G. Vittal reddy
-
విఠల్‌రెడ్డిపై తగిన చర్యలు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన అదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినట్లు నిర్ధారణ అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని సీఎల్పీనేత జానారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన టీఆర్ఎస్లో చేరిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నామని, దీనిపై ఎమ్మెల్యే వివరణ కోరి తదుపరి చర్యలు తీసుకుంటామని జానారెడ్డి పేర్కొన్నారు. -
నేడు కారెక్కనున్న మరో హస్తం ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విఠల్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో విఠల్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి. ఆయన కూడా కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుతో తెలంగాణ సీఎం కేసీఆర్ దూసుకు పోతున్నారని అందుకే ఆ పార్టీలో చేరాలను కుంటున్నట్లు విఠల్ రెడ్డి వెల్లడించారు.