freeway
-
రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..
Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా: స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అందుబాటులోకి ఫ్రీవే
సాక్షి, ముంబై: దశాబ్దాలుగా వే ధిస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి దక్షిణ ముంబైవాసులకు విముక్తి లభించనుంది. ఇకపై దక్షిణ ముంబై నుంచి ఘాట్కోపర్కు వెళ్లాలంటే కేవలం అరగంట చాలు. ఎందుకంటే పశ్చిమ శివారులోని ఖేర్వాడి ప్రాం తంలో నిర్మించిన ఫ్లైఓవర్, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డులను సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారు. ఖేర్వాడి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంవల్ల దహిసర్ నుంచి నేరుగా వర్లీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించవచ్చు. పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డు వంతెన వల్ల దక్షిణ ముంబై నుంచి తూర్పు శివారు ప్రాంతం వరకు కేవలం అర గంటలోపే చేరుకోవచ్చు. ఈ వంతెన కారణంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఖేర్వాడి ఫ్లైఓవర్ 580 మీటర్ల పొడవుంది. ఈ వంతెనను వినియోగించే వాహన చోదకులకు ఖేర్వాడి జంక్షన్ వద్ద ఎదురయ్యే భారీ ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి లభించనుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. ఈస్టర్న్ ఫ్రీవే మార్గంపై నిర్మించిన పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు వంతెన 2.80 కి.మీ. పొడవుంది. కొద్ది రోజులుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. దక్షిణ ముంబై-పాంజర్పోల్ వరకు ఇది వరకే 13.60 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పు డు 2.80 కి.మీ. వంతెన కూడా సిద్ధం కావడంతో మొత్తం 16.40 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి రానుంది. అత్యంత పొడవైన ఈ వంతెన అం దుబాటులోకి రావడంవల్ల దక్షిణ ముంబై నుంచి నేరుగా తూర్పు శివారు ప్రాంతం వరకు ఎలాంటి అడ్డులేకుండా కేవలం అరగంట లోపు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఖేర్వాడి వంతెనను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డును మూడున్నర గంటలకు సీఎం చవాన్ ప్రారంభిస్తారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.