franklin india
-
దేశవ్యాప్తంగా ఫ్రాంక్లిన్ ఈవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఫ్రాంక్లిన్ ఈవీ దేశవ్యాప్తంగా డిసెంబర్‌కల్లా 200 షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ తదితర 30 నగరాల్లో 54 షోరూంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోనే 14 షోరూంలు ఉన్నాయి. 2021లో అమ్మకాలను ప్రారంభించి రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లకు చేరువయ్యామని ఫ్రాంక్లిన్ ఈవీ ఫౌండర్ డాక్టర్ శశిధర్ కుమార్ మంగళవారమిక్కడ తెలిపారు. నెలకు 3,000 యూనిట్లు.. కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయని కో–ఫౌండర్ రంజిత్ కుమార్ తెలిపారు. ‘నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాం. ఇతర దేశాల్లో అడుగు పెడతాం. 2023 చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరాలన్నది లక్ష్యం. ఇందుకు రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. కంపెనీలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్లాంటు ఉంది’ అని చెప్పారు. తొలి డ్యూయల్ బ్యాటరీ.. కోరో మోడల్‌కు డి మాండ్ బాగుందని కో–ఫౌండర్ నవీన్ కుమార్ తెలిపారు. ‘దక్షిణాదిన రిమూవ బుల్ డ్యూయల్ బ్యా టరీతో తయారైన తొలి మోడల్ ఇదే. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పవర్ ప్లస్, నిక్స్ డీలక్స్ మోడళ్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్‌కల్లా మరో 2 స్కూటర్లను ప్రవేశపెడతాం. కస్టమర్ల ఇంటి వద్దే సరీ్వస్ అందిస్తున్నాం. 2.1–3 కిలోవాట్ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ రిమూవబుల్ బ్యాటరీలను పొందుపరిచాం. వీటికి ఐక్యాట్–ఏఐఎస్ 156, బీఐఎస్, సీఈ, ఐఎస్వో, ఆర్‌వోహెచ్‌ఎస్ ధ్రువీకరణ ఉంది. ధర రూ.75 వేల నుంచి ప్రారంభం’ అని చెప్పారు. -
స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం...
పెట్టుబడులపై రిస్క్‌కు భయపడేవారు, డెట్ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్–సూపర్ ఇనిస్టిట్యూషనల్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అధిక రేటింగ్ కలిగిన షార్ట్ టర్మ్ డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లు, కమర్షియల్ పేపర్లు పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను ఆక్రమిస్తాయి. ఈ కేటగిరీలో గత పదేళ్ల కాలంలో టాప్ పథకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇందులో రాబడులను చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏడాది కాలంలో బెంచ్ మార్క్ (క్రిసిల్ లిక్విడిటీ ఫండ్ ఇండెక్స్) రాబడులు 7.2%గా ఉంటే ఈ పథకంలో 7.5%గా ఉన్నాయి. అలాగే, ఈ పథకంలో మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 8.7%, ఐదేళ్లలో వార్షిక రాబడులు 9.2%గా ఉన్నాయి. కేటగిరీ రాబడులు మూడేళ్లలో 7.2%, ఐదేళ్లలో 7.9% ఉండడం గమనార్హం. కేటగిరీతో పోలి స్తే దీర్ఘకాలంలో 1.5% అధిక రాబడులను ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ ఇచ్చింది. ఎక్కువ సమయాల్లో బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రాబడులను అందించిన చరిత్ర ఉంది. కనుక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేవారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ మొత్తంపై మంచి రాబడులను పొందొచ్చు. ఇక ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడుల దృష్ట్యా దీర్ఘకాల అవసరాలకు ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి ఈ పథకం అనువే. ఎందుకంటే డైనమిక్ బాండ్ లేదా క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ కంటే ఇందులోనే రాబడులు అధికంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో పేరులో ఉన్నట్టు... ఏడాదిలోపు కాల వ్యవధి తీరే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో ఈల్డ్‌ను కొన్నేళ్లుగా 8.5–8.7% మధ్య ఉండేలా చూస్తోంది. ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ తన పెట్టుబడుల్లో సగం మేర స్వల్ప కాల సాధనాలకు టాప్ రేటింగ్ అయిన ఏ1ప్లస్ వాటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. యాక్సిస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు సర్టి ఫికేట్ డిపాజిట్స్, హెచ్డీఎఫ్సీ, నాబార్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ పేపర్లు, ఐఆర్ఎఫ్సీ, రెన్యూ పవర్ తదితర కంపెనీల కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు ఉన్నాయి. ఇటీవల రేటింగ్ స్వల్పంగా తగ్గిన సాధనాల్లోనూ పెట్టుబడులు కలిగి ఉంది. కాకపోతే వీటి వెనుక పెద్ద వ్యాపార గ్రూపులు ఉన్నాయి. పిరమల్ రియాలిటీ, టాటా మోటార్స్, రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ ఇందుకు ఉదాహరణలు. మొత్తం మీద 75–80 వరకు భిన్న సంస్థల సెక్యూరిటీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. నిజానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను స్వల్ప కాలం కోసమే సూచిస్తుంటారు. అయితే, దీర్ఘకాలంలో రాబడులు మెరుగ్గా ఉన్నప్పుడు దీర్ఘకాల అవసరాలకు కూడా వీటిని ఎంచుకోవడం తప్పేమీ కాదు. -
ఈక్విటీల్లో స్థిరమైన రాబడుల కోసం
మిడ్‌క్యాప్ విభాగంలో మంచి రాబడులు ఆశిస్తూ అదే సమయంలో పెట్టుబడులకు భద్రత ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసేవారు ఎంపిక చేసుకునే మంచి పేరున్న పథకాల్లో ఇదీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రారంభమై 25 ఏళ్లు అయింది. అప్పటి నుంచి చూసుకుంటే రాబడుల్లో మేటిగానే కొనసాగుతోంది. రాబడులు ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచీ సగటున ప్రతీ ఏటా 20% రాబడులను ఇచ్చిందంటే దీని పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ నిఫ్టీ 500. మూడేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులు సగటున ఏటా 11.4%గా ఉన్నాయి. బెంచ్ మార్క్ నిఫ్టీ 500 రాబడులు ఈ కాలంలో ఏటా 9.3 శాతమే. ఐదేళ్ల కాలంలో ఏటా సగటున ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ 24.1% రాబడులను ఇవ్వగా, బెంచ్ మార్క్ రాబడులు 14.9%గానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో చూసుకున్నా ఈ పథకమే అగ్ర స్థాయిలో ఉంది. ఏటా సగటున 18.1% రాబడులను ఇవ్వగా... ఇదే కాలంలో నిఫ్టీ–500 రాబడులు ఏటా సగటున 10.6% కావడం గమనార్హం. భిన్న రంగాలు, ఆయా రంగాల్లో భిన్న స్టాక్స్ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం ద్వారా రిస్క్‌ను తగ్గించడం ఈ పథకం నిర్వహణ పనితీరులో భాగం. ఇక లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను యాడ్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ, లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతంలోపునకే పరిమితం చేస్తుంది. ఈ విధమైన వ్యూహాత్మక విధానాలతోనే మిడ్ క్యాప్ విభాగంలో రాబడులు, భద్రతా పరంగా ఈ పథకం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ విభాగంలో నంబర్ 1 కాకపోయినప్పటికీ... కేటగిరీతో పోలిస్తే సగటు కంటే ఎక్కువే రాబడులను ఇస్తూ ముందుండటం గమనించాలి. గడిచిన పదేళ్ల కాలంలో ఎస్బీఐ మ్యాగ్నం మిడ్‌క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ పథకాల కంటే పనితీరులో మెరుగ్గా ఉంది. పోర్ట్‌ఫోలియో, స్ట్రాటజీ స్టాక్స్ ఎంపికలోనూ ఫండ్ మేనేజర్లు జాగ్రత్తలు పాటిస్తుంటారు. విడిగా ఒక్కో స్టాక్‌లో పెట్టుబడులు 3–4% మించనీయరు. ఎంత ఉత్తమ కంపెనీ అయినా సరే 4% దాటకపోవడం గమనించాలి. అంటే రిస్క్, రాబడుల కోణంలోనే ఈ నియమాన్ని అమలు చేస్తున్నట్టు లెక్క. పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్ 50–60 వరకు ఉంటాయి. మార్కెట్లు ర్యాలీ సమయాల్లో రాబడులను అందించే విషయంలో మంచి స్థితిలో ఉండటం, అదే సమయంలో మార్కెట్ కరెక్షన్లలో నష్టాలు పరిమితంగా ఉండటం ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల అస్థిరత సమయాల్లో 7–9% వరకు నగదు నిల్వలను కొనసాగిస్తుంది. ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. గత ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగాల్లో ఎక్స్పోజర్ను పెంచుకుంది. ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశగా సాగిపోతే ఈ రంగాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లోనూ గత కొన్నేళ్లుగా పెట్టుబడులను పెంచుకుంటూ వస్తోంది. ఇక ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ను తగ్గించుకుంది. దీంతో ఈ కాలంలో ఐటీ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఆ అవకాశం కోల్పోయింది. -
19 ఏళ్ళలో 26 రెట్లు పెరిగింది
25వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 6.49 లక్షలయ్యింది మధ్యలో భారీగా పడినా ఆందోళన చెందలేదు ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ పేరుతో ప్రవేశపెట్టిన కొత్త శీర్షిక మాలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు స్ఫూర్తినిస్తోంది. దీంతో నా సక్సెస్ స్టోరీ కూడా ‘ప్రాఫిట్’ పాఠకులతో పంచుకోవాలనిపించింది.’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ. ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలో పనిచేస్తున్న నేను 1994 సెప్టెంబర్‌లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రైమా ప్లస్ (నాకు తెలిసినంతవరకు ఫ్రాంక్లిన్ ఇండియాకి ఇది తొలి పథకం)లో రూ.25,000 ఇన్వెస్ట్ చేశాను. అది న్యూ ఫండ్ ఆఫర్ కావడంతో ఒక్కొక్క యూనిట్ రూ. 10 చొప్పున 2,500 యూనిట్లు వచ్చాయి. కాని ఇన్వెస్ట్ చేసిన రెండేళ్ళలోనే నా ఇన్వెస్ట్మెంట్ విలువ సగానికి సగం ఆవిరైపోయింది. 1996 డిసెంబర్లో యూనిట్ విలువ రూ.5.88 పడిపోయింది. ఆ సమయంలో కాస్త భయపడ్డాను. అయితే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం కాబట్టి వైదొలగలేదు. ఇలా ధైర్యంగా ఎదురుచూసినందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం నా పెట్టుబడి రూ.25,000 కాస్త ఇప్పుడు ఇంచుమించుగా రూ.6.49 లక్షలకు చేరింది. అంటే ఈ పథకం సగటున 17 శాతం వార్షిక రాబడిని అందించింది. అలాగే నా పెట్టుబడి 26 రెట్లు వృద్ధి చెందినట్లు లెక్క. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ విలువ రూ.3 లక్షలకు పడిపోయింది. అప్పుడు కూడా నేను భయపడలేదు. కాని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. 1996లో భారీగా పడిపోయినప్పుడు చేతిలో డబ్బులుండి మరో రూ.25,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేదని. ఇలాంటి ఆలోచనలు మానవ సహజమే అయినా నా అనుభవంతో ఇన్వెస్టర్లకి చెప్పేది ఒక్కటే. ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచి ఎంత పెరిగింది అన్నది చూడకుండా మంచి పథకంలో ఇన్వెస్ట్ చేసి కనీసం 10 నుంచి 20 ఏళ్ళు ఎదురుచూస్తే తప్పక లాభాలు వస్తాయి. - జి.మురళీకృష్ణ, హైదరాబాద్