ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం
లండన్: 32 కోట్ల ఏళ్లకింద నాటి వృక్ష శిలాజ వేరు మూలకణాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ వేరు ఇంకా పెరుగుతూనే ఉందని తెలిపారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఈ పరిశోధనను నిర్వహించారు. శిలాజ వృక్ష కాండం వేర్లు, బతికున్న చెట్ల వేర్ల తరహాలోనే నిర్మాణం, వృద్ధి జరుగుతోందని పరిశోధకుడు అలెగ్జాండర్ హెతెరింగ్టన్ తెలిపారు. మూలకణాల్లోని స్వయం పునరుద్ధరణ కణాలు బహుకణ జీవుల పెరుగుదలకు ఏవిధంగా సహయపడతాయో తెలుసుకోవచ్చన్నారు.