
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ప్రజలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తు న్నాం. దీంతో ఇక్కడి మహిళలు సంతోషంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో పంజాబ్ మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో ఉచితంగా విద్యుత్‌ను అందిస్తుంది’అని ట్వీట్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment