fund raised
-
నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే!
న్యూఢిల్లీ: విండ్ ఎనర్జీ సంస్థ ఐనాక్స్ విండ్ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్ లిమిటెడ్ ప్రిఫరెన్షియల్ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్ లీజ్ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. -
ఓలా పెను సంచలనం.. ఆ జాబితాలో చేరిన తొలి ఎలక్ట్రిక్ కంపెనీ!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మరో సంచలనం క్రియేట్ చేసింది. తాజాగా టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, ఎడెల్వీస్ తదితర కంపెనీల నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రౌండ్ ఫండింగ్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ 5 బిలియన్ డాలర్ వీలువ కలిగిన కంపెనీల జాబితాలో చేరిన తొలి ఎలక్ట్రిక్ కంపెనీగా నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్ బ్యాంక్ ఇతరుల నుంచి ఇంతే మొత్తాన్ని సేకరించినట్లు ప్రకటించింది. "ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని సృష్టిస్తోంది. మొత్తం ప్రపంచానికి ఈవీలను భారతదేశం నుంచి ఎగుమతి చేయనున్నాము. ఇప్పటివరకు తయారు చేసిన అత్యుత్తమ స్కూటర్ ఓలా ఎస్1తో మేము మొత్తం స్కూటర్ పరిశ్రమను మార్చాము. ఇప్పుడు మా సృజనాత్మక ఉత్పత్తులను బైక్ ,స్కూటర్లతో పాటు మరిన్ని వాహనాల కేటగిరీలకు విస్తరించడానికి ఎదురు చూస్తున్నాము" అని ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, "పెట్టుబడిదారుల మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం నుంచి ప్రపంచానికి ఈవీ విప్లవాన్ని పరిచేయడానికి వారితో భాగస్వామ్యం వహించడానికి నేను ఎదురు చూస్తున్నాను" అని ఆయన అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ ఏడు సార్లు నిధుల సేకరణ చేపట్టింది. ఇందులో కంపెనీ హ్యుందాయ్ మోటార్ కంపెనీ లిమిటెడ్, టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా, రతన్ టాటాలు పెట్టుబడులు పెట్టినట్లుగా పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నెలలో టెమాసెక్ నేతృత్వంలోని ఫైనాన్సింగ్ రౌండ్ లో కంపెనీ రూ.398.26 కోట్ల(సుమారు 52.7 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఓలా క్యాబ్స్ రైడ్-హైలింగ్ వ్యాపారం తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయడానికి 2017లో స్థాపించిన ఓలా ఎలక్ట్రిక్ కరోనా మహమ్మారి కాలంలో వేగం పుంజుకుంది. ఫిబ్రవరిలో కంపెనీ తన ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్లాంట్ గా పేర్కొంది. ఈ ప్లాంట్ తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఉంది. (చదవండి: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!) -
ఆపదలో ఆదుకున్న నాట్స్
డల్లాస్, టెక్సాస్: అమెరికాలో అనేక మందికి హెల్ప్ లైన్ ద్వారా సాయం చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మున్ మున్ సాహ అనే మహిళకు అండగా నిలిచింది. డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ రావడంతో ఆమె ప్రాణపాయ స్థితిలోకి వెళ్లింది. అయితే ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయించేందుకు కావాల్సిన వైద్య ఖర్చులు ఆ కుటుంబానికి భారంగా మారాయి. ఈ సమయంలో నాట్స్ మున్మున్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు కోసం నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా విరాళాలు సేకరించింది. ఇలా సేకరించిన విరాళాలను నాట్స్ బాలల సంబరాల వేదిక మీద మున్మున్ కుటుంబ సభ్యులకు అందించింది. పునరావాస కేంద్రానికి చెల్లించాల్సినవి మినహాయించి మిగిలిన 93,069.48 డాలర్ల చెక్కును నాట్స్ సభ్యులు మున్మున్ కుటుంబానికి అందించింది. ఆమె త్వరగా కోరుకోవాలని నాట్స్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యకమంలో నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ బోర్డు సభ్యులు ఆది గెల్లి, కిశోర్ వీరగంధం, ప్రేమ్ కలిదిండి, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, జాతీయ సమన్వయకర్త అశోక్ గుత్తా, జోనల్ వైస్ ప్రెసిడెంట్స్ భాను లంక, కిరణ్ యార్లగడ్డ, నాట్స్ డల్లాస్ టీం సభ్యులు రాజేంద్ర యనమదల, ప్రసాద్ డి వి, నాగిరెడ్డి మండల, తిలక్ వనం, చక్రి కుందేటి, మాధవి ఇందుకూరి, శ్రీకృష్ణ సల్లాం, సుచింద్రబాబు, దీప్తి సూర్యదేవర, కిరణ్ జాలాది, రాజేంద్ర కాట్రగడ్డ, మరియు ఇతర నాట్స్ డల్లాస్ టీం సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాట్స్ హెల్ప్ లైన్ టీమ్ ను చైర్మన్ శ్రీధర్ అప్పసాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో వేల కోట్ల పెట్టుబడులు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తుంది. దేశీయంగా అమెజాన్, రిలయన్స్, టాటా గ్రూప్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న పోటీ వల్ల పబ్లిక్ లిస్టింగ్ కు సిద్ధమవుతున్న కొద్ది రోజుల ముందు ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులను సమీకరించింది. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఇతర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లు(దాదాపు 26.8 వేల కోట్లు) సమీకరించినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డ్(సీపీపీ ఇన్వెస్ట్ మెంట్స్), సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ 2, ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్ మార్ట్ ఇంక్ నేతృత్వంలో తాజాగా నిధులు 3.6 బిలియన్ డాలర్లను సేకరించినట్లు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నేడు తెలిపింది. ఈ రౌండ్లో డిస్ట్రబ్ ఎడి, ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, ఖజానా నాసియోనల్ బెర్హాద్, మార్క్యూ పెట్టుబడి దారులు విల్లోబీ క్యాపిటల్, అంతరా క్యాపిటల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్ తో సహా ఇతర పెట్టుబడి దారులు పాల్గొన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ విలువ 37.6 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ లో, మింట్ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్ ఇంటర్నెట్ రిటైలర్ లో $700 మిలియన్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ఫ్లిప్‌కార్ట్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో తన మొత్తం వాటాను వాల్ మార్ట్ ఇంక్ కు విక్రయించిన మూడు సంవత్సరాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. -
అత్యంత ఖరీదైన ఔషదం.. వారం రోజుల్లోనే రూ.18 కోట్లు
కన్నూర్: మానవత్వమే మిన్న అని మరోసారి రుజువైంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడేందుకు అందరూ ఒక్కటై సాయం అందించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు రూ.18 కోట్లకు పైగా విరాళాల రూపంలో అందించారు. కేరళకు చెందిన పీకే రఫీక్, మరియమ్మ దంపతుల కుమారుడు మొహమ్మద్ (18 నెలలు) స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండో సంవత్సరం వచ్చేలోగా ఆ చిన్నారికి ఈ డోస్ అందించాల్సి ఉంటుందని వైద్యులు వారికి సూచించారు. ఇందుకు అవసరమైన సాయం సేకరించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎం.విజిన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ వారం క్రితం క్రౌడ్‌ఫండ్ ద్వారా విరాళాలు అందించాలని ప్రజలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేపట్టారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే చిన్నారి బ్యాంకు అకౌంట్లో రూ.18 కోట్లకు పైగానే డబ్బు జమయ్యాయి. బ్యాంకు అకౌంట్‌కు రూ.18 కోట్లకు పైగానే అందాయని, ఇక విరాళాలు అందివ్వవద్దని మత్తుల్ పంచాయతీ ప్రెసిడెంట్ ఫరిషా సోమవారం ప్రజలను కోరారు. కాగా, మొహమ్మద్ సోదరి అఫ్రా(15)కు కూడా గతంలో ఇదే వ్యాధి సోకడం గమనార్హం. -
దొడ్ల ప్రైస్ బ్యాండ్ రూ. 421-428
ముంబై: దక్షిణ భారత్‌లోని ప్రైవేట్ డెయిరీలో ఒకటైన దొడ్ల తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. జూన్ 16 నుంచి 18 వరకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అందుబాటులో ఉంటుంది. షేర్‌బ్యాండ్ విడ్త్‌ని రూ. 421 నుంచి 428గా నిర్ణయించారు. మొత్తంగా ఒక కోటి తొమ్మిది లక్షల షేర్లు ఐపీవోలకి రానున్నాయి. ఐపీవో వివరాలు దొడ్ల జారీ చేసిన ఐపీవోలు 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్సిస్టిట్యూషన్ బయ్యర్స్‌కి కేటాయించారు. మిగిలిన షేర్లలో 35 శాతం రిటైల్, మిగిలిన 15 శాతం వాటాలను నాన్ ఇన్సిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో దొడ్ల డైయిరీ పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తోంది. 2021 మార్చి నాటికి సగటున రోజకు పది లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నట్టు దొడ్ల డెయిరీ ప్రకటించింది. చదవండి : stockmarkets: రికార్డుల మోత -
రిలయన్స్ ఇన్ఫ్రా.. గాడిన పడేనా
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తన సంస్థలను మళ్లీ గాడిన పెట్టేందుకు అనిల్ అంబానీ సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా నిధుల సమీకరణ చేస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఇన్‌ఫ్రాలోకి రూ. 550 కోట్ల నిధులు అనిల్ తెచ్చారు. ప్రమోటర్ల నుంచి ప్రమోటర్లకు వాటాలు విక్రయించడం ద్వారా రూ, 550.56 కోట్లు నిధులు సమీకరించేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫెరెన్షియల్ ఎలాట్మెంట్ ద్వారా 8.88 కోట్ల షేర్లను ప్రమోటర్లుగా ఉన్న వీహెచ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇవ్వనుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రా దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. జాతీయ రహదారులు, పవర్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టింది. ఈ పనుల్లో ఎక్కువ శాతం బీవోటీ పద్దతిలోనే రిలయన్స్ ఇన్ఫ్రా చేపడుతోంది. చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం -
రూ. 7.5 కోట్లు సేకరించాం: ప్రియాంక దంపతులు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆయా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి భారత్‌లోని కోవిడ్ బాధితుల కోసం నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 7.5 కోట్లు) సేకరించినట్లు తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే 3 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఆమె చెప్పారు. ఈ మొత్తం భారతదేశంలో కోవిడ్‌తో బాధపడుతున్న వారికి వెచ్చించాలని ప్రియాంక-నిక్ దంపతులు భావిస్తున్నారు. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల రూపాయల నిధులు సేకరించామని చెప్పారు. ఈ డబ్బును భారత్‌లో ఎలా వినియోగించనున్నారో వివరాలు అడుగుతూ గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సంభాషణను ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫండ్‌ను భారత్‌లో ఆక్సీమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు సతీజా చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. అదే విధంగా ఆపదలో ఉన్న భారత్‌కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తాను కోరినట్లు ప్రియాంక తెలిపారు. భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్‌కు వివరించినట్లు కూడా ప్రియాంక పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ లైవ్ షోలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. తాను తొందరగా కొలుకునేందుకు ప్రియాంక కారణమని, ప్రతి క్షణం తనను కనిపెట్టుకుని అన్ని విధాల సపర్యలు చేసిందని, గొప్ప భార్య అంటూ ప్రియాంక మీద నిక్ ప్రేమ కురిపించాడు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ఆరుషి కోసం.. 6 గంటల్లో.. 16 లక్షలు
పుట్టిన ప్రతి మనిషి ఎదుగుతాడు. ఏళ్లు శ్రమించి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ఎంత మురిసిపోయినా వారికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచేవి మాత్రం తమ చిన్నారి మొదటిసారి వేసిన బుడిబుడి అడుగులే. తప్పటడుగులతో ప్రారంభమయిన మనిషి జీవితం ఎన్నో మైళ్లు ప్రయాణించి విజయ తీరాలను చేరుకుంటుంది కానీ ఆరుషి విషయంలో ఈ సంతోషాలు ఏవి లేవు. ఎందుకంటే ఆ చిన్నారి పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది.. ఆపై 20 రోజుల్లో తండ్రి కూడా మరణించాడు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఉన్న తాతనాయనమ్మలే ఆ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబాన్ని విధి మరోసారి చిన్న చూపు చూసింది. నిండా మూడేళ్లు లేని ఆ పసిపాపకు దేవుడు ఖరీదైన జబ్బును బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు ‘కాన్జెనిటల్ సుడార్‌థ్రోసిస్ ఆఫ్ ద టిబియా’ (సీపీటీ). మన భాషలో చెప్పాలంటే విరిగిన కాలి ఎముక సరిగా అతుక్కోకపోవడమే కాక ఆ గాయం ఎన్నటికి మానదు. దాంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం ఆరుషి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ చిన్నారి పుట్టి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకూ తొలి అడుగు వేయలేదు. కారణం సీపీటీ. చిన్నారి ఆరుషికి ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ జబ్బు బయటపడింది. దాంతో ఆ చిన్నారి నడవకూడదని చెప్పిన డాక్టర్లు.. ఆరుషి పాదాలకు బ్యాండేజ్ వేశారు. ఆపరేషన్ చేస్తే ఆ పాప కూడా అందరిలానే నడవగల్గుతుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అసలే అమ్మనాన్న లేక తాతనాయనమ్మల దగ్గర బతుకుతున్నారు. పూట గడవడమే కష్టం అంటే ఇక ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి వైద్యం చేయించడం వారి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఆరుషి తాత చేసేదేమో చిన్న సెక్యూరిటి గార్డ్ పని. వచ్చే మూడువేల జీతం రాళ్లతో నలుగురి కడుపులు నింపాలి. అలాంటిది 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి మనవరాలికి వైద్యం చేయించడం తన వల్ల కాదని అర్థమైంది. కానీ ఇంత బాధలోను మనవరాలి మొము మీద చిరునవ్వు చూసినప్పుడల్లా ఎలాగైనా ఆ చిన్నారిని నడిపించాలని ఆ ముసలి మనసు ఆరాటపడేది. దాంతో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సాయం కోరాడు. దీని వల్ల అంతగా ఉపయోగం లేకపోయింది. ఇలా అయితే లాభం లేదనుకుని తన దీన గాథను వివరిస్తూ ఫేస్బుక్లో ఓ స్టోరి పోస్ట్ చేశాడు. అతనికి తోడుగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చారు. అలా ఆరుషి వ్యధ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతా తెలిసింది. మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. దాంతో కేవలం 6 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి వైద్యానికి కావాల్సిన 16 లక్షల రూపాయల సొమ్ము సమకూరింది. తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆరుషి కుటుంబ సభ్యులు. త్వరలోనే తమ మనవరాలు లేడిపిల్లలా గెంతుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. -
పేదింటి పెళ్లి కానుక ఇక రూ.1,00,116
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్లో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేరుతో ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా ప్రస్తుతం రూ.75,116 ఆర్థిక సాయం అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచబోతోంది. వచ్చే బడ్జెట్లో అందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సంక్రాతి పండుగ తర్వాత అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. -
'పాత్రికేయుల సంక్షేమ నిధి రూ. కోటికి పెంచుతాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పి. రఘునాథారెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయానికి రూ. లక్ష విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ... పాత్రికేయుల సంక్షేమ నిధిని రూ. కోటికి పెంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టే పథకాలు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తామని రఘునాథరెడ్డి వెల్లడించారు.