former glory
-
పిల్లలమర్రికి పూర్వవైభవం
స్టేషన్ మహబూబ్‌నగర్: పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది. సుమారు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ కనులకు విందు చేస్తోంది. ఇదీ చరిత్ర: 700 ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక క్రమేణా శాఖోపశాఖలుగా విస్తరించి క్రమేణా మొద లñæక్కడో అంతు చిక్కని మహా వృక్షంగా ఎదిగింది. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టును పర్యాటకులను అలరించేంది. దాని చల్లని నీడన ప్రజలు సేద తీరేవారు. పిల్లలతో పాటు యువత ఊడల్ని పట్టుకుని ఊగేవారు. మొత్తం మీద ఓ పర్యాటక ప్రదేశంగా ఈ చెట్టు దేశ, విదేశీయుల్ని ఆకర్షించింది. అయితే సుమారు ఏడేళ్ల క్రితం (2017న డిసెంబర్ 16)ఈ మహా వృక్షానికి సంబంధించిన భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది. ఆ తర్వాత క్రమంగా మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. దీంతో అటవీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ప్రత్యేక ట్రీట్మెంట్తో.. భారీ కొమ్మ విరిగిపడిన నేపథ్యంలో పిల్లలమర్రి పునరుజ్జీవం కోసం మెరుగైన చికిత్స అందించే బాధ్యతను అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ అటవీ శాఖకు అప్పగించారు. 2017న డిసెంబర్ 20నే పర్యాటకులు ఊడలపై కూర్చోకుండా, వాటికి వేలాడకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అటవీ శాఖ పరిశోధనా నిపుణుల సలహాలు, సూచనలతో ప్రత్యేక ట్రీట్మెంట్ను ప్రారంభించారు.పిల్లర్ల రక్షణలో పిల్లల మర్రికొమ్మలు, ఊడలు విరిగిపోకుండా, కిందికి పడకుండా అధికారులు వాటికి సహాయంగా పిల్లర్లు నిర్మించారు. 2018 ఫిబ్రవరి నుంచి సెలైన్ బాటిళ్లతో పిల్లలమర్రికి ప్రాణం పోసే చర్యలకు ఉపక్రమించారు. ఒక బాటిల్ నీళ్లలో 20 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్ నీళ్లలో 5 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్ ఫాస్పేట్ చల్లారు. ప్రతి 15 రోజులకోసారి పంచగవ్వ, హ్యుబ్రిక్ యాసిడ్ కూడా పిచికారీ చేశారు. ఈ నేపథ్యంలో చిగురిస్తున్న ఊడలు త్వరగా పెరిగి చెట్లకు ఆధారంగా నిలిచేలా ఊడలకు ప్లాస్టిక్ పైపులు (రూట్ ట్రైనర్) బిగించారు. అందులో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, కోకోపెట్, మాస్ (నాచు) నింపారు. దీంతో చెట్టుకు కొత్త ఊడలు వచ్చాయి.అయిదడుగుల కంచె.. సీసీ కెమెరాలుపిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా, తాకకుండా చుట్టూ దాదాపు ఐదు అడుగుల ఎత్తున కంచె ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాచర్లను నియమించారు. ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లి తాకినా, ఆకులను తెంపినా ఫైన్ వేయనున్నారు. 2017 డిసెంబర్ తర్వాత మళ్లీ ఈ వారంలో పర్యాటకులను అనుమతించనున్నారు.రూ.40 లక్షల వ్యయంపిల్లలమర్రి చెట్టు ట్రీట్మెంట్కు, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.40 లక్షలు వ్యయం చేశాం. సందర్శనకు వచ్చేవారు పిల్లలమర్రి చెట్టును ఫెన్సింగ్ అవతలి నుంచే చూడాలి. చెట్టును తాకడానికి వీల్లేదు. ఎవరైనా తాకితే జరిమానా విధిస్తాం. – సత్యనారాయణ, డీఎఫ్ఓ -
ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తామని, ప్రజల రోజువారీ జీవనంలో భాగమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైద్యం, ఆరోగ్యం సహా అన్ని రంగాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం తమ ప్రధాన కర్తవ్యమని వివరించారు. ఆరోగ్యకరమైన వినోదానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని తెలిపారు. స్థానిక, గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు స్టేషన్ స్థాయిలో వక్తృత్వ, సంగీత తదితర పోటీలు నిర్వహించడం ద్వారా రేడియోను పాఠశాలల స్థాయి వరకు చేరువ చేస్తామని వేణుధర్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఆయన తాజాగా డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎరిజెర్ల గ్రామానికి చెందిన వేణుధర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) 1988 బ్యాచ్ అధికారి. 1990–2000 కాలంలో అకాశవాణి, దూరదర్శన్‌లో న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన ఆయన 2009–17 మధ్య సమాచార ప్రసార శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా, 2017–21 మధ్య కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
ప్రభుత్వ బడికి..ప్రాణం పోశారు!
సాక్షి,శ్రీకాకుళం : ఐకమత్యంగా ఉంటే ఎంతటి అవరోధాన్నైనా సులువుగా అధిగమించవచ్చని నిరూపించారు బైపల్లి గ్రామస్తులు. 1959లో ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రారంభమైన ఈ బడిలో కాల క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ప్రాథమిక పాఠశాలగా మారింది. మరికొద్ది సంవత్సరాలకు ఉపాధ్యాయులు లేక దీనస్థితికి చేరుకుంది. గత ఏడాది 13 మంది విద్యార్థులతో మూతపడే పరిస్థితికి చేరుకుంది. దీంతో గ్రామస్తులు పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. అయితే విద్యార్థుల కొరత ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించలేదు. గతంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై పలాస మండలానికి వెళ్లిపోవడంతో కేవలం డిప్వూటేషన్‌లో ఉపాధ్యాయులు వచ్చి వెళ్లేవారు. దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. ఈ ఏడాది మాత్రం తమ పిల్లలకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతో గ్రామస్తులు మూడుసార్లు సమావేశమయ్యారు. గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు, పెద్దలు, ఉద్యోగుల నుంచి సుమారు రూ.4 లక్షలు సేకరించి పాఠశాల నిధిని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటిం టా తిరిగి విద్యార్థుల తలిదండ్రులను ఒప్పించి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మరో 60 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. వీరికి విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుని కోసం ఎదురు చూడకుండా గ్రామంలో పాఠశాల బలోపేత కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన ముగ్గురు వలంటీర్లను నియమించారు. నెలకు రూ.20 వేలు ఖర్చు.. పాఠశాలలో ముగ్గురు విద్యా వలంటీర్లు, మరో ఆయాను నియమించారు. వలంటీర్ల కు ఒక్కొక్కరికీ గౌరవ వేతనంగా రూ.5000, ఆయాకు రూ.3000 అందిస్తున్నారు. ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చి పాఠశాలకు రంగులు, ఫర్నిచర్, యూనిఫాం, నోట్ పుస్తకాలు సమకూర్చారు. ప్రభుత్వ సహాయం లేకుండా సొంతంగా విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలలో చినవంక పాఠశాల నుంచి చొక్కరి ధర్మారావు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై వచ్చి తరగతులు బోధిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాసం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా బైపల్లి పాఠశాలలోనూ అధి కారుల సమక్షంలో సాముహిక సుమారు 25 మంది పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మండల ప్రత్యేకాధికారి శ్రీని వాస్, తహసీల్దార్ కల్పవల్లి, ఎంపీడిఓ తిరుమలరావు, ఎంఈ చిన్నవాడుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. -
గొల్లభామ’ చీరలకు పేరు తెస్తా..!
సినీ నటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత సిద్దిపేట జోన్/దుబ్బాక/దుబ్బాక టౌన్: గొల్లభామ చీరలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ప్రముఖ సినీనటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత హామీ ఇచ్చారు. గురువారం సిద్దిపేట, దుబ్బాకలో చేనేత సొసైటీలను సందర్శించిన ఆమె, అందులో పనిచేస్తున్న కార్మికులను పలకరించారు. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తే బంజారాహిల్స్‌లోని తన ‘సిగ్నేచర్’వస్త్ర దుకాణంలో గొల్లభామల చీరల విక్రయానికి శ్రద్ధ తీసుకుంటానన్నారు. తనతోపాటు వేలాదిమంది గొల్లభామ చీరలను కొనేలా ప్రోత్సహిస్తానన్నారు. దుబ్బాకలో చేనేత వస్త్రాల తయారీలో ఉన్న కార్మికుల జీవనస్థితిగతులను సమంత అడిగి తెలుసుకున్నారు. తయారీలో సంప్రదాయ విధానాలను పాటించడం వల్లే చేనేత ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ చేనేత రంగంపై శ్రద్ధ వహించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే కార్మికులకు మంచిరోజులు వస్తాయన్నారు. కార్మికులకు సరిపడా పనికల్పించి గౌరవంగా బతికేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. తాను కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నానని, అందుకే సొసైటీలను తరచూ సందర్శించి కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఆత్మహత్యల్లేని చేనేత రంగమే తన ధ్యేయమని సమంత అన్నారు. -
భద్రాద్రికి పూర్వ వైభవం
డివిజన్ పరిధిలోకి 9 మండలాలు విభజనంతో నష్టపోయిన భద్రాద్రికి ఊతం గతం కంటే పెరిగిన గ్రామాలు, జనాభా భద్రాచలం : జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం పట్టణానికి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. భద్రాచలంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నిన్నటి దాకా ఆందోళనబాట పట్టినవారంతా...తాజా పరిణామాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదు మండలాలకే పరిమితమైన భద్రాచలం రెవెన్యూ డివిజన్‌కు మరో నాలుగు మండలాలు కలుపుతూ ప్రభుత్వం డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలం డివిజన్‌కు ఈ చర్యలు ఊతమిచ్చేలా ఉన్నాయని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. పాల్వంచ డివిజన్ రద్దు చేసి, దాని పరిధిలో ఉన్న పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలను భద్రాచలం డివిజన్లో చేర్చారు. ఆయా మండలాల వారంతా రెవెన్యూ పనుల నిమిత్తం ఇక్కడకు రావాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారపరంగా అభివద్ధి చెందే అవకాశాలున్నాయని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలం డివిజన్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఏర్పడనుండడం, భద్రాచలం డివిజన్ పరిధిలోనే భద్రాద్రి పవర్ ప్లాంటు, సింగరేణి హెడ్‌క్వార్టర్, హెవీ వాటర్ ప్లాంట్, సారపాక ఐటీసీ కర్మాగారం వంటి భారీ కేంద్ర, రాష్ట్ర స్థాయి పరిశ్రమలపై ఇక్కడి డివిజన్ అధికారుల అజమాయిషీ ఉంటుంది. ఆ నాలుగు వస్తే ఇంకా మేలు భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని, పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న నాలుగు పంచాయతీలు(ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం) తిరిగి తెలంగాణలో కలిస్తే∙భద్రాచలం అభివద్ధి పుంతలు తొక్కే అవకాశాలున్నాయి. డివిజన్ కేంద్ర పరిధి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణం విస్తరణ జరగాలంటే చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అందుబాటులో ఉండాలి. కానీ భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కావటంతో పట్టణంలోని చెత్త పోసేందుకు కూడా స్థలం లేదు. ......................................................................................................... డివిజన్ స్వరూపం ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో మండలాలు 8 9 గ్రామాలు 650 726 పంచాయతీలు 119 88 మున్సిపాలిటీ 0 1 జనాభా 2,96,530 3,87,110 ......................................................................................................... -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్నాయని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ ఉందన్నారు. పార్టీని వార్డు, డివిజన్ స్థాయిలో కొత్త కమిటీలతో బలంగా తయారుచేయాలని నాయకులకు సూచించారు. సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్పై పోరాటాలను పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, సుధీర్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం
- శతవార్షికోత్సవంలో ఎమ్మెల్యేలు తిప్పారెడ్డి, చింతల, శంకర్ - యూనివర్సిటీ చేయడానికి కృషిచేస్తామని హామీ మదనపల్లె సిటీ : బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తామని ముగ్గురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలో ఆదివారం సాయంత్రం బీటీ కళాశాల శత వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. మొదట వారు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సభలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ బీటీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని, ఇలాంటి కళాశాల నేడు దీనస్థితికి చేరుకోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు పూర్వవైభవం వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాల్లో కళాశాలను యూనివర్సిటీగా చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే, కాలేజీ పూర్వ విద్యార్థి చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కాలేజీలో 1981-84లో డిగ్రీ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఇంతటి స్థాయిలో ఉన్నానంటే కాలేజీనే కారణమని స్పష్టం చేశారు. గతంలో ఉన్న కాలేజీ ప్రస్తుతం దాని ప్రభావం మసకబారడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. కాలేజీ పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత తనపై కూడా ఉందన్నారు. ఈ కళాశాలలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డితో పాటు పలువురు చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ మాట్లాడుతూ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తెచ్చేలా శాసనసభలో తన వాణిని వినిపిస్తామని తెలిపారు. పడమటి మండలాలకు కళాశాలను యూనివర్సిటీ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన బీటీ కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ పద్మావతి, జోళెంపాళెం మంగమ్మ, కాలేజీ కరస్పాండెంట్ వివేకానంద, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణరాణి, బీసెంట్ ట్రస్టు కార్యదర్శి సుధాకర్, లైజన్ ఆఫీసర్ ప్రసాదరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు రాజన్, బగ్గిడి గోపాల్, కాలేజీ మాజీ చైర్మన్లు రాందాస్‌చౌదరి, కంభం నాగభూషణరెడ్డి, కళాధర్, సుధాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్‌బాలాజీ, మాజీ ఎంపీపీ వల్లిగట్ల వెంకటరమణ, కాలేజీ అధ్యాపకులు, పూర్వపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.