fourth win
-
కింగ్స్ ఎలెవన్ నాలుగో విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కింగ్స్ ఎలెవన్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్ జట్టు బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మాŠయ్చ్’ పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్ జట్టులో రషీద్ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ సీఆర్ జ్ఞానేశ్వర్ (52; 6 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. మరో మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలుత టైటాన్స్ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేయగా... చాంపియన్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రికీ భుయ్ (42 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. గిరినాథ్ (33), అశ్విన్ హెబర్ (36) కూడా రాణించడంతో చాంపియన్స్ జట్టు ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. క్వార్టర్స్‌లో దివిజ్ జంట నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): అస్తానా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బామ్‌బ్రిడ్జ్ ద్వయం 7–5, 4–6, 10–6తో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీని ఓడించింది. -
హామిల్టన్ హవా
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం తన ఆధిక్యాన్ని కొనసాగించి అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 45.279 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేత అయ్యాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 88వ విజయం కావడం విశేషం. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో, మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. సీజన్లో ఆరు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 132 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
తెలుగు టైటాన్స్ విజయం
ప్రొ కబడ్డీ లీగ్ పుణే: చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27-25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ఇది టైటాన్స్‌కు నాలుగో విజయం. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జైపూర్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. ఆట చివరి 2 నిమిషాల వరకు కూడా జైపూర్ 23-18తో స్పష్టమైన ఆధిక్యంలోనే ఉంది. అయితే 38వ నిమిషంలో టైటాన్ తరఫున సబ్ స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ప్రశాంత్ కుమార్ రాయ్ అద్భుతమే చేశాడు. వచ్చీ రాగానే రైడ్‌కు వెళ్లిన తను 2 పాయింట్లు సాధించి స్కోరును 23-20కి చేర్చాడు. ఆ తర్వాత మెరాజ్ షేక్ స్కోరును సమం చేశాడు. ఈ తరుణంలో జైపూర్ మెరుగ్గా ఆడి 25-24తో ఆధిక్యం సాధించింది. అయితే 41వ నిమిషంలో చివరి రైడ్‌కు వెళ్లిన ప్రశాంత్ రాయ్ ప్రత్యర్థి కోర్టులో ఉన్న ఏకైక ఆటగాడిని అవుట్ చేయడంతో ఆలౌట్ ద్వారా మూడు పాయింట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. మెరాజ్ షేక్ మొత్తం ఏడు రైడ్, నాలుగు టాకిల్ పాయింట్లు సాధించాడు. జైపూర్‌లో సోను నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 29-27తో పుణెరి పల్టన్‌ను ఓడించింది.