Gaccibauli
-
సైకిల్ సవారీ
హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్’ ఉత్సాహంగా సాగింది. ఎర్త్ అవర్ డే సందర్భంగా గచ్చిబౌలి బైసైక్లింగ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ రైడ్ గూగుల్, కొత్తగూడ, గచ్చిబౌలి జంక్షన్ల మీదుగా సాగింది. కాలుష్య నివారణ, శారీరక దారుఢ్యం కోసం సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సైకిళ్లను వాడాల్సిన అవసరం ఉందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నగరంలో మరిన్ని సైక్లింగ్ క్లబ్‌లు రావాలని ఆకాంక్షించింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఐటీ ఉద్యోగులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సైకిల్‌పై స్వారీ చేశారు. గచ్చిబౌలి -
అయితే ‘మాకేంటి ?’
సీఎం ఆదేశాలు బేఖాతర్ హెచ్ఎండీఏలో మారని అధికారుల తీరు సిటీబ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశమంటే.... ఎలా ఉంటుందో.. దాని ప్రభావం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హెచ్ఎండీఏలో మాత్రం ఇలాంటి ఆదేశాలు చెల్లవు. అక్కడ ప్రతి పనికీ ఓ ‘లెక్క’ ఉంటుంది. ఆ ‘లెక్క’ ప్రకారమే పనులు జరుగుతాయి. లేదంటే... ఆ ఫైళ్లకు బూజు పట్టాల్సిందే. అందుకు నిదర్శనం కావాలంటే చూడండి...గచ్చిబౌలిలో కార్పొరే ట్ హాస్పిటల్స్ నిర్మాణానికి అనువుగా మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందిగా స్వయంగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. హెచ్ఎండీఏ అధికారులు వీటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సంబంధిత కార్పొరేట్ సంస్థలు వచ్చి తమను కలిశాకే అనుమతులివ్వాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా ఫైల్‌ను తొక్కి పెట్టేసినట్లు వినికిడి. ఆశయానికి గండి... గచ్చిబౌలిలో స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ నిర్మించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం సర్వే నం.136లో 5 కార్పొరేట్ సంస్థలకు ఏడెకరాలు విక్రయించింది. క్వాలిటీ కేర్ మెడికల్ (1 ఎకరా), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (1.9), మ్యాక్స్ విజన్ (1.7), రెయిన్బో ఇన్స్టిట్యూట్ (1.1), సర్వే జన ఇన్స్టిట్యూట్ (సన్ షైన్) 1.2)లు మొత్తం 5.19 ఎకరాలు కొనుగోలు చేశాయి. రోడ్డు కోసం 1.11 ఎకరాలు, పార్కింగ్‌కు 10 గుంటల విస్తీర్ణం కేటాయిస్తూ మొత్తం 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్లలో రోడ్డు అస్తవ్యస్థంగా ఉండటంతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సంస్థల వారు ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రోడ్డుఅలైన్మెంట్ మార్చాలని హెచ్ఎండీఏను కోరారు. దీనిపై 2012లో హెచ్ఎండీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆస్పత్రులు నిర్మించలేకపోయారు. పట్టించుకోని డెరైక్టర్లు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఆదేశించారు. ఆ మేరకు ఎంఏ అండ్ యూడీ నుంచి అప్రూవల్ ఇచ్చేశారు. ఇది జరిగి నెల రోజులైనా హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ సంస్థలు తమను కలవాలన్న ఉద్దేశంతో ఫైల్‌ను తొక్కిపెట్టేశారు. ఈ అంశం తన పరిధిలోకి రాదంటూ ప్లానింగ్ డెరైక్టర్-1, తనకు సంబంధం లేదంటూ డెరైక్టర్-2లు ే ఫైల్‌ను అటూ ఇటూ చక్కర్లు కొట్టిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారంతా బడా వ్యాపారవేత్తలు కావడంతో ఇక్కడి డెరైక్టర్ స్థాయి అధికారులను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. హెచ్ఎండీఏలోని అక్రమార్కులను ఓవైపు ఏసీబీ వెంటాడుతున్నా... అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
వ్యర్థాలతో అందమైన తోట
పనికిరాని వస్తువులను ఉపయోగించి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు నివేదిత. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అంటున్నారామె. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన సురవరం నివేదిత(9490952201)కు కాలేజీ రోజుల నుంచి మొక్కల పెంపకం హాబీ ఉంది. ఆ ఆసక్తితోనే పాత వస్తువులను వృథాగా పారేయకుండా సృజనాత్మకంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. పాత డబ్బాలు, మగ్గులు, టీ జార్లు, కూల్ డ్రింకు బాటిళ్లు , టైర్లు, టిన్నులు, షూలు, కుండలు, తినుబండారాల పార్శిల్ పాత్రలు, పైపులు, బూట్లు, సాక్స్‌లు, పాత టీవీల క్యాబినెట్లు, ట్రాన్సిస్టర్ క్యాబినెట్లు, నీళ్ల డ్రమ్ములు, సీడీల పార్శిల్ డబ్బాలు, విద్యుత్ బల్బులు.. ఇలా సుమారు రెండు వందల వరకూ పనికిరాని వస్తువుల్లో ఇంటిపంటలను పండిస్తున్నారామె. పాత డబ్బాలకు రంగులేసి, బొమ్మలు వేసి ఇంటిపంటలకు సిద్ధం చేస్తారు. స్వతహాగా పెయింటర్ అయిన ఆమె సంప్రదాయ, ఆధునిక, మధుబని, ట్రైబల్ పెయింటింగ్స్‌ను మొక్కల కుండీలపై చిత్రిస్తుంటారు. చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించడాన్ని కుటుంబ సభ్యులతోపాటు అతిథులూ అభినందిస్తున్నారని, పరిసరాలను మరింత అందంగా మార్చుకోవటం ద్వారా మనోల్లాసం కలుగుతున్నదని ఆమె తెలిపారు. ‘పెద్ద బకెట్లు, పాత్రలు వంటి వాటిలో కరివేపాకు, మిరప, వంగ, టమాటా వంటి మొక్కలు పెట్టాలి. సన్నగా, పొడవుగా ఉండే పైపుల్లో కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు పెంచాలి. మొక్కల ఆకులు, ఇంట్లో కూరగాయ వ్యర్థాలతో తయారైన కంపోస్టు, పశువుల ఎరువు, టీ పౌడర్ వంటి వాటిని కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నా’ అన్నారామె. రోజువారీ పనులకు అడ్డం రాకుండా గదుల్లో, హాలులో, కిటికీల బయట, మెట్ల దగ్గర, ప్రహరీ గోడలకు వేలాడ దీసేలా పాత వస్తువులతో కుండీలను రూపొందించడం నివేదిత ప్రత్యేకత. స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు. కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్లో సగం వరకు తాను ఇలాగే పెంచుతున్నారు. ‘శని, ఆదివారాలు పూర్తిగా ఇంటిపంటలకే కేటాయిస్తున్నా. అపార్ట్మెంట్లు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లలో ఈ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. స్నేహితుల కోరిక మేరకు శుభకార్యాల సందర్భంలోనూ సృజనాత్మక ఇంటిపంటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నా. ఇవి చూసి కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారు. ఈ పంటలను చూసినప్పుడల్లా వాళ్లు నన్ను తలుచుకుంటారనే భావన ఎంతో సంతోషం కలిగిస్తోంది’ అంటున్నారు నివేదిత. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్, ఫొటోలు : గడిగె బాలస్వామి -
గచ్చిబౌలిలో శాంతి సరోవర్ వార్షికోత్సవం