funds allotted
-
కేంద్రానికి ఆర్బీఐ రూ.57,128 కోట్ల చెక్
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ 584వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్బీ)ను కొనసాగించాలని కూడా ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించిందని ప్రకటన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలు తత్సంబంధ అంశాలపై బోర్డ్ చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. – ప్రస్తుతం ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జూలై–జూన్. 2021–22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్–మార్చికి మారుతుంది. ఈ మార్పునకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 9 నెలలను ఫైనాన్షియల్ ఇయర్గా పాటిస్తోంది. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై దృష్టి: 6వ తేదీ ఆర్బీఐ పాలసీ నిర్ణయానికి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై బోర్డ్ చర్చించడం శుక్రవారం సమావేశంలోని మరో ముఖ్యాంశం. అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, సేవల పటిష్టత లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్ హబ్)ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఈ నెల 6 పాలసీ ప్రకటన సందర్భంగా నిర్ణయించింది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యకలాపాలపైనా బ్యాంక్ చర్చించింది. 2019–20 ఆర్బీఐ అకౌంట్స్ను, వార్షిక నివేదికను ఆమోదించింది. -
మొక్కల మాటున అవినీతి చీడ
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వన సంరక్షణ ...వన మహోత్సవం...ఇలా రకరకాల పేర్లతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీడియాలో ప్రకటనలు... పత్రికల్లో ఫొటోలతో తెగ హల్చల్ చేశారు. ప్రజల్ని భాగములను చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేసినట్టు ఆర్భాటం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది ... ఆ మొక్కల మాటున అవినీతికి పాల్పడి లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. సంరక్షణ గాలికొదిలేయడంతో ఎదగాల్సిన మొక్కలు ఆదిలోనే ఎండిపోయాయి. ఓ కాలానికి పరిమితం కావల్సిన ఎండలు దాదాపు ఏడాదంతా విరగగాయడానికి కారణం పచ్చదనం లేకపోవడమే. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నిల్వలు బాగా పెరిగిపోతుండటంతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేప«థ్యంలో ఆడవులను సంరక్షించుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని సమర్ధవంతంగా చేయాల్సిన గత ప్రభుత్వం నిధులెలా ఖర్చు చేయాలో చూసిందే తప్ప మొక్కలెలా పెంచాలో శ్రద్ధ పెట్టలేదు. మొక్కలు పెంపకం పేరుతో నిధులు మింగేసిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. అధికారుల వద్ద లభ్యమైన రెండేళ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ∙2016–17లో 32 మండలాల్లో 1,87 156 మొక్కలు నాటినట్టుగా చూపించారు. ఇందులో 84, 233 మొక్కలు బతికున్నట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. అంటే 45 శాతం మొక్కలు ఊపిరిపోసుకున్నాయన్నమాట. ∙2017–18లో 51 మండలాల్లో 2,61,208 మొక్కలు నాటగా 1,35,828 మొక్కలు బతికినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, 2017–18 సంవత్సరానికి సంబంధించి 23 మండలాల్లో సామాజిక తనిఖీలు జరిపితే రూ.22,19,693మేర దుర్వినియోగం చేసినట్టు తేలింది. అంతకుముందు సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటిలో బతికున్నవెన్నో అధికారుల వద్ద లెక్కల్లేవు. ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయో తేల్చే తనిఖీలు జరగలేదు. ఇదంతా అధికారికంగా చెబుతున్న సమాచారం. కానీ అనధికారికంగా చూస్తే వేసిన మొక్కలు ఎక్కడున్నాయో...ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ లెక్కన మొక్కల పెంపకం కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా దుర్వినియోగమయింది. మొక్కలు వేసినందుకు, మొక్కలు పెంపక వేతనం, నీటి సరఫరా ఖర్చు, ఎరువులు, ఇతరత్రా వాటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినట్టు లెక్కలు రాసుకున్నారు. రికార్డుల్లో లెక్కలు చూపించారే తప్ప క్షేత్రస్థాయిలో వేసిన మొక్కలను పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. విశేషమేమిటంటే 2017–18లో సామాజిక తనిఖీల్లో 22 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగిందని, 300 మందికిపైగా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చినా ఇంతవరకూ ఒక్క పైసా రికవరీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిబట్టి అక్రమాలను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని డ్వామా పీడీ ఎన్వీ రమణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా ‘నేను ఎన్నికల ముందు బాధ్యతలు స్వీరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని, పరిశీలిస్తానని చెప్పారు. 2016–17లో మొక్కలు నాటిన మండలాలు 32 నాటిన మొక్కలు 1,87,156 మొత్తం వ్యయం 150.37 లక్షలు బతికిన మొక్కలు 84, 233 బతికిన మొక్కల శాతం 45 2017–18లో సోషల్ ఆడిట్ చేసిన మండలాలు 23 దుర్వినియోగమైనట్టు తేల్చిన నిధులు రూ. 22,19,693 2017–18లో మొక్కలు నాటిన మండలాలు 51 నాటిన మొక్కలు 2,61,208 మొత్తం వ్యయం 946.11 లక్షలు బతికిన మొక్కలు 1,35,828 బతికిన మొక్కలు శాతం 52 -
ప్రాజెక్టుల ఎస్కలేషన్కు ఓకే..!
సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులకు మార్గం సుగమం జీవో 13కు కొద్దిపాటి మార్పులతో ధరలు పెంచేందుకు కమిటీ సానుకూలం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచనున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని కాంట్రాక్టర్ల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఎస్కలేషన్ కమిటీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 13కు చిన్నపాటి సవరణలు చేసి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఎస్కలేషన్ కమిటీ మూడు నాలుగు రోజుల్లో మరోమారు సమావేశమై తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదించిన మరుక్షణం కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు మొదలవుతాయి. 25 ప్రాజెక్టులకు వర్తింపు... రాష్ట్రంలో జలయజ్ఞం కింద మొత్తంగా 33 సాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతుండగా, వాటితో 47.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ప్రాజెక్టులకు రూ.1,11,240 కోట్ల పరిపాలనా అనుమతులు లభించగా, కాంట్రాక్టర్లతో రూ.88,168 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 2013-14 ఆర్ధిక ఏడాది ముగిసే నాటికి రూ. 37,935.23 కోట్ల మేర పనులు జరగగా, 2014-15 ఆర్ధిక ఏడాదిలో ఖర్చు చేసిన రూ.4,662.78 కోట్లను కలుపుకొని ఇప్పటివరకు రూ. 42,598.01 కోట్లు ఖర్చయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 8 ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తికాగా మిగతా 25 ప్రాజెక్టులకు ఎస్కలేషన్ వర్తించే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి 2న అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో 13 ప్రకారం 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికి కొత్త ధరల ప్రకారం బిల్లుల్ని చెల్లించాల్సి ఉంటుంది. భారం గరిష్టంగా రూ.6 వేల కోట్లు.. రిటైర్డ్ ఇంజనీర్ అనంతరాములు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే దీనిపై కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోగా, మంగళవారం మరోమారు కమిటీ భేటీయై వారి డిమాండ్లపై చర్చించింది. ప్రస్తుత పరిస్థితులు, పక్క రాష్ట్రంలో జీవో 13 అమలు, ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలంటే ఎస్కలేషన్ వర్తింపు అవసరం తదితరాలపై క్షుణ్ణంగా చర్చించింది. సమావేశంలో దాదాపు జీవో 13ను అమలు చేయాలని, అదనపు నిర్మాణాలు చేసిన చోట సైతం చెల్లింపులు చేయడం సమంజసమేనని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 15న మరోమారు సమావేశమై తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. 25 ప్రాజెక్టుల పరిధిలో ఏప్రిల్ 2013 నుంచి కనుక ఎస్కలేషన్ను వర్తింపచేయడం, అదనపు నిర్మాణాలకు చెల్లింపులు చేస్తే ప్రభుత్వంపై కనిష్టంగా రూ.3 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.6వేల కోట్ల భారం పడుతుందని తేల్చినట్లుగా సమాచారం. -
మిషన్ కాకతీయకు రూ.113 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో చెరువుల పునరుద్ధరణకు మరో రూ.113 కోట్ల పనులకు అనుమతులిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.