Gadgil
-
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు. -
ఇది మానవతప్పిదమే: గాడ్గిల్
పణజీ: కేరళ ప్రకృతి విలయానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ అన్నారు. పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందానికి నేతృత్వం వహించిన ఆయన.. నదీ తీరాలపై అక్రమ నిర్మాణాలు, అక్రమ క్వారీలు, మైనింగ్ కారణంగానే విపత్తు తలెత్తిందన్నారు. ‘నాటి మా నివేదికను ప్రభుత్వం మినహా ఎవరూ తప్పుబట్టలేదు. అక్రమ మైనింగ్, క్వారీయింగ్‌లనుంచి పశ్చిమ కనుమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి విపత్తులు తప్పవు. కేరళలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అసాధారణవర్షాలు కాదు’ అన్నారు. -
కేరళలో ఎందుకీ విపత్తు ?
దేవభూమి కేరళ వర్ష బీభత్సానికి చివురుటాకులా వణుకుతోంది. అసలు ఎందుకీ ప్రకృతి ప్రళయం ? 2011లో చేసిన ఒక తప్పిదమే ఇప్పుడు వెంటాడుతోందా ? ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, కొండ ప్రాంతాల్ని తొలిచేయడం వల్లే ఈ దుస్థితి ఎదురైందా? అనే అనుమానాలు తలెత్తడం సహేతుకమే. గాడ్గిల్ కమిటీ సిఫారసులు బేఖాతర్ పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో ప్రతీ ఏడాది వర్షాలు ఎక్కువ. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ భారీ వర్షాలు మామూలే. వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి ముందస్తుగా సరైన చర్యలు చేపట్టకపోవడం, పర్యావరణవేత్తలు చేసిన సూచనల్ని, సలహాల్ని పెడచెవిన పెట్టడం వల్ల ఇప్పుడు అతివృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేరళ ముప్పు ముంగిట్లో ఉందని 2011లోనే గాడ్గిల్ కమిటీ హెచ్చరించింది. లక్షా 40 వేల విస్తీర్ణంలోని పశ్చిమ కనుమల్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనవని పేర్కొంటూ వాటిని మూడు జోన్లగా విభజించింది. ఈ జోన్లలో మైనింగ్ తవ్వకాలు, ఎడాపెడా నిర్మాణాలు చేపట్టవద్దంటూ సూచనలు చేసింది. అటవీ కార్యకలాపాలకు మాత్రమే ఈ జోన్లను వాడుకోవాలని సిఫారసు చేసింది. కానీ అప్పట్లో కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వం గాడ్గిల్ కమిటీ చేసిన సిఫారసుల్ని పెడచెవినపెట్టింది. యథేచ్ఛగా తవ్వకాలు.. ఈ సీజన్లో కేరళలో అత్యధికమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం కొండచరియలు విరిగిపడటమే. ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కొజికోడ్, మలాపురం వంటి జిల్లాల్లో కొండచరియలు తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికంగా నివాసం ఉండే వారి సహకారంతో కొండ ప్రాంతాలను ఎలా కాపాడుకోవచ్చో గాడ్గిల్ కమిటీ వివరించింది. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, కొండ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టింది. కేరళ వ్యాప్తంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న యూనిట్లు 1500కి పైగానే ఉన్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్లో తవ్వకాలు జరపడం వల్ల నేల అడుగు భాగంలో మట్టి కదిలిపోయి డొల్లగా మారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలపై నిషేధం విధించాలంటూ 2011లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ ఈ విపత్తు మానవ తప్పిదమేనని అంటున్నారు. కొండలపై ఆకాశహర్మ్యాలు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న సాకుతో కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా రిసార్టులు, రెస్టారెంట్ల నిర్మాణానికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అటవీ భూముల్ని ఆక్రమించి చెట్లను నరికేసి ఎడాపెడా భవంతులు నిర్మించారు. వాటర్ జోన్లలో కూడా చట్టవిరుద్ధంగా ఆకాశహర్మ్యాలు వెలిశాయి. దీంతో కొండప్రాంతాలు నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. పై నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమైంది. అదే ఇప్పుడు కేరళకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిపోయి గేట్లను ఎత్తేయడం ఒక్కటే ఇప్పటి పరిస్థితికి కారణం కాదని, ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ స్టడీస్ మాజీ శాస్త్రవేత్త వి. థామస్ అన్నారు. కేరళలో 44 నదులు ప్రవహిస్తున్నాయి. నదీ గర్భాన్ని తవ్వుతూ తీరాల వెంట గృహ నిర్మాణాలు చేపట్టడంతో జనవాసాలను వరద నీరు ముంచెత్తింది. 1924 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే ప్రథమం కేవలం రెండున్నర నెలల్లోనే 37% అధిక వర్షపాతం నమోదు ఇడుక్కిజిల్లాలో 83.5% అధిక వర్షపాతం 27 డ్యామ్‌ల గేట్లను ఎత్తేశారు 211 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయ్ మృతుల సంఖ్య 180 పై మాటే 20 వేల ఇళ్లు ధ్వంసం 10 వేల కిలోమీటర్ల రహదారులు నాశనం రూ.8,316 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వరదముప్పులో ఉన్న జిల్లాలు ః 13 రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ః 9 ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం మూసివేత ఆసియాలో అతి పెద్ద డ్యామ్ ఇడుక్కి నుంచి గత మూడు నాలుగు రోజులుగా సెకండ్‌కి 10–15 లక్షల లీటర్ల నీరు విడుదల సహాయ చర్యల్లో నిమగ్నమైన 18 బృందాలు, మరో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం ఓనం పండుగ కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధులు వరద సహాయానికి మళ్లింపు -
'2017 జూలై నాటికి మెట్రో రైలు నిర్మాణం పూర్తి'
-
'2017 జూలై నాటికి మెట్రో రైలు నిర్మాణం పూర్తి'
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు పనులు చకచక సాగుతున్నాయి. మరో రెండేళ్లలో మెట్రో రైలు నగర ప్రజలకు అందుబాటులోకి రానుందని మెట్రో రైలు నిర్మాణం చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ వి.బి.గాడ్గిల్ వెల్లడించారు. 2017 జూలై నెల నాటికి హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తవుతుందని ఆయన బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అలాగే నగరంలో 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియాల్ మాల్స్ అభివృద్ధి చేస్తున్నట్లు గాడ్గిల్ వివరించారు. నగరంలోని జీహెచ్ఎంసీ, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య ప్రకటనల విషయంలో ఎలాంటి వివాదం లేదని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రస్తుతానికి రూ. 20 వేల కోట్లకు చేరుకుందని రెడ్డి పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది
మెట్రో రైలు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ వరంగల్: దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది అని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కలలు కన్నట్టు 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఎల్అండ్ టీ మెట్రో రైలు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ పిలుపు నిచ్చారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో గురువారం టెక్నోజియాన్-2014 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథి గా హాజరైన వీబీ గాడ్గిల్ నిట్ ఆడిటోరియంలో జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో దేశం గర్వించదగ్గ మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. కేంద్రం పంచవర్ష ప్రణాళిక, తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ద్వారా కొత్త ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నోజియాన్-2014లో పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంశంగా చేర్చుకోవడం మంచి పరిణామమన్నారు. టెక్ వేదిక సీఈవో సాయి సంగి నేని, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు,స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావు, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
మెట్రో అలైన్మెంట్ మార్పుపై కేసీఆర్ ఆరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎలివేటెడ్ మెట్రో రైలు అలైన్మెంట్ (మార్గం) మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్ అండ్ టీ ఎండీ ఈడీ గాడ్గిల్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ముఖ్యం గా సుల్తాన్ బజార్ చారిత్రక మార్కెట్, మొజాం జాహి మార్కెట్, గన్‌పార్కు, అసెంబ్లీ మీదుగా వెళ్లే మెట్రో మార్గాన్ని భూగర్భ మార్గం గుండా మార్చితే ఎలా ఉంటుందన్న అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించా రు. కాగా, నగరంలో ఇప్పటికే ఈ మార్గంలో పలుచోట్ల ఎల్ అండ్ టీ సంస్థ పిల్లర్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారి వా దనతో సీఎం ఏకీభవించకుండా, తాను చెప్పిన అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో పనులు చేపట్టాలని సూచించారు. కాగా, సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని సీఎం సంబంధిత అధికారులను గట్టిగా ఆదేశించినట్లు సమాచారం.