Gagan
-
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
ఇండిగో రికార్డ్.. గగన్ ఉపయోగించిన తొలి సంస్థగా గుర్తింపు
విమాన ప్రయాణాలకు సంబంధించి దేశీయంగా తయారు చేసిన గగన్ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా ఇండిగో రికార్డు సృష్టించింది. విమాన ప్రయాణాలు ప్రారంభమైనప్పటి నుంచి విదేశాల్లో రూపొందించిన నావిగేషన్ వ్యవస్థ ఆధారంగా పైలెట్లు విమానాలు నడుపుతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా సొంత నావిగేషన్ వ్యవస్థకి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థలు సంయుక్తంగా గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్) వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇండిగో సంస్థ 2022 ఏప్రిల్ 27న ఏటీఆర్ 72 ఎయిర్‌క్రాఫ్ట్‌ను గగన్ ఆధారంగా నడిపించింది. ఈ విమానం గగన్‌ను ఉపయోగిస్తూ విజయవంతంగా రాజస్థాన్‌లోని కిషన్‌గడ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. చిన్న విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌కు గగన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ లేని ఎయిర్‌పోర్టుల్లో గగన్ ద్వారా సులువుగా ల్యాండ్ అవడం సాధ్యమవుతుంది. చదవండి: మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే? -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
ఆహా... పిడుగా!
స్కేటింగ్‌లో చిన్నారి గిన్నీస్ రికార్డు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 39 టొయోటా క్వాలిస్ కార్ల కింద కేవలం 28 సెకన్లలో స్కేటింగ్ ద్వారా రయ్‌మని దూసుకొచ్చేశాడు చిచ్చర పిడుగు గగన్. స్థానిక బసవేశ్వర నగరలోని ఫ్లోరెన్స్ స్కూలులో కిండర్ గార్టెన్ విద్యార్థి అయిన ఐదేళ్ల గగన్‌కు స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఏడాదిన్నర కిందట స్కేటింగ్ క్లాసులో చేరాడు. అతని తండ్రి సతీశ్ వాషింగ్ మెషిన్ సర్వీసు సెంటర్లో పని చేస్తున్నాడు. స్కేటింగ్‌పై కుమారునికున్న శ్రద్ధాసక్తులను గమనించి, ఇందులో అతను ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. గిన్నీస్ రికార్డు కోసం 39 టొయోటా కార్లను వరుసగా 69.2 మీటర్ల దూరం మేరకు నిలిపి ఉంచారు. భూమికి, కార్ల ఛాసిస్‌లకు మధ్య దూరం కేవలం 8 అంగుళాలే. గతంలో రాష్ట్రంలోని బెల్గాంకు చెం దిన తొమ్మిదేళ్ల రోహన్ 47 సెకన్లలో 24 కార్ల కింద స్కేటింగ్ చేశాడు. ఆ రికార్డును గగన్ బద్దలు కొట్టాడు.