former lover
-
బ్యాంకు క్యూలో మాజీ ప్రియుడు...
బ్యాంకుల వద్దకు డబ్బుల కోసం వెళ్తే ఇంకా చాలా పనులే అవుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇలాగే జరిగింది. ఒక మహిళ (23) డబ్బులు తెచ్చుకుందామని త్రయంబక్ రోడ్డులోని ఓ బ్యాంకు వద్దకు వెళ్తే.. అక్కడ క్యూలైనులో గతంలో ఆమెను మోసం చేసి పారిపోయిన మాజీ ప్రియుడు కనిపించాడు. అయితే.. అక్కడ ఇద్దరూ కలిశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. నాలుగేళ్ల క్రితం అతడు తమ బంధాన్ని తెంచుకుని ఎటో వెళ్లిపోయాడని తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ.. బ్యాంకు పని వదిలిపెట్టి మాజీ ప్రియుడి పని పట్టింది. ముందుగా వెంటనే తన నాన్న, అన్నలకు విషయం చెప్పింది. వెంటనే వాళ్లిద్దరూ కూడా అక్కడకు వచ్చారు. ముగ్గురూ కలిసి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా అతగాడిని పట్టుకుని చితక్కొట్టారు. తర్వాత అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం అతడు తనను మోసం చేసి వెళ్లిపోయాడని, అప్పటినుంచి అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదని సత్పూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అతడిని ప్రశ్నించడానికి తొలుత పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చామని, అయితే ఒంటి నిండా గాయాలు ఉండటంతో ముందుగా ప్రభుత్వాస్పత్రికి పంపామని పోలీసులు చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు. -
'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'
బ్రిటన్: ఆమె తన మాజీ ప్రేయసి.. ఒకప్పుడు ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. కొద్దికాలం విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. గతంలో ఉన్న చనువు మేరకు వారిద్దరు తిరిగి శృంగారంలో పాల్గొన్నారు. కాకపోతే, ఆ ప్రియుడు ఆమె ముందు నిజం దాచాడు. ఆ నిజమేమిటంటే అతడికి అప్పటికే హెచ్ఐవీ సోకింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ అతడు తాఫీగా తనకు ఎయిడ్స్ ఉందంటూ బహిర్గతం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మాజీ ప్రేయసి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎందుకు ఇంతపనిచేశావ్ అని నిలదీస్తే ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతడే.. చార్లీ షీన్. తొలుత రంగస్థల నటుడిగా ఉన్న ఇతడు అనంతరం పలు అమెరికన్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నాడు. కానీ, అతడి విచ్చల విడితనం కారణంగా హెచ్ఐవీ సోకింది. ఆ విషయాన్ని తన మాజీ ప్రేయసికి చెప్పకుండా దాచేశాడు. ఇదే విషయాన్ని అతడిని ఆమె ప్రశ్నిస్తే ఏం చెప్పాడో ఒకసారి చూస్తే.. మాజీ ప్రేయసి: నీకు ఎయిడ్స్ లేదని ఎందుకు చెప్పావ్? షీన్: అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాజీ ప్రేయసి: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆ విషయం తెలుసుకోవడం నా హక్కు షీన్: నువ్వు ఇలాంటివి కోరుకోకూడదు.. అంటూ ఇంకా ఎన్నో కొన్ని చెప్పకూడని మాటలు వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు.