Free medical
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
‘ఆయుష్మాన్’ అమలుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఏళ్లు ఆపైబడిన వారందరికీ పేద, ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఆ వయస్సు వారు తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు అందజేస్తారు.ఆధార్ కార్డును ఆధారం చేసుకుని వయస్సును లెక్కించి కార్డులు ఇస్తారు. అలా కార్డులు పొందినవారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతోంది.ఇందుకు ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే, దీనికింద కవర్ అయ్యే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా 5 లక్షల మంది 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వైద్యం అందితే అందుకు అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. కలిపి అమలు చేయాలి ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల వ్యాధులకు చికిత్స అందుతుండగా, ఆయుష్మాన్ భారత్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్లోలేని 540 వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 వ్యాధులు ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలిపి అమలు చేయాలని వైద్య వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం వాటికి వర్తిస్తుంది.కిడ్నీ, లివర్ మారి్పడులు ఆరోగ్యశ్రీలో ఉండగా... ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండు స్కీంలు కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారికి 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఆయుష్మాన్‌లో చికిత్సల ప్యాకేజీల ధరలు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
ఆరోగ్యశ్రీ కార్డుంటే.. రూ.25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా.. ప్రమాదం సంభవించినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు వెంటబెట్టుకుని మీ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ వైద్య సిబ్బంది ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తూ.. పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన 1.48 కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా కార్డుల పంపిణీ చేస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు 1,04,326 కార్డుల పంపిణీ పూర్తి అయింది. ఒక్కో వారంలో నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సేవలు పొందడం ఇలా.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్‌వో, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను 1,059 రోగాల నుంచి 3,257 రకాల రోగాలను పెంచారు. ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందగలగటం వంటి ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారు. సులువుగా ప్రజలు పథకం సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్ చేయించి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా.. గడచిన వారంలో లక్షకు పైగా లబ్ధిదారుల ఫోన్ల ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. యాప్‌లో లాగిన్ అవ్వడం ద్వారా పథకం కింద అందే వైద్య సేవలు, నెట్వర్క్ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్ఎం, సీహెచ్‌వోలు ప్రజలకు వివరించారు. పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 104కు ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు. పనిలో పనిగా మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ను మహిళల ఫోన్లో ఇన్స్టాల్ చేయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో యాప్ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. -
అశక్తులకు ‘వైఎస్సార్ పెన్షన్’ శక్తి
సాక్షి, అమరావతి: .. ఇలా ఈ ఇద్దరికే కాదు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వేల మంది అశక్తులకు సీఎం వైఎస్ జగన్ పెన్షన్ అందిస్తూ వారికి శక్తినిస్తోంది. ఇలాంటి తీవ్ర, దీర్ఘకాలిక బాధితులను ఆదుకునేందుకు వారికి ఉచిత వైద్యంతో పాటు ప్రతినెలా పెద్ద మొత్తంలో వారికి పెన్షన్ అందిస్తూ జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫిలియా, తీవ్రమైన మూత్రపిండాల (కిడ్నీ) రోగులు, కిడ్నీ, లివర్, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి, ఇంకా అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు సైతం నెలవారీ పెన్షన్ అందిస్తూ వారికి కొండంత అండగా నిలుస్తోంది. అలాగే, దేశంలో అత్యధిక పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమార్ సైతం గతేడాది గుజరాత్లో జరిగిన జాతీయ సదస్సులో ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆభినందించారు. ఏపీని మిగిలిన రాష్ట్రాలూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మొత్తం మీద సామాజిక భద్రతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. దివ్యాంగులకు బాబు మొక్కుబడిగా.. గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దివ్యాంగులకు నామమాత్రంగా పెన్షన్ ఇచ్చి సరిపెట్టింది. అది కూడా వారిని రెండు కేటగిరిలుగా చూపించి రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున పెన్షన్ ఇచ్చేది. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి దివ్యాంగులతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాంత్వన చేకూర్చేలా పింఛన్లు మంజూరు చేసింది. దివ్యాంగులందరిని ఒకే కేటగిరిగా చేసి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను ఇస్తుండటం విశేషం. సామాజిక భ్రద్రతలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన ఉమాదేవి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ప్రతి 21 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయాలి. బిడ్డను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు పడుతున్న వేదనను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థంచేసుకుంది. ఉమాదేవికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రతినెలా రూ.10 వేలు పింఛను అందించి ఆ కుటుంబానికి భరోసా ఇస్తోంది. కర్నూలు జిల్లా చానుగొండ్ల గ్రామానికి చెందిన గంగాధర్ హిమోఫిలియాతో బాధపడుతున్నాడు. మోకాళ్లు, కాలిమడం, చేతులు (జాయింట్లు) వాపులు వాస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో తలసేమియా, సికిల్‌సెల్ రోగుల మాదిరిగానే గంగాధర్‌కు కూడా వైద్యం అందించి ఉచితంగానే మందులు ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా ప్రతినెలా రూ.10 వేలు అందిస్తోంది. అశక్తులకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలో అశక్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో 14 రకాల రోగ పీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు మొత్తం రూ.255కోట్లకు పైగా పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులతోపాటు తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫిలియా, బోదకాలు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ రోగులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, రోడ్డు ప్రమాదాలతో కుర్చీ, మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత వంటి సమస్యలున్న వారికి ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు నెలనెలా పింఛను ఇస్తూ ఆందుకుంటోంది. – బి. రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ -
విశాఖ ప్రజలకు నిరంతర సేవలందిస్తా
పేదల పరిస్థితులు నన్ను కదిలించాయి తన శివార్చన ఫలితమే విశాఖకు హుద్‌హుద్ గండం నుంచి రక్షణ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఏయూక్యాంపస్: సేవ చేయడంలోనే పూర్తి సంతృప్తి లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో టీఎస్ఆర్ ఉచిత వైద్య సేవా కార్యక్రమం ద్విదశ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలోని మురికి వాడల ప్రజల జీవనం తనను కదిలించిందన్నారు. వీరికి ఇంటి వద్దకే వైద్యం అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేజీహెచ్ అభివృద్ధికి, క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు తాను పూర్తిస్థాయిలో పనిచేశానన్నారు. తాను ఏటా సముద్ర తీరంలో చేస్తున్న శివార్చన ఫలితంగా హుద్‌హుద్ ప్రభావం నుంచి విశాఖ సురక్షితంగా బయట పడిందన్నారు. విశాఖ ప్రజలకు పూర్తిస్థాయిలో నిరంతర సేవలు అందిస్తానన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. పిఠాపురం స్వామీజీ డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఆధ్యాతిక, సామాజిక సేవను రెండు కళ్లుగా భావించి సుబ్బరామిరెడ్డి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సేవలు సాగడం శుభపరిణామమన్నారు. సామాజిక సేవ మహాశక్తిని అందిస్తుందన్నారు. సాయం పొందిన వారు అందించే ఆశీస్సులే మనతో ఎప్పుడూ ఉంటాయన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కళలు, వైద్య సేవలతో సుబ్బరామిరెడ్డి విశాఖ ప్రజలకు మన్ననలు అందుకున్నారన్నారు. తమ వర్సిటీలో రాజనీతిశాస్త్రం, ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించాలని కోరారు. మాజీ శాసన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి విశాఖ నగరం మానస పుత్రికగా నిలుస్తుందన్నారు. విశాఖలో ఆధ్యాత్మిక పునాదులు వేసిన వ్యక్తిగా ఆయన నిలుస్తారన్నారు. మానవతావాదిగా అందరి హదయాలను గెలుచుకున్నారన్నారు. వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి.రవి రాజు మాట్లాడుతూ ఉదాత్తమైన ఆదర్శంగా విద్య, సాంస్కతిక, ఆధ్యాత్మిక రంగాలో విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కేన్సర్ ఆస్పత్రి విశాఖ రావడానికి టీఎస్సార్ ఎంతో కషిచేశారంటూ అభినందించారు. ఏయూ పాఠశాలల భవనాల నిర్మాణానికి సైతం నిధులను అందించి ఏయూపై తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, డి.వరదా రెడ్డి, ఎస్.కె భాషా, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధన్ బాబు, మంత్రి రాజశేఖర్, మాజీ శాసన సభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం.... ఈ సందర్భంగా కేజీహెచ్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ జి.అర్జున్, డాక్టర్ సి.ఎం.ఎ. జహీర్ అహ్మద్, డాక్టర్ బి.ఆశాలత, డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తిలకు టీఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. ఏయూ వీసీ నాగేశ్వరరావు, డాక్టర్ ఉమర్ ఆలీషా, డాక్టర్ రవిరాజులను ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి సత్కరించారు. -
ఆరోగ్య బీమాతో ఉచిత హెల్త్ చెకప్‌లు
సాధారణంగా చాలా మటుకు ఆరోగ్య బీమా పాలసీల్లో పాలసీదారు నాలుగేళ్లకోసారి ఉచిత మెడికల్ చెకప్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పాతిక శాతం మించదు. ఎందుకంటే చాలా మందికి దీని గురించి తెలియకపోవడం.. తెలిసినా ప్రొసీజర్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. టెస్టుల్లో ఏదైనా తేడా ఉందని బైటపడితే మళ్లీ బీమా ప్రీమియంలు పెరిగిపోతాయేమోనన్న భయం మరో కారణం. అయితే, ఇలాంటి ఉచిత హెల్త్ చెకప్లనేవి.. పాలసీదారులు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రీమియంలతో వీటికి సంబంధమేమీ లేదు. ఇక, ఇందుకు సంబంధించిన ప్రొసీజరు ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది. హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నప్పుడు బీమా కంపెనీ టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయొచ్చు. లేదా సమీపంలోని బ్రాంచీలో తెలియజేయొచ్చు. ఆ తర్వాత పాలసీదారుకి అనువైన తేదీ, సమయం మొదలైన వాటిని బీమా కంపెనీ ఒకసారి నిర్ధారణ చేసుకుంటుంది. అటు పైన ఆథరైజేషన్ లెటరు ఇస్తుంది. చెకప్‌కి వెళ్లినప్పుడు హెల్త్ కార్డుతో పాటు దీన్ని కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. చెల్లింపుల ప్రక్రియ సజావుగా, సులువుగా జరిగిపోవాలంటే..టెస్టుల కోసం బీమా కంపెనీ ప్యానెల్లో ఉన్న డయాగ్నాస్టిక్ సెంటర్ లేదా ఆస్పత్రిని ఎంచుకోవడం మంచిది. కంపెనీ ప్యానెల్లో ఉన్న సెంటర్లలోనైతే పాలసీదారు చేతి నుంచి కట్టనక్కర్లేదు. నిర్దిష్ట రేట్లను బీమా కంపెనీయే డయాగ్నాస్టిక్ సెంటరుకు కట్టేస్తుంది. అలా కాకుండా పాలసీదారు వేరే చోట పరీక్షలు చేయించుకోవాలనుకున్న పక్షంలో ముందుగా డబ్బు కట్టేసి చేయించేసుకుంటే.. అటు తర్వాత కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంటు పొందవచ్చు. కన్సల్టేషన్, ఈసీజీ, బ్లడ్ కౌంట్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే మొదలైన పరీక్షలు దీని కింద చేయించుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వరుసగా నాలుగేళ్ల పాటు ఎటువంటి క్లెయిము చేయకపోతేనే ఈ ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం ఇస్తున్నాయి చాలా మటుకు కంపెనీలు. అంటే, అయిదో సంవత్సరంలో ఈ ప్రయోజనం పొందవచ్చు. అయి తే, కొన్ని సంస్థలు.. ప్రతీ సంవత్సరం, అది కూడా క్లెయిమ్ చేసినా ఇస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల గురించి బీమా కంపెనీని అడిగి తెలుసుకోవాలి. అలా గే, ఉచిత చెకప్ కదా అని ఎంత ఖర్చయినా చేయించుకోవచ్చనుకుంటే కుదరదు. ఇందుకయ్యే ఖర్చు.. బీమా కవరేజీలో ఇంత శాతానికి మించకూడదు. కొన్ని కంపెనీల్లో ఇది సమ్ అష్యూర్డ్‌లో దాదాపు ఒక్క శాతం స్థాయిలో లేదా రూ.5,000 రేంజిలో ఉంటోంది. -
పడకేసిన ఆరోగ్య పథకం
పింప్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకం పుణే జిల్లాలో పడకేసింది. ఈ పథకం గురించి నగర వాసుల్లో సరైన అవగాహన, ప్రచారం కల్పించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పథకం గురించి తెలిసిన వైద్యులు కూడా సరైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యకార్డులను అందజేయడానికి పౌర సరఫరా విభాగం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించింది. కానీ గ్రామ పంచాయతీలల్ల్లో ఆన్లైన్ సదుపాయం లేదు. కార్డుల పంపిణీ మరింత జటిలంగా మారింది. జిల్లాలోని అనేక గ్రామాలల్లో కార్డుల పంపిణీ జరగలేదు. కార్డులు లేని నిరుపేదలు ఈ పథకానికి నోచుకోవడం లేదు. 972 జబ్బులకు ఉచిత శస్త్రచికిత్సలు పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 972 రకాల జబ్బులకు శస్త్రచికిత్స, మందుల ద్వారా చికిత్సలతోపాటు 121 రకాల వైద్యపరమైన పరీక్షలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నేషనల్ ఇన్సూరెన్స కంపెనీ సహకారంతో నడుపుతోంది. రూ.1.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు వైద్య ఖర్చులల్లో 50 శాతం భరిస్తుంది. లక్ష రూపాయల ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు 100 శాతం ఉచితంగా వైద్య ఖర్చులను అందిస్తుంది. ఈ వివరాలను పేద ప్రజల చెంతకు తీసుకు పోయినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ చికిత్సలను ఏఏ ఆస్పత్రులల్లో అందిస్తారో చాలా మందికి తెలియదు. ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలు పేదలకు అందకుండా పోతున్నాయి. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదుల చేయ్యాలో తెలియకపోవడంతో రోగులు డాక్టర్ల వద్ద మొరపెట్టుకొంటున్నారు. జిల్లా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్లు సలాహా ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారే తప్ప సహకరించడం లేదు. అంతేకాకుండా ఈ పథకం కింద అంతేకాకుండా ప్రయోజనం జరగకపోగా, కొందరు అక్రమంగా సేవలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అన్ని వ్యాధులకూ ఉచితవైద్యం
సాక్షి, ముంబై: పేద ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని సార్వజనిక ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా 429 రకాల మందులు, మాత్రలను పూర్తి ఉచితంగా అందిస్తారు. వైద్యం, ఆపరేషన్లు, ఇతర పరీక్షల కోసం అవసరమయ్యే పరికరాలు, సామగ్రి అన్ని స్థానిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ బృహత్తర పథకాన్ని ఈ నెల 20 నుంచి అమలుచేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సురేశ్ శెట్టి వెల్లడించారు. సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నింటికి మినహా ఇతర వ్యాధుల చికిత్స, ఆపరేషన్లకు, కొన్ని పరీక్షలకు కొంతమేర రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో పేదలపై అదనంగా ఆర్థికభారం పడుతోంది. త్వరలోపేదలకు వీటి నుంచి విముక్తి లభించనుంది. ఈ నెల 20 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా, ఉపజిల్లా, మహిళ, గ్రామీణ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు, మందులు లభించనున్నాయి. ఇలా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మొదటిరాష్ట్రంగా మహారాష్ట్రకు స్థానం లభించనుంది. ఇక నుంచి అన్ని రకాల మందులు, ఇంజక్షన్లు, దూది, బ్యాండేజీలను ఉచితంగానే ఇస్తారు. ఇదిలా ఉండగా కేన్సర్లనూ ఉచిత వైద్యసేవల జాబితాలో చేర్చారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులను దీనికి వినియోగిస్తామని సురేశ్ శెట్టి పేర్కొన్నారు. 1,811 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10,580 ఆరోగ్య ఉపకేంద్రాలు, 360 గ్రామీణ ఆస్పత్రులు, 13 సంచార అస్పత్రులు, 86 ఉపజిల్లా ఆస్పత్రులు, 23 జిల్లా ఆస్పత్రులు, 11 మహిళా ఆస్పత్రులు, ఏడు కుటుంబ సంక్షేమ ఆస్పత్రులు, నాలుగు కేన్సర్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు లభించనున్నాయి. -
పునరుజ్జీవమెలా?
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో చిన్నారులు ‘చిక్కి’పోతున్నారు. దీంతో రోజూ జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేసిందే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ (అక్షయ పిల్లల ఆరోగ్య పునరుజ్జీవ కేంద్రం). ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నా చిన్నారులు లేక వెలవెలపోతున్నది. ఈ కేంద్రం గురించి అధికారులు ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధపడుతూ మరణించకూడదనే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఏడాది సెప్టెంబర్ 5న ఎన్ఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 20 పడకల సామర్థ్యంతో ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌లు సరైన ప్రచారం నిర్వహించని కారణంగా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా నేటికి వైద్యం కోసం ఆశించిన స్థాయిలో చిన్నారులను తల్లిదండ్రులు తీసుకురావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 105 మంది చిన్నారులు మాత్రమే కేంద్రంలో వైద్యసేవలు పొందారంటే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో స్పష్టమవుతోంది. ఉచిత వైద్యసేవల విషయం తెలియని తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించే ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎన్ఆర్సీలో ఉచితంగా వైద్యసేవలు అం దించడంతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తారనే సమాచారం చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుందని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ, ఏఎన్ఎంల బాధ్యత ఏమిటంటే.. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు కలిసి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు పోషకాహార దినాన్ని నిర్వహించాలి. ఈ సందర్భంగా చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారా, చెయ్యి చుట్టు కొలత 11.5 సెంటి మీటర్లుకు తక్కువగా ఉందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంది. పౌష్టికాహారంతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. గుర్తించిన చిన్నారులను వైద్యం కోసం ఎన్ఆర్సీ సెంటర్‌కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా చిన్నారులను సెంటర్‌కు తీసుకువచ్చి చేర్పిస్తే ఆశ వర్కర్‌కు రూ.50 పారితోషికం అందిస్తారు. కానీ సంబంధిత బాధ్యులు వాటిని ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడం.. ఎన్ఆర్సీ గురించి ప్రజలకు తెలియకపోవడంతో చిన్నారులను వైద్యం కోసం తీసుకురాని పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు సమన్వయంతో వ్యహరించి పౌష్టికాహారంతో బాధపడే వారిని గుర్తించి ఎన్ఆర్సీలో చేర్పించి వారికి ప్రాణం పోయాలని కోరుతున్నారు.