foundation stone of the capital
-
రాజధాని పేరిట అక్రమ దందా
పెద్ద కొడుక్కి విరాళమట! పింఛను సొమ్ములో రూ.100 కోత జన్మభూమి కమిటీల తీర్మానాలంటూ తెలుగు తమ్ముళ్ల హడావుడి ప్రశ్నిస్తే.. పింఛను రాదంటూ హెచ్చరికలు కౌతవరం బ్యాంకు ప్రాంగణంలో బాహాటంగా వసూళ్లు రెండు జిల్లాల్లో రూ.7 కోట్ల వసూలు లక్ష్యం! రాజధాని శంకుస్థాపన పేరుతో వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెరతీసింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా ఈ వసూళ్లకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని పింఛను రాదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. విరాళం అంటే ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి.. కానీ ముందే రూ.100 చొప్పున కోత విధించి మిగిలినదే చేతిలో పెడుతుండటం శోచనీయం. విజయవాడ : రాజధాని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సరికొత్త దందాకు తెరతీశారు. ఇసుక మొదలుకొని మద్యం షాపుల వరకు దేనినీ వదలని ‘తెలుగు’ తమ్ముళ్లు ఆఖరికి పింఛనుదారుల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇకపై పింఛను రాదంటూ బెదిరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పింఛనుదారుల నుంచి రాజధాని నిర్మాణానికి విరాళం పేరుతో పింఛను మొత్తంలో రూ.100 కోత విధించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజుల నుంచే జన్మభూమి కమిటీలు తీర్మానం చేశామంటూ హడావుడి చేసి ఈ నెల రెండో తేదీ నుంచి ఈ వసూళ్లు మొదలుపెట్టాయి. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఫించనుదారులు అక్రమ వసూళ్ల పర్వాన్ని నిలదీయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామాల్లో అలజడి... ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెయ్యి రూపాయల పింఛను నెలనెలా ఇస్తున్నాడు. అందులో రూ.100 విరాళం రాజధాని నిర్మాణం కోసం పెద్ద కొడుక్కి ఇవ్వలేరా.. అంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వసూళ్ల బాధ్యత పంచాయతీ సర్పంచ్, స్థానిక జన్మభూమి కమిటీలపై పెట్టడంతో గ్రామాల్లో అలజడి మొదలైంది. రెండు జిల్లాల్లో కలిపి 7.01 లక్షల మంది అన్ని కేటగిరీల పింఛనుదారులు ఉన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.67.89 కోట్లు నెలనెలా బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నాయి. మరో వారం వ్యవధిలోనే రెండు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్లు వసూలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇచ్చే సొమ్ములో ముందే కోత... జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, తోడు కోల్పోయి అనాథలుగా మారిన వితంతువులు, అంగవైకల్యంతో ఉన్న వికలాంగులపై జాలి చూపాల్సింది పోయి.. వారికి ఇచ్చే అరకొర సొమ్ములోనే విరాళాల పేరుతో అడ్డగోలు వసూళ్లకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటనలు చేసి మరీ రూ.100 విరాళం ఇవ్వాలని కోరుతుండగా, ఇక్కడ మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వసూళ్లు సాగిస్తున్నారు. బ్యాంకర్లతో ముందే మాట్లాడుకుని ఇచ్చే పింఛను మొత్తంలో నుంచి రూ.100 ముందే కోత విధించి మిగిలిన సొమ్ము లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్ చేయటం గమనార్హం. మంగళవారం కౌతవరం ఆంధ్రాబ్యాంకు ప్రాంగణంలోనే టీడీపీ నేతలు ఈ వసూళ్లకు తెగబడటం వివాదాస్పదమైంది. తమకు ఏ గతీ లేక పింఛను తీసుకొని బతుకుతున్నామని, అందులోనూ కోత విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. రాజధానికి ఎందుకివ్వాలి రాజధాని నిర్మాణానికి పింఛనుదారుల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే డబ్బుల్లో ముందే కోత విధించి పింఛను ఇవ్వటం విడ్డూరంగా ఉంది. అసలు రాజధాని నిర్మాణానికి చందాలు పింఛనుదారులే ఎందుకు ఇవ్వాలి. ఇష్టమైతే చందా ఇస్తారు గాని బలవంతంగా లాక్కుంటారా? - దాసి రాధాకృష్ణ, కౌతవరం శివారు బలరామపురం కమిటీ నిర్ణయిస్తే దందా చేస్తారా? గ్రామంలో చంద్రబాబు చెబితే కమిటీ వేసుకున్నారట. ఆ కమిటీ చెప్పిన మేరకు ఈ వసూళ్లు చేస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? వందేసి రూపాయలు బలవంతంగా వసూలు చేయటం దారుణంగా ఉంది. దానికి రాజధాని నిర్మాణం పేరు పెట్టి ఏదో బాకీలాగా బలవంతంగా వసూలు చేస్తున్నారు. - బోలపాటి నిర్మల, కౌతవరం శివారు బలరామపురం -
ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ?
విలేకర్లతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొరిటెపాడు(గుంటూరు): రాజధాని శంకుస్థాపన రోజు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మంత్రి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు ముఖం చెల్లక శంకుస్థాపనకు రాలేదని ఆరోపించారు. -
అపురూపం
సర్వాంగ సుందరంగా ఉద్దండరాయునిపాలెం తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదికలు ప్రాంగణంలో సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం రెండు గంటల పాటు సభ ఏర్పాట్ల పరిశీలన కంపార్టుమెంట్లలో సీటింగ్పైనే ప్రధానంగా చర్చ రైతులకు, వీఐపీలకు తొలి వరుసలో ప్రాధాన్యం ఏర్పాట్లు పరిశీలించిన 16మంది రాష్ట్ర మంత్రులు సందర్శకులకు అనుమతి నిరాకరణ విజయవాడ : రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సభాప్రాంగణంలో పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. మరో 24 గంటల వ్యవధిలో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రాంగణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వేదిక నిర్మాణం మొదలుకొని కంపార్టుమెంట్ల వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి. పార్కింగ్ ప్రదేశాలతోపాటు ఉద్దండరాయునిపాలెం చేరుకోవడానికి ఉన్న తొమ్మిది ప్రధాన రహదార్లకు మరమ్మతులు పూర్తిచేసి సిద్ధం చేశారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని, ప్రధాని భద్రతకు విఘాతం కలుగుతుందనే కారణంతో సందర్శకుల అనుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించి సభాప్రాంగణం అంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శంకుస్థాపన జరిగే ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మరోవైపు సభా ప్రాంగణంలో ప్రధాని ఆశీనులయ్యే వేదిక నిర్మాణం పూర్తయింది. ఎస్పీజీ సూచనలతో ప్రత్యేక వేదికలు నిర్మించారు. 12 లక్షల అడుగుల మేర భారీ షెడ్లను కంపార్టుమెంట్ల కోసం నిర్మించారు. మొత్తం 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కంపార్టుమెంట్లో 20 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపార్టుమెంట్‌ను ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. సంకల్ప జ్యోతి వెలిగించిన సీఎం.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సంకల్ప జ్యోతిని సభాప్రాంగణంలో చంద్రబాబు వెలిగించారు. అంతకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రాంగణానికి చేరుకున్న పవిత్ర మట్టి, నీటి కలశాలకు సీఎం ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. అక్కడి నుంచి 13 జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు, రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల నమూనా దేవాలయాలతో ఉన్న వాహనాలు సభాప్రాంగణానికి చేరుకున్నాయి. క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ముఖ్యమంత్రి రెండు గంటల సేపు సభాప్రాంగణంలో కలియదిరిగి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. సీఎంతోపాటు 16 మంది రాష్ట్రమంత్రులు ఏర్పాట్లు పరిశీలించారు. ఇంకోవైపు బుధవారం నుంచి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హోమ ద్రవ్యాలు తీసుకువచ్చారు. పీఎం కాన్వాయ్ ట్రయల్న్ ప్రధాన మంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పోలీసు అధికారులు నిర్వహించారు. దీంతోపాటు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు ట్రయల్ రన్ నిర్వహించాయి. -
22న జరిగే శంకుస్థాపన చరిత్రాత్మకం
♦ అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్న ముఖ్యమంత్రి ♦ ప్రధాన వేదిక, హెలిప్యాడ్లు, రోడ్ల పనుల పరిశీలన ♦ బందోబస్తు, రాజధాని రైతులకు వసతులపై ఆరా ♦ పవిత్ర మట్టి, జలాల వద్ద ప్రత్యేక పూజల్లో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని చరిత్రాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం సాంప్రదాయంగా భారీగా ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపన జరిగే ఉద్ధండ్రాయునిపాలెం సభా ప్రాంగణం ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి బయలుదేరి ఉద్దండ్రాయునిపాలెం చేరుకున్న అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధాన జ్యోతిని ఆవిష్కరించిన సీఎం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. శంకుస్థాపన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయనీ, కనీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రధాన వేదిక, దాని పక్కనే ఉన్న రెండు ఉప వేదికలు, అక్కడే సిద్ధం చేసిన యాగశాల, శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం పరిశీలించారు. ఇంకా పూర్తి చేయాల్సిన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్, జేసీలతో చర్చించారు. అనంతరం రాజధాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని, సాంస్కృతిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ ప్రదేశాల గురించి ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. పుణ్య జలాలు, మట్టిని కలిపి బుధవారం హెలికాప్టర్ ద్వారా సీఆర్ డీఏ ప్రాంతం అంతా చల్లిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ ప్రాంతం అంతా శక్తివంతం చేయటానికి, మట్టిని, నీటిని చల్లి పవిత్రం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వివరించారు. మంగళవారం రాష్ట్రంలోని 13 జిల్లాలు, దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన జలాలు, మట్టి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణంలోకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాజధాని నిర్మాణం కోసం మహాసంకల్ప పత్రాలు అందించిన వారందరి జ్ఞాపకాలు చిరస్థాయిగా మిగిలేలా భద్రపరిచి భూమిలో శాశ్వతంగా ఉండేలా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డులు, 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి, మానససరోవరం, మక్కా మసీదు, జెరూసలెం లాంటి పుణ్య క్షేత్రాలతోపాటు గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్య్ర సంగ్రామ యోధులు జన్మించిన ప్రాంతాల నుంచి పవిత్ర జలాలు, మట్టి ఇక్కడికి చేరుకున్నాయని చెప్పారు. ‘మన నీరు-మన మట్టి’, ’నా ఇటుక- నా అమరావతి’ కార్యక్రమాలను రాష్ట్రంలోని 5 కోట్ల మందిని భాగస్వాముల్ని చేయటానికే నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన మట్టి, జలాలు ఉన్న వాహనాలు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నమూనాలతో ఉన్న వాహనాలు, 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక వాహనాల ర్యాలీని సీఎం ప్రారంభించారు. అప్రతిష్ట తేవాలని చూస్తున్నారు రాజధాని శంకుస్థాపనను కొన్ని రాజకీయ పార్టీలు అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఏదో ఒక ఇబ్బందిని సృష్టించడానికి కొందరు చూస్తారని అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాజధానిని ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం అంతకుముందు శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 19వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తికావాలని ముందు నుంచి చెబుతున్నా ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అన్ని పనులకు కమిటీలు వేసి, నిర్దిష్టంగా బాధ్యతలు అప్పగించినా ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదని, అందుకే ఇంకా చాలా పనులు మిగిలిపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణం నుంచి ఇచ్చిన పనుల్లోనే ఉండాలని ఎప్పటికప్పుడు తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇది విశ్వనగరం: కోడెల దసరా పండగ ఈసారి కొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని ముందే మోసుకొచ్చిందనీ, భవిష్యత్తులో ఇక్కడి ప్రాంతమంతా విశ్వనగరంగా మారనుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఉద్ధండ్రాయునిపాలెం వచ్చి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. -
రాజధాని శంకుస్థాపన సభకు 3000 బస్సులు!
ఉద్దండరాయునిపాలెంలో ఈ నెల 22న జరగనున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మొత్తం మూడు వేల బస్సులు.. మరో మూడు వేల వరకు కార్లు.. ఇవి కాకుండా ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం 300 కార్లు, గన్నవరం నుంచి వీఐపీల వినియోగం కోసం 200 ప్రత్యేక వాహనాలు, 10 వోల్వో బస్సులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరమైతే వాహనాల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు నామమాత్రపు ధర చెల్లించి వినియోగించాలని నిర్ణయించింది. సభకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారందరికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు అప్పగించారు. దీన్నంతటినీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పర్యవేక్షించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కీలక పనులు ముగింపు దశకు చేరాయి. వేదిక ముస్తాబు, ప్రత్యేక అలంకరణ పనులు మరో రెండు రోజుల్లో మొదలుకానున్నాయి. నేడు రవాణా శాఖ ఉన్నతాధికారుల సమావేశం... ఈనెల 22న తుళ్ళూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభ జరగనుంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి 1000 బస్సులు మరో 500 కార్లు సమకూర్చాలని ఆదేశాలు అందాయి. అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వెయ్యి వరకు బస్సులు మరో 300 కార్లు జనసమీకరణ కోసం కేటాయించాలని ఆదేశాలు అందాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాల నుంచి మరో వెయ్యి బస్సులు, వందల సంఖ్యలో వాహనాలను సమకూర్చనున్నారు. దీనిపై శనివారం రవాణా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాల నుంచే భారీగా జనసమీకరణ చేయనున్నారు. రెండు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు, వివిధ ప్రైవేట్ స్కూల్ బస్సులను పూర్తి స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మరో 500 వరకు ఆర్టీసీ బస్సులను కూడా రిజర్వ్‌లో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. షెడ్లు ఏర్పాటు.. ఇప్పటికే సభా ప్రాంగణంలో షెడ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 12 లక్షల అడగుల మేర షామియానాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సభకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వెనుక భాగంలో ప్రధాన మంత్రి కోసం రెండు హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. సభకు హాజరయ్యే 30 వేల మంది రైతులకు వేదిక ముందు భాగంలో ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు. కేటగిరీల వారీగా 18 నుంచి పాస్‌లు పంపిణీ చేయనున్నారు. 300 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్ర వారంతో ముగిసింది. వస్త్రాల అందజేత ... రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర మంత్రులు సంప్రదాయ రీతిలో వస్త్రాలు, స్వీట్ బాక్స్, ఆహ్వానపత్రాలు అందజేసే కార్యక్రమం మండలంలోని నేలపాడు గ్రామంలో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు కలసి వచ్చి కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళకు వాటిని అందజేశారు. -
అమరావతి శంకుస్థాపనపై చీఫ్ సెక్రటరీ కసరత్తు
విజయవాడ : రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) విజయవాడ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, కమిషనర్ శ్రీకాంత్, పర్యాటక ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎం.కె.మీనా, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే తదితరులు సమావేశమై ఏర్పాట్లను చర్చించారు. చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ముఖ్య అతిథులు, విదేశీ అతిథులు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విశిష్ట అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికి తగిన ఏర్పాట్లు చేయాలని చీప్ సెక్రటరీ కృష్ణారావు ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగి, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంస్కృతిక డెరైక్టర్ కె.కన్నబాబు, విజయభాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) విజయవాడ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, కమిషనర్ శ్రీకాంత్, పర్యాటక ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎం.కె.మీనా, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే తదితరులు సమావేశమై ఏర్పాట్లను చర్చించారు. చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ముఖ్య అతిథులు, విదేశీ అతిథులు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విశిష్ట అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికి తగిన ఏర్పాట్లు చేయాలని చీప్ సెక్రటరీ కృష్ణారావు ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగి, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు, కె.కన్నబాబు, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
అందరి సంకల్పంతో అమరావతి
♦ స్వగ్రామంలో మట్టి, నీరు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ♦ రాజధానిశంకుస్థాపన విజయవంతం కావాలని పూజలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజలందరి సంకల్పంతో రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎం స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మంగళవారం నిర్వహించిన ‘మన మట్టి- మన నీరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, వేలూరులోని స్వర్ణదేవాలయంతోపాటు, ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులు, అర్చకులు మంగళవాయిద్యాల హోరు నడుమ ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజధాని శంకుస్థాపనకు స్వగ్రామంలోని నాగాలమ్మకు పూజ చేసి పుట్ట మట్టిని, పవిత్ర జలాలను చంద్రబాబు సేకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలని ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 16 వేల గ్రామాల్లో ‘మన నీరు, మన మట్టి, మన రాజధాని అమరావతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. దీనికి స్థల బలం, వాస్తు బలం ఉందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం గ్రామాల్లో మట్టి, నీరు సేకరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వీటిని ఊరేగింపుగా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి శంకుస్థాపన ప్రాంతానికి చేర్చాలని పేర్కొన్నారు. నిర్మాణ సంకల్ప పత్రం తయారు చేశామన్నారు. 16 వేల గ్రామాల నుంచి వచ్చే సంకల్ప పత్రాలను భూగర్భంలో భద్రపరుస్తామని తెలిపారు. పవిత్ర జలం, మట్టినీ కలిపి శంకుస్థాపనలో ఉపయోగిస్తామన్నారు. ఓ స్మారక స్థూపం నిర్మిస్తామన్నారు. దీన్ని పవిత్ర స్థలంగా మారుస్తామని పేర్కొన్నారు. అందరూ గర్వంగా చెప్పుకొనే విధంగా రాజధానిని నిర్మిస్తామన్నారు. -
ప్రధాని వస్తున్నారు
రాజధాని శంకుస్థాపనకు ఖరారైన నరేంద్ర మోదీ పర్యటన ♦22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ♦ మధ్యాహ్నం 12.35 గంటలకు రాజధాని శంకుస్థాపన పూజ ♦ సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో టెర్మినల్ ప్రారంభం ♦ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం సాక్షి, విజయవాడ బ్యూరో/గుంటూరు వెస్ట్: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీ మధ్యాహ్నం 12.35 గంటలకు అమరావతిలో జరిగే రాజధాని శంకుస్థాపన, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు తిరుపతి చేరుకొని అక్కడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకొని రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఇది ఇలా ఉండగా.. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 13 జిల్లాల కలెక్టర్లు, దేవాదాయశాఖ అధికారులతో తన నివాసం నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. పండుగ వాతావరణం నెలకొల్పాలి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 13 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలోను మట్టిని, ఆ గ్రామ వాగు, కాల్వల నుంచి నీటిని సేకరించి అన్ని మతాల పెద్దల ఆశీస్సులు తీసుకుని రాజధాని ప్రాంతానికి చేర్చాలని సూచించారు. ప్రముఖశిల్పి రాజీవ్ సేథీ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మించే చారిత్రక స్థూపం వద్ద వీటిని నిక్షిప్తం చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 150 దేవాలయాలు, 50 క్రైస్తవ మందిరాలు, 50 మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల నుంచి పవిత్ర పసుపు పత్రాలను సేకరించి కాలనాళిక(టైమ్ క్యాప్స్యూల్)లో భద్రపరచాలని అన్నారు. రాజధాని నిర్మాణంపై సీఆర్డీఏ రూపొందించిన బుక్లెట్లను పాఠశాలలు, కళాశాలలకు పంపాలని సీఎం ఆదేశించారు. శంకుస్థాపనకు శాఖల వారీగా ఖర్చు రాజధాని శంకుస్థాపనకు ఖర్చు ఎంత అన్నది ఒకటి, రెండు రోజుల్లో ఓ అంచనాకు వస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వ శాఖల వారీగా పనులు అప్పగించి ఖర్చులు ఆయా శాఖలు భరించేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆహ్వానపత్రం దగ్గర్నుంచి శంకుస్థాపన బహిరంగసభ వరకు ముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. కేసీపీ సిమెంట్స్ సంస్థ లక్ష మోడ్రన్ ఇటుకలను రాజధాని కోసం ఇస్తున్నారని ఆయన ప్రకటించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. గుంటూరులో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ప్రధానమంత్రితోపాటు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ దేశాల రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారని భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే అతిథుల వసతి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలను గుర్తించాలని సూచించారు. శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లే రోడ్లన్నీ ఈనెల 18 లోపు పూర్తిచేయాలన్నారు. ప్రధానమంత్రి పర్యటన షెడ్యూలు ఇలా.. ప్రధాని మోదీ ఈనెల 22న ఉదయం 11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు గన్నవరం నుంచి అమరావతి బయలుదేరతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అమరావతిలో జరిగే రాజధాని శంకుస్థాపన, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 12.45 గంటలకు సభావేదికపై ఆలపించే మా తెలుగుతల్లి గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని, 1.40 గంటల వరకూ వేదికపై జరిగే కూచిపూడి నృత్య కార్యక్రమాలను వీక్షిస్తారు. 1.20 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం, ఆ తర్వాత సింగపూర్ ప్రతినిధులు, కేంద్ర మంత్రుల ప్రసంగాల తర్వాత ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు అమరావతి నుంచి తిరుపతి పయనమవుతారు. 3.05 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 4 గంటలకు తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభిస్తారు. 5.25 గంటలకు తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 6.30కు తిరుమల నుంచి బయల్దేరుతారు. రాత్రి 7.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారి సాక్షి, తిరుమల: ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ తొలిసారి తిరుమలకు రానున్నారు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలకాలని, ఆయన బస చేసేందుకు వీలుగా ఇక్కడి పద్మావతి అతిథిగృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్నారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2014, మే ఒకటిన ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ తిరుమలకు వచ్చారు. -
‘గన్నవరం’లో ఊపందుకున్న ఏర్పాట్లు
♦ 22న మోదీ, పలువురు సీఎంలు ముఖ్యుల రాకకు ఏర్పాట్లు ♦ బేగంపేట, తిరుపతి, రాజమండ్రి, విశాఖల్లోనూ విమానాల పార్కింగ్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జరగనున్న శంకుస్థాపన నేపథ్యంలో సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి పెరగనుంది. దీంతో ఇక్కడ ఏర్పాట్లు ఊపందుకున్నాయి.అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐదుగురు సీఎంలు, విదేశీ ప్రముఖులు వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపనకు వచ్చే 1,500 మంది వీవీఐపీ, వీఐపీల్లో చాలామంది గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో నాలుగు పెద్ద విమానాలు, రెండు చిన్న విమానాలు, ఒక హెలికాప్టర్‌ను పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 27 సర్వీసులు వచ్చి వెళ్తుంటాయి. రాజధాని శంకుస్థాపన రోజున దాదాపు 100 విమానాలు, హెలికాప్టర్లు రానున్నాయని అంచనా. విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో వీవీఐపీ, వీఐపీలను దించి, హైదరాబాద్‌లోని బేగంపేట, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గన్నవరంలో దిగిన ప్రముఖులను హెలికాప్టర్ల ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి తరలిస్తారు. ఇందుకోసం మూడు హెలిప్యాడ్లు, ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో మరికొన్ని హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే శంకుస్థాపన తాడికొండ: రాష్ట్రంలోని 4.3 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక మంత్రి పి.నారాయణ చెప్పారు. శంకుస్థాపన ఏర్పాట్ల బాధ్యతను గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉద్ధండ్రాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణాన్ని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి బుధవారం సందర్శించారు.15వ తేదీ నుంచి మనమట్టి-మననీరు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆ రైతులకు సీఎం వ్యక్తిగత ఉత్తరం.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 23 వేల మంది రైతులను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా ఉత్తరాలు పంపనున్నారని పరకాల ప్రభాకర్ తెలిపారు.