కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఐదుగురు మృతి | Four militants, one Army jawan killed in encounter in north Kashmir: Police. | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఐదుగురు మృతి

Published Thu, Sep 3 2015 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

Four militants, one Army jawan killed in encounter in north Kashmir: Police.

కాశ్మీర్ : ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని హండ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులతోపాటు ఓ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. హండ్వారాలోని సోచల్వారీ గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు బుధవారం సైనికులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ అపరేషన్ గ్రూప్కి చెందిన పోలీసులు, సైనికులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

ఆ విషయం గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాంతో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్లో రెండు మృతదేహలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement