Free power promise
-
ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈమేరకు తెలిపారు. గుజరాత్‌లోని కో-ఆపరేటివ్ రంగంలో ఉద్యోగాలన్నీ సన్నిహితులు, బంధువులకే ఇస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను గెలిపిస్తే అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు జరగకుండా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన కొన్ని సంవత్సరాల్లోనే 12 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కేజ్రీవాల్ వివరించారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో 25 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ సంఖ్య 51 లక్షలకు పెరుగుతుందన్నారు. గుజరాత్లో కూడా 24 గంటలు నిర్విరామంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామన్నారు. చదవండి: యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. -
మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! ఉచిత కరెంటు హామీ
సూరత్: ఈసారి గుజరాత్లో ఎలాగైనా పాగావేయాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. గురువారం సూరత్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తమను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గుజరాత్‌లోని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్లీ ఆప్‌కు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. గుజరాత్లో అవినీతిని అంతం చేస్తే తాను సీఎంగా ఉన్న ఢిల్లీ మోడల్ తరహాలోనే ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందని వివరించారు. అంతేకాదు ఆప్‌ను గెలిపిస్తే 2021 డిసెంబర్ ముందు వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామన్నారు. మార్పు కోరుకుంటున్నారు గుజరాత్ ప్రజలు 27ఏళ్ల బీజేపీ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులైలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ప్రజలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తు న్నాం. దీంతో ఇక్కడి మహిళలు సంతోషంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో పంజాబ్ మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో ఉచితంగా విద్యుత్‌ను అందిస్తుంది’అని ట్వీట్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లో పర్యటించనున్నారు. -
పేదల ఇంట 'వెలుగు'
సాక్షి, చిలకలూరిపేట: ఎన్నికలలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి సర్కార్ యుద్ధ ప్రాతిపదికన నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే హామీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో జిల్లాలో 1,96,568 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని... లేదా ఏడాదికి రూ. 6వేలు అందజేస్తామని ఎస్సీ,ఎస్టీ వర్గీయులకు ఎన్నికల సమయంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉచితంగా అందించటంతో పాటు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వలన జిల్లాలోనే 1,59,582 ఎస్సీ, 36,986 ఎస్టీ కుటుంబాలకు అంటే మొత్తం 1,96,568 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని బాపట్ల డివిజన్లో ఎస్సీ, ఎస్టీలకు కలిపి 40,169 గృహసర్వీసులు ఉండగా, నరసరావుపేట డివిజన్లో 43,853 సర్వీసులు, మాచర్లలో 35,043, గుంటూరు–1లో 18,008, తెనాలిలో 59,495 సర్వీసులు ఉన్నాయి. ఇంకా మంగళగిరి, చిలకలూరిపేట వంటి సీఆర్డీఏ చేరిన ప్రాంతాలకు కలిపితే లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. వీటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుంది. బాబు హయాంలో.. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ రాయితీ మొక్కుబడిగా సాగింది. 100 యూనిట్లకు మాత్రమే విద్యుత్ రాయితీ కల్పించారు. అదికూడా 125 యూనిట్ల లోపు వాడుకున్న కుటుంబాలకు మాత్రమే ఆ రాయితీ అని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం సకాలంలో విద్యుత్ శాఖకు బకాయిలు చెల్లించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల గృహ సర్వీసులకు సంబంధించి రూ.8,46,55,000 బకాయిలు గత ప్రభుత్వం చెల్లించలేదు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి.. ఎస్సీలలో ప్రధానంగా ఉన్న మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ హామీ ఇచ్చారు. భూ పంపిణీతో పాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహాల కోసం లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 500 మంది జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగు చేసుకొనే గిరిజన రైతులకు యాజమాన్యహక్కు కల్పిస్తూ (ఫారెస్టు రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం) గిరిజనులకు హామీలను నెరవేరుస్తామన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
బాబు పాలనలో.. రైతు కంట కన్నీరు
సాక్షి, నెట్వర్క్: బాబు హయాంలో... రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరగలేదు. ఫలితంగా ఆ రుణాలు రూ.1,37,502 కోట్లకు చేరాయి. బంగారంపై తీసుకున్న 35 వేల కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేసే ప్రసక్తే లేదని బాబు భీష్మించారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీలకూ సరిపోలేదు. లక్షలాది మంది బ్యాంకుల వద్ద డిఫాల్డర్లుగా మారారు. - 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 7 గంటలకు కోత వేశారు. అది కూడా రోజులో ఒకేసారి ఇవ్వకుండా అర్థరాత్రి, అపరాత్రి దఫదఫాలుగా ఇవ్వడంతో రైతులు పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. - చంద్రబాబు ధరల స్థిరీకరణ నిధి విషయం పూర్తిగా మరిచిపోయారు. అధికారంలో ఐదేళ్లు గడిచినా రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు. - స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అటకెక్కాయి. కనీస మద్దతు ధర కనుమరుగైంది. రైతులు తాము పండించిన ఉత్పత్తులకు ధర రాక తగలబెట్టడం తెలిసిందే. - 16.5 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. 5.6 లక్షల మందికి మాత్రమే కార్డులు దక్కగా.. ఇందులో 4 లక్షలకు పైగా రెన్యువల్ చేసినవే. - ప్రస్తుతం అమల్లో ఉన్నది ప్రధాన మంత్రి పంటల బీమానే. చంద్రబాబు కొత్తగా ఏమీ చేయలేదు. - ఐదేళ్లు గడిచినా .. ఎలాంటి విత్తన చట్టం బయటకు రాలేదు - మాటలే తప్ప ఇప్పటి వరకూ వ్యవసాయ పర్యాటకంపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. - ఇలాంటి హామీలెన్నో ఇచ్చారే తప్ప ఐదేళ్ల పాలనలో అసలు ఇలాంటి ఆలోచనే ఎప్పుడూ చేయలేదు. వైఎస్ హయాంలో రైతే రాజు 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం– ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై కరెంటు ఉండదు.. బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని అవహేళన చేసిన చంద్రబాబుకు దిమ్మతిరిగేలా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకొని వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారు. మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరువుబారిన పడిన జిల్లాల్లో రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయించారు. అంతేకాదు సకాలంలో రుణాలు చెల్లించిన వారిని నిరుత్సాహపరచకూడదనే భావనతో రుణాలు చెల్లించిన రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ సీఎం కాగానే రైతుల విద్యుత్ బకాయిలన్నింటినీ రద్దు చేశారు. పావలా వడ్డీకే పంట రుణాలు ఇప్పించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇంటికి వచ్చేలా చేశారు. దిగుబడిని పెంచేలా మౌలిక వసతులు కల్పించారు. భూగర్భ జలాల పెంపునకు ఇతోధికంగా తోడ్పడ్డారు. జలయజ్ఞాన్ని ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీరు అందించేలా చేశారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రైతులను వేధించకుండా చట్టం తీసుకొచ్చి.. అప్పులపై మారటోరియం ప్రకటింప చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు రాజుగానే బతికారు. పైసా కూడా మాఫీ కాలేదు నాకు 5.15 ఎకరాల పొలం ఉండగా.. రాప్తాడు కెనరా బ్యాంకులో పంట రుణం కింద రూ.60 వేలు, బంగారు నగలు కుదవపెట్టి మరో రూ.లక్ష అప్పు తీసుకున్నా. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అప్పంతా తీరిపోతుందని ఆనందపడ్డా. రుణమాఫీ జాబితాలో నా పేరే లేకుండా పోయింది. ఇదేంటని అధికారులను, బ్యాంకుల్లో అడిగినా సరిగా చెప్పడం లేదు. మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో రాప్తాడు కేంద్రంలో నిర్వహించిన రుణమాఫీ పరిష్కార వేదికకు వెళ్లి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చివరకు బయట వ్యక్తుల దగ్గర రూ.60 వేలకు రూ.8 వేల వడ్డీకి అప్పుతెచ్చి పంట రుణం రెన్యువల్ చేసుకున్నా. అసలుకు రూ.12 వేలు వడ్డీ కట్టి బంగారు నగలు విడిపించుకున్నా. ఇక అన్నదాత సుఖీభవ కింద రూ.1,000 కూడా పడలేదు. మళ్లీ అధికారులను కలిసి పత్రాలు ఇచ్చినా ఇంకా రాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మే నెలలోనే పంట ఖర్చులకు రూ.12,500 ఇస్తామనడం మంచిదే. – చుక్క ఆంజనేయులు, హంపాపురం (రాప్తాడు) విద్యుత్ సరఫరా లేక ఎండిన పంటలు నాపేరు భూక్యా గోవిందునాయక్. మాది బొల్లాపల్లి మండలం లక్ష్మీపురం తండా. గత కొంతకాలం నుంచి రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొగాకు, మిరప పంటలను సాగు చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించి.. సక్రమంగా ఇవ్వలేదు. సరఫరాలో సమయపాలన లేకపోవడం, త్రీఫేస్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక సక్రమంగా నీరు రాక పంట పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సరిగా అమలు కావడం లేదనడానికి నేనే ఒక ఉదాహరణ. ఆత్మహత్య చేసుకున్న రైతు బాబూరావు కుటుంబాన్ని పట్టించుకోని ప్రభుత్వం సి.బెళగల్: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని మారందొడ్డి గ్రామానికి చెందిన హరిజన బాబూరావు (38) తనకున్న రెండు ఎకరాల పొలంలో పంటలు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన కూతురు గీత, ఇంటర్ చదివిన కుమారుడు తేజ సంతానం. బాబూరావు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి పొలంలో రూ.90 వేలతో బోరు వేయించారు. అదేవిధంగా నీటి నిల్వకోసం పొలంలో రూ.70 వేలు వెచ్చించి ఉపరితల ట్యాంక్ (సర్ఫేస్ ట్యాంక్) నిర్మించుకున్నాడు. ఉల్లి పంట సాగుకు పెట్టుబడిగా గూడూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రూ.2 లక్షల పంటరుణం తీసుకున్నాడు. తాను పండించిన పంట అమ్ముకునేందుకు వెళ్లిన బాబూరావు ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక, కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డులో గత ఏడాది సెప్టెంబర్ 1న పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఆయన మృతి చెందటంతో కుటుంబం గడవని పరిస్థితిలో.. మృతుడి భార్య, కుమారుడు కూలి పనులతో జీవనంసాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు ఎట్లకట్టాలో: మేరిబా, మృతుడి భార్య పంటలు పండించేందుకు, బోరు వేసినందుకు, ట్యాంక్ కట్టించుకున్నందుకు మా ఆయన బ్యాంక్‌లో, తెలిసిన వారి దగ్గర రూ.5 లక్షల అప్పులు చేశారు. పండించిన పంటలకు ధరలులేక పురుగుల మందుతాగి చనిపోయాడు. ఆయన చేసిన అప్పులు అట్లే ఉన్నాయి. మా దగ్గర చిల్లిగవ్వలేదు. మేము బతికేందుకే ఇబ్బందులు పడుతున్నాము. మేము ఎలా అప్పులు కట్టాలి. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: తేజ, కుమారుడు మా నాన్న అప్పులు చేసి చనిపోతే ప్రభుత్వ అధికారులు పరిహారం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తామంటూ నమ్మ బలికారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆఫీస్‌ల చుట్టూ, సారోళ్ల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. 1500 అడుగుల బోరు వేసినా చుక్కనీరు కరువే నా పేరు ఎం.వెంకటశివ. మాది లింగాల మండలం అంబకపల్లె గ్రామం. మాకున్న 7ఎకరాల పొలంలో రెండు బోర్లు ఉండగా.. అరకొరగా నీరు వస్తున్నాయి. ఇటీవలే వరుసపెట్టి బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. సుమారు 6బోర్లు వేశా. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి సుమారు 1200అడుగుల నుంచి 1500 అడుగుల వరకు డ్రిల్ చేయించా. కానీ నీటి చెమ్మ కనిపించలేదు. బూడిద మాత్రం బయటకు వస్తోంది. అరటి పంటను కాపాడుకోవాలంటే.. కచ్చితంగా బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి. నీరేమో పాతాళం నుంచి బయటకు రావడంలేదు. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి. నా భర్త ఆత్మహత్యకు బాబు ప్రభుత్వ విధానాలే కారణం కౌలు రైతు అయిన నా భర్త అల్లాడ ఆనంద్ 2015 జూన్ 29న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఇచ్చిన 25 సెంట్ల జిరాయితీతో పాటు, రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. నీలం తుపాను తాకిడికి పంట సర్వం నాశనమైంది. ప్రభుత్వం పరిహారం ఇవ్వనే లేదు. పెట్టుబడి కుటుంబ పోషణ కోసం అప్పు తెచ్చిన రూ.3 లక్షలు తీర్చే మార్గం లేకుండాపోయింది. దీంతో నా భర్త తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఎస్సీ చదువుతున్న నా కుమారుడు చదువు మానేసి ఆటో నడుపుతున్నాడు. నాకు నలుగురు కుమార్తెలు. నేను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇంటి బిల్లులు రాకపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. జన్మ భూమి కమిటీల కారణంగా నాకు వితంతు పింఛన్ కూడా రావడం లేదు. పేదరికంతో వీధినపడ్డ మాలాంటి దళిత కుటుంబంపై ప్రభుత్వానికి కనికరం లేదు. – సరోజినమ్మ, భామిని, శ్రీకాకుళం జిల్లా రుణమాఫీతో మోసపోయాం మాకు ఐదెకరాల పొలం ఉంది. 2013లో రాప్తాడు కెనరాబ్యాంకులో పంట రుణం కింద రూ.60 వేలు తీసుకున్నాం. పంట ఖర్చుల కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి అదే బ్యాంకులోనే రూ.80 వేలు తీసుకున్నాం. పట్టాదారు పాస్ పుస్తకం కింద మొత్తంగా రూ.1.40 లక్షలు ఉంది. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీ ఇవ్వడంతో రూ.1.40 లక్షలు పోతాదని సంబరపడ్డాం. తీరా సంవత్సరం తర్వాత చూస్తే రూ.25 వేలు మాఫీ అయినట్లు పత్రం చేతికిచ్చారు. అధికారులు అడిగిన పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేశా. అయినా లాభం లేదు. దాంతో చేసేదేమీ లేక 2015లో పంట రుణం రూ.60 వేలకు రూ.25 వేలు మాఫీ పోనూ..వడ్డీతో కలిపి రూ.42 వేలు కట్టి రెన్యువల్ చేయించుకున్నాం. అంటే రూ.7 వేలు వడ్డీపడింది. ఇక బంగారు నగలు తాకట్టు రుణం రూ.80వేలు ఉండగా.. దానికి రూ.1.20 లక్షలు కట్టి విడిపించుకున్నాం. అంటే రెండేళ్లకు రూ.40 వేల వరకు వడ్డీ కట్టాం. మొత్తంగా చూస్తే రూ.1.40 లక్షల రుణం ఉండగా.. అందులో రూ.25 వేలు మాఫీ పోయినా.. మేము కట్టింది రూ.1.62 లక్షలు. ఇదెక్కడి రుణమాఫీనో అర్థంకాలేదు. ఇక మధ్యలో రూ.3 వేల వరకు పావలావడ్డీ పడింది. వరుసగా పంటలు దెబ్బతింటున్నా మాకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేదు. ఇటీవల అన్నదాత సుఖీభవ కింద రూ.1,000 పడింది. ఈ లెక్క కనీసం వారం రోజులు కాఫీ, టీలకు కూడా చాలదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏటా మే నెలలోనే రూ.12,500 ఇస్తే రైతులకు కొంత బాగుంటుంది. మోడిపల్లి అక్కమ్మ, ఎం. వెంకటనాయుడు దంపతులు పంటనష్ట పరిహారం ఇవ్వకుండా ముంచేశారు నా పేరు ముళ్లపూడి రాము. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం, జగన్నాధపురం గ్రామం. ఎర్రకాలవ బాడవలో నా కుమార్తె, నాకు కలిపి ఏడున్నర ఎకరాల పొలం ఉంది. గతేడాది ఆగస్టు 20వ తేదీన వచ్చిన ఎర్రకాల్వ వరదలో నా పొలం మొత్తం మునిగిపోయింది. ఏడున్నర ఎకరాలకు లక్షా 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. అధికారులు వచ్చి లెక్కలు వేశారు. ఎకరాకు ఆరు వేల వంతున పంటనష్ట పరిహారం అందచేస్తామన్నారు. ఇటీవల రాజమండ్రికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని హెక్టారుకు రూ.25వేలు ఇస్తామన్నారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాకు ప్రభుత్వం ఇవ్వలేదు. వ్యవసాయాధికారులను అడిగితే లెక్కలు ప్రభుత్వానికి పంపించాం. ట్రెజరీలో సొమ్ములు లేవు. ఇవిగో వస్తాయి. అవిగో వస్తాయంటున్నారు. కాని ఈ రోజు వరకు పైసా రాలేదు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలో సుమారు ఆరువేల ఎకరాల పొలం ఎర్రకాల్వ వరద వల్ల మునిగిపోయింది. అంతా చిన్నసన్న కారు రైతులు. మూడు వేల మందికి పైగా ఉన్నారు. పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొట్టింది. రైతులను ఆదుకోవాలి. – ముళ్లపూడి రాము , రైతు జగన్నాధపురం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా -
మాట తప్పను.. ఉచితం ఇస్తాను..
* వైఎస్ మాట ఇది * ఉచిత విద్యుత్‌పై హామీ నిలబెట్టుకున్న వైఎస్ * కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ కొనసాగింపు సి. మాణిక్యాల రావు: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏ పథకం, ఏ కార్యక్రమం అమలు చేసినా దాని వెనుక ఒక బలమైన ప్రజల ఆకాంక్ష, వారి కష్టార్జితం ఉంటాయి... ఇందుకు ప్రబల నిదర్శనం 2004 ఎన్నికల ముందు ఆయన ప్రకటించిన రైతులకు ఉచిత విద్యుత్ అంశం. ఎన్నికల ముందు హామీ ఇవ్వడమే కాదు..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై ప్రజల ముందే తొలి సంతకం చేశారు. అప్పటి నుంచి మొదలు ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులూ కూడా ఉచిత విద్యుత్‌కు ఏదో విధంగా మంగళం పలికించాలనే కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. ప్రతి ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక ఆమోదం సమావేశంలో కేంద్ర ప్రణాళికా సంఘం ఉచిత విద్యుత్‌పై అభ్యంతరాలను ప్రస్తావిస్తూనే ఉంది. ఆఖరికి 2008 సంవత్సరంలో కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని గట్టిగా పట్టుపట్టారు. సబ్సిడీలను ప్రోత్సహించరాదని, అలాంటి రాష్ట్రాలకు కేంద్ర సాయం తగ్గించాల్సి ఉంటుందని సింగ్ హెచ్చరించారు. దీనిపై వైఎస్ ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తున్నదీ గట్టిగా వివరించారు. ఉచిత విద్యుత్ సరఫరాపై వైఎస్ నిబద్ధతకు నిదర్శనాలివి... ఉచిత విద్యుత్ ఇస్తే తప్పేమిటి...! ‘‘రాష్ట్రంలో భూములు యూనిఫాంగా లేవు..కొన్ని ప్రాంతాల్లో మెట్ట భూములున్నాయి..కొన్ని ప్రాం తాల్లో పల్లం భూములున్నాయి.. సీమాంధ్రలో సహజ జలవనరులు అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ పెట్టుబడితో ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతుల పొలాలకు కాలువల ద్వారా సాగునీటిని అందిస్తోంది..ఇక్కడ రైతు పెట్టుబడి కేవలం కష్టపడటమే..అయితే తెలంగాణలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి..ఇక్కడ అన్నీ మెట్ట భూములే..ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి లేదు..ఇక్కడ రైతులే అప్పు చేసో ఏదో రకంగా సొంత పెట్టుబడితో బోర్లు వేసుకున్నారు..ఒక్కో సారి రెండేసి మూడేసి బోర్లు వేస్తే గానీ నీరు దొరకదు..చాలా రిస్క్‌తో తెలంగాణ రైతులు వ్యవసాయం చేస్తున్నారు..ఇక్కడ ఎక్కడా సాగునీటి వసతికి ప్రభుత్వ పెట్టుబడి లేదు..బోర్లు, మోటార్లు అంతా రైతు పెట్టుబడే..ఈ నేపథ్యంలో ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ధర్మం..దీన్ని ఎంత మాత్రం సబ్సిడీ భారంగా పరిగణించలేం..దేశ ఆహార భద్రతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద మొత్తంలో వాటా ఇస్తోంది.. ఈ నేపథ్యంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇందుకు మీరు సబ్సిడీని భరిస్తే భరించండి లేదంటే రాష్ట్రమే భరిస్తుంది..ఈ విషయంలో కేంద్ర జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించం....’’ - వైఎస్ 2008లో ప్రణాళికా సంఘం ముందు ఉచిత విద్యుత్‌పై చేసిన వాదన ఇదీ..ఇందులో తెలంగాణ రైతుల పట్ల ఆయనకు గల నిబద్ధత ఎలాంటిదో చాటిచెప్పింది. మాట తప్పను... ‘‘నేను ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాను..చిన్న పెద్ద అనే తేడా చెప్పలేదు..ఇప్పుడు మాట తప్పలేను..ఎంత కష్టమైనా, నష్టమైనా మాట తప్పను’’ -ఉచిత విద్యుత్‌ను చిన్న, మధ్యతరగతి రైతులకే పరిమితం చేయాలని, పెద్ద రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దని, ఇందుకు భూ పరిమితి విధించాలని ఓ సందర్భంలో వామపక్షాలు వైఎస్‌కు సూచించినపుడు ఆయన స్పందన ఇది.