సైకిల్ సవారీ
హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్’ ఉత్సాహంగా సాగింది. ఎర్త్ అవర్ డే సందర్భంగా గచ్చిబౌలి బైసైక్లింగ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ రైడ్ గూగుల్, కొత్తగూడ, గచ్చిబౌలి జంక్షన్ల మీదుగా సాగింది.
కాలుష్య నివారణ, శారీరక దారుఢ్యం కోసం సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సైకిళ్లను వాడాల్సిన అవసరం ఉందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నగరంలో మరిన్ని సైక్లింగ్ క్లబ్‌లు రావాలని ఆకాంక్షించింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఐటీ ఉద్యోగులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సైకిల్‌పై స్వారీ చేశారు. గచ్చిబౌలి