నలుగురు తీవ్రవాదులు పట్టివేత | Four militants caught in Manipur | Sakshi
Sakshi News home page

నలుగురు తీవ్రవాదులు పట్టివేత

Published Wed, Jul 8 2015 1:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

Four militants caught in Manipur

ఇంపాల్: నలుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు మణిపూర్లో బుధవారం ఆర్మీ అధికారులు వెల్లడించారు. పశ్చిమ ఇంపాల్తోపాటు చౌరచంద్రపూర్ జిల్లాలలో ఈ తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), ద పీపుల్స్ రివల్యూషన్ పార్టీ ఆఫ్ కెంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే), ద యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్) మరియు కంగ్లీ యోవాన్ కన్నా లుప్ ( కేవైకేఎల్) తీవ్రవాద సంస్థలకు చెందిన వారని పేర్కొన్నారు.

అయితే తీవ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని చెప్పారు. ఈ నలుగురు తీవ్రవాదులను ఆయా జిల్లాల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ నలుగురు తీవ్రవాదులను ఈ నెల మొదటి వారంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement