ఐఐటీ ముంబై ద్వారా ఉచిత సాఫ్ట్వేర్ శిక్షణ
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఐఐటీ ముంబై ద్వారా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు దూరవిద్య విధానంలో సాఫ్ట్వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు ఓయూ ప్లేస్మెంట్ సర్వీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ కేవీ అచలపతి తెలిపారు.
ఓయూ పరిధిలోని క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు.