పొంగి పొర్లుతున్న ఏడూర్ ప్రాజెక్ట్
కౌలాస్ నాలాలోకి వచ్చి చేరుతున్న నీరు
జుక్కల్ : కౌలాస్నాలా ప్రాజెక్ట్ ఎగువభాగంలో గల ఏడూర్ ప్రాజెక్ట్ నిండి పొంగి పొర్లుతోంది. కర్నాటక, మహరాష్ట్రలకు చెందిన ప్రధాన వాగులు ఒకేచోట కలిసే ఏడూర్ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2009లో నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం ఒక టీఎంసీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టుకు 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
నిండుకుండలా కౌలాస్ నాలా
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం ప్రస్తుతం 457.20 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా పూర్తిస్థాయికి కేవలం అరమీటరు నీటిమట్టం మాత్రమే మిగిలి ఉంది. ఏడూర్ ప్రాజెక్ట్ నుంచి 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది.