదేశంగా ఉద్భవించింది. మనమందరం ఒక పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధం కావాలి. నూతన విశ్వాసంతో కొత్త మార్గంలో పనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి’ అని వార్షిక నివేదికలో వివరించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం కౌంట్‌డౌన్ మొదలైనందున సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ రేడియో తరంగాలను జూలై 26 నుంచి వేలం వేయనున్న సంగతి తెలిసిందే. జూలై 22, 23 తేదీల్లో టెలికం శాఖ మాక్ ఆక్షన్ నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు అదానీ ఎంటర్ప్రైసెస్ సైతం వేలంలో పాల్గొంటున్నాయి. ఇది కూడా చదవండి: రూపాయి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు -
ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది. కూలీలకు పనికల్పనతో పాటు ఉపాధి హామీ పథకం నిర్వహణలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు పదికోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అందులో ఇప్పటికే 9.85 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది. ఈ ఏడాది కేటాయించిన పనుల లక్ష్యాలను చేరుకుంటుండడం తో పాటు పనుల కల్పనలో పురోగతిని అంచనా వేసి, దాదాపు రెండు నెలల క్రితమే మరో రెండుకోట్ల పనిదినాలని అదనంగా కల్పించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈమేరకు రాష్ట్రానికి మరో రెండుకోట్ల పనిదినాలకు అదనంగా అనుమతినిచ్చింది. 14 రాష్ట్రాలు 50 శాతం లోపే.. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాలు ఉపాధి పనుల కల్పనలో 50% లోపే లక్ష్యాలను చేరుకోగా, 9.85 కోట్ల పని దినాలతో 87.38% ప్రగతితో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 23.61 లక్షల కుటుంబాల్లోని 38.97 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రోజుకు రూ. 150 చొప్పున ఒక్కో కూలీకి సగటున వేతనం అందింది. ఇప్పటివరకు రోజువారీ వేతనాలుగా కూలీలకు రూ. 1,477 కోట్ల మేర వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకున్నారు. పనుల కల్పనలో జోగుళాంబ గద్వాల జిల్లా 77%తో అట్టడుగున నిలవగా.. నిర్మల్ జిల్లా 92%తో, ఆదిలాబాద్ జిల్లా 90%తో అగ్రభాగాన నిలిచాయి. -
ఆత్మహత్యల నివారణకు ఫేస్ బుక్ టూల్స్
నిరుత్సాహంతో, నైరాశ్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యలను నివారించడంపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక టూల్స్‌ను ఆవిష్కరించింది. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్స్ ప్రవేశపెట్టింది. ఈ టూల్స్‌ను గతేడాదే అమెరికాలోకి అందుబాటులోకి తెచ్చింది. ఫోర్ ఫ్రంట్, లైఫ్ లైన్, సేవ్.ఆర్గ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ టూల్స్ ను ఫేస్ బుక్ అమెరికాలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారతదేశంతో పాటు అన్ని దేశాల్లోకి తీసుకొచ్చేసింది. భారత్ లో దీపికా పదుకొనే లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్, ఆస్రాల సహకారంతో ఈ టూల్స్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న అన్ని భాషలు.. బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూల్లోకి ఈ టూల్స్ ను తీసుకొచ్చింది. మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ సంస్థలతో కలిసి ఫేస్ బుక్ ఈ టూల్స్‌ను డెవలప్ చేసింది. స్నేహితుడు నైరాశ్యంలో, నిరుత్సాహంతో ఉండడాన్ని సోషల్ మీడియా కాంటాక్టుల ద్వారా, చాటింగ్స్ ద్వారా యూజర్లు గుర్తించినప్పుడు ఆ సమాచారాన్ని వేగంగా ఇతరులతో షేరు చేసుకోవడం, ఆ వ్యక్తికి ధైర్యాన్ని నింపడం వంటి చర్యలకు ఈ టూల్స్ సహకరిస్తాయి. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న విషయాన్ని గుర్తించిన స్నేహితులు నేరుగా ఫేస్ బుక్ గ్లోబల్ టీమ్ కు కూడా రిపోర్టు చేయవచ్చు. ఇలా స్నేహితులను ఆత్మహత్యల నుంచి బయటపడేయొచ్చని ఫేస్ బుక్ పేర్కొంది. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని భావిస్తే వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులను కాంటాక్టు చేసేలా ఫేస్ బుక్ యూజర్లకు సూచించనుంది. ఫేస్ బుక్ సపోర్టు చేసే అన్ని భాషల్లో ఈ టూల్స్ అందుబాటులోకి ఉండనున్నాయి.