ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో 11 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మోహనరావు ఆదివారం వెల్లడించారు. ఆ హత్య కేసులో మొత్తం 36 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. వారిని కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు మోహనరావు వివరించారు. నిందితుల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటరాములు కూడా ఉన్నారని తెలిపారు.
గత శనివారం అర్థరాత్రి నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలం నల్లవెల్లి ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన అటవీ భూమిని కబ్జాదారులు సాగుచేస్తున్నారు. ఆ సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ తనతోపాటు మరో ఆరుగురు అధికారుల హుటాహుటిన ఆ ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. అప్పటికే దాడికి సిద్దంగా ఉన్న కభ్జాదారులు ఎఫ్ఆర్వోపై దుండగులు కళ్లలో కారంచల్లి.. గొడ్డలితో నరికి చంపారు. మిగిలిన వారిపై దాడి చేశారు.
ఆ ఘటనలో మిగిలిన అధికారులు తీవ్రంగా గయపడ్డారు. ఎఫ్ఆర్ఓ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు ఆ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రత్యక్ష సాక్షులకు విచారించారు. దాంతో వారం రోజుల్లో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.