Four militants
-
ఆ నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష
పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా సోమవారం కీలక ప్రకటన చేశారు. కరుడుగట్టిన నలుగురు తీవ్రవాదులకు మరణ శిక్ష వేసినట్టు ఆయన ధృవీకరించారు. తమ దేశ పౌరులపై, భద్రతా దళాలపై వారు అతి క్రూరమైన దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. ఆర్మీ కమాండ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన వెలువరించిన కీలక ప్రకటన ఇదే. అత్తూర్ రెహ్మమాన్, మహమ్మద్ సబీర్, ఫరూక్ భట్టీ, గుల్ జరీన్‌లను నేరస్తులుగా గుర్తించి, ఈ శిక్ష విధించినట్టు తెలిపారు. ఈ నలుగురు 2014 డిసెంబర్ 16న పెషావర్ పాఠశాలపై దాడికి పాల్పడి, ఉరితీయబడ్డ మిలటెంట్ గ్రూపులకు చెందినవారని పేర్కొన్నారు. కాగ, పెషావర్ స్కూల్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో 150 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ దాడిలో నేరస్తులుగా ఉన్న నలుగురికి ఆ దేశం ఉరిశిక్ష వేసింది. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఈ నలుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులని, తమ దేశ పౌరులను, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులను, ఎయిర్‌పోర్టు సెక్యురిటీ ఫోర్స్‌లను అతిక్రూరంగా చంపడంలో వీరి ప్రమేయముందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. వారి దగ్గరున్న ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. జనరల్ బజ్వా పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా నవంబర్ 29నే ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
పెషావర్ దాడి ముష్కరుల ఉరితీత
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూలు ఉగ్రదాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. కోహత్ జిల్లాలోని కారాగారంలో బుధవారం వీరికి ఈ శిక్ష అమలైంది. పెనువిషాదాన్ని నింపిన ఈ దారుణ మారణకాండలో అబ్దుల్ సలాం, హజ్రత్ అలీ, ముజీబ్ ఉర్ రెహమాన్, అలియాస్ నజీబ్ ఉల్లా, సబీల్లను దోషులుగా నిర్ధారించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు తెహాద్వాల్ జిహాద్ గ్రూపు చెందినవారని గుర్తించింది. దీనికి సంబంధించిన పత్రాలపై సైనిక ప్రధానాధికారి జనరల్ రషీల్ షరీప్ సోమవారం సంతకం చేశారు. మరోవైపు ఈ ఘటన జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, ఈ ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశ అధ్యక్షుడు హుస్సేన్ ఆగస్టులో తిరస్కరించారు. వీరిపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం దోషులుగా తేల్చడంతో కోర్టు వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబర్ 16 న పెషావర్‌లోని ఓ ఆర్మీ స్కూలుపై దాడిచేసిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. పాక్ స్కూల్లో సైనికదుస్తుల్లో ప్రవేశించిన ముష్కరులు నేరుగా పిల్లలపై కాల్పులకు తెగబడ్డారు. పిల్లల్లో పెద్దవాళ్లని ఏరి మరీ కాల్చిచంపారు. ఈ ఘటనలో 150 మంది బలైన సంగతి తెలిసిందే. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఐదుగురు మృతి
కాశ్మీర్ : ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులతోపాటు ఓ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. హండ్వారాలోని సోచల్వారీ గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు బుధవారం సైనికులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ అపరేషన్ గ్రూప్‌కి చెందిన పోలీసులు, సైనికులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయం గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాంతో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్లో రెండు మృతదేహలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నలుగురు తీవ్రవాదులు పట్టివేత
ఇంపాల్: నలుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు మణిపూర్‌లో బుధవారం ఆర్మీ అధికారులు వెల్లడించారు. పశ్చిమ ఇంపాల్తోపాటు చౌరచంద్రపూర్ జిల్లాలలో ఈ తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), ద పీపుల్స్ రివల్యూషన్ పార్టీ ఆఫ్ కెంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే), ద యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్) మరియు కంగ్లీ యోవాన్ కన్నా లుప్ ( కేవైకేఎల్) తీవ్రవాద సంస్థలకు చెందిన వారని పేర్కొన్నారు. అయితే తీవ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని చెప్పారు. ఈ నలుగురు తీవ్రవాదులను ఆయా జిల్లాల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ నలుగురు తీవ్రవాదులను ఈ నెల మొదటి వారంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు వివరించారు.