Fury
-
ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు!
(సాక్షి, సాగుబడి డెస్క్) :: అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు! గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబర్ 16) సందర్భంగా ‘వ్యవసాయం, ఆహార భద్రతలపై విపత్తుల ప్రభావం’పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో ఎఫ్ఏఓ ఈ వివరాలను తెలిపింది. ఎఫ్ఏఓ నివేదికలోని ముఖ్యంశాలివీ... పంటలు, పశువులకు గత (1991–2021) 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు (26%), కరువు (19%), వరదలు (16%) వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45% (1,72,000 కోట్ల డాలర్లు), ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22% (82,800 కోట్ల డాలర్లు), యూరప్ దేశాలు 17% (65,900 కోట్ల డాలర్లు), ఆఫ్రికా దేశాలు 15% (57,800 కోట్ల డాలర్లు), ఓసియానియా 1% (5,500 కోట్ల డాలర్లు) నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం.. 2022లో బ్రెజిల్ జీడీపీకి సమానం! అల్పాదాయ దేశాలు, అల్ప–మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10–15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే.. విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చే జారిపోతోంది. 2021లో ఫ్రాన్స్‌లో ఉత్పత్తయిన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నాం. 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలతో ఇది సమానం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తయిన వాటికి ఇది సమానం. అయితే, వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే.. ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే.. విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతి రోజూ ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతి రోజూ 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34–37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే, వాతారణ మార్పుల్ని దీటుగా తట్టుకునే, ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి. వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే, ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయిల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా. -
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
స్కెలిటన్ల షో... బెక్హాం
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో విక్టోరియా బెక్హాం ఫ్యాషన్ కవాతు ఇప్పుడు అనేది విమర్శలకు నెలవైంది. అస్థిపంజరాల (స్కెలెటన్స్) ప్రదర్శనగా మారింది. 2010 లో విక్టోరియా బెక్హాం తన క్యాట్ వాక్ లో సన్నని, అనారోగ్యంగా కనిపించే మోడల్స్ ను తాను నిషేధించినట్లు ప్రకటించింది. అయితే అప్పట్లో ఆ విషయం పలు విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ చూస్తే బెక్హాం తన మాటను వెనక్కు తీసుకున్నట్లు కనిపించింది సన్నని, అస్థిపంజరాలను తలపించే శరీరాకృతిలో ర్యాంపుపై నడచిన మోడల్స్ ను చూసిన జనం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షో స్కెలెటన్ షో ను తలపించిందని ఫేస్ బుక్, ట్విట్టర్లలో గగ్గోలెత్తుతున్నారు. ఆదివారం జరిగిన ఫ్యాషన్ పెరేడ్ కు ఆమె భర్త డేవిడ్, పదహారేళ్ళ కుమారుడు బ్రూక్లిన్, అమెరికన్ వోగ్ సంపాదకుడు అన్నా వింటర్ కూడ హాజరయ్యారు. అయితే పదిహేను మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న స్ట్రాంగ్ సోషల్ మీడియా నోట్లో ఇప్పుడు విక్టోరియా బెక్హాం విమర్శలే నానుతున్నాయి. ఆమె డిజైన్ల ప్రదర్శనకు ఎంచుకున్న మోడల్స్ ఛాయిస్ ను కొందరు తిట్టి పోస్తుంటే... మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కెలెటన్ షోలా ఉందని ఒకరు, ఆ మోడల్స్ అనారోగ్యంగా కనిపిస్తున్నారని మరొకరు ఫేస్ బుక్ లో కామెంట్లు విసిరేస్తున్నారు. ఎక్కువశాతం మంది బెక్హాం డిజైన్లకు పదిహేడేళ్ళ సన్నటి పేటన్ నైట్ ను ఎంచుకోవడాన్నిఆక్షేపిస్తున్నారు. నైట్... మోడల్ ఏజెన్సీలో మొదటిసారి పదకొండేళ్ళ ప్రాయంలోనే సైన్ చేసిందని, ఫ్యాషన్ డిజైనర్స్ అమెరికా కౌన్సిల్ నిర్ణయం ప్రకారం అప్పటికి ఆమె ఒక్క ఏడాది మాత్రమే పెద్దదని అంటున్నారు. మరి కొందరు ఫ్యాషన్ అభిమానులు ఏకంగా మోడల్స్ కు కాస్త తిండి పెట్టే ప్రయత్నం చేయమని సెటైర్లు విసురుతున్నారు. వారిని కాస్త బలంగా కనిపించేట్టు చేయమని దేవుడ్నిసైతం వేడుకుంటున్నారు. అయితే బెక్హాం తన ప్రదర్శనలకు మోడల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో విభిన్న నిర్ణయాలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మొదట్లో కూడ తన కలెక్షన్స్ ప్రదర్శనకు బెక్హాం ఓ సన్నని మోడల్ నే ఎంచుకుంది. అయితే షో తర్వాత కామెంట్స్ పై స్పందించిన బెక్హాం తన కలెక్షన్లు అన్ని సెజుల్లోనూ, ఆకృతుల్లోనూ ఉంటాయని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానని అంది. ఎవరెన్ని అన్నా.. తన డిజైన్లను మహిళలు తమకు బెస్ట్ గా ఫీలవుతారని చెప్పుకొచ్చింది.