దళారీ వ్యవస్థను రూపుమాపుతాం
తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని తిరుపతి ఆర్టీవో గజ్జల వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ముందుగా శ్రీవారిని దర్శనం చేసుకుని అనంతరం తిరుపతి ఆర్టీవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
తిరుపతి(మంగళం): తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని తిరుపతి ఆర్టీవో గజ్జల వివేకానందరెడ్డి అన్నారు. ఈయన హిందూపురం నుంచి తిరుపతికి బదిలీపై వచ్చారు. మంగళవారం ఉదయం ముందుగా శ్రీవారిని దర్శనం చేసుకుని అనంతరం తిరుపతి ఆర్టీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఏలో వాహనదారులు నేరుగా వచ్చి పనులు చేసుకోవచ్చన్నారు. ద ళారీల చేతులో పడి అధికంగా డబ్బు చెల్లించి మోసపోవద్దని సూచించారు. వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల ను సకాలంలో వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలి పారు.
వాహనదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి విశిష్ట సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా, లెసైన్స్ లేకుండా నడుపుతున్నా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు బాధ్యతలు చేపట్టిన ఆర్టీవోకు కార్యాలయంలోని ఏవోలు మల్లికార్జునరెడ్డి, గంటా సుబ్రమణ్యం, ఎంవీఐలు నాగరాజనాయక్, శివశంకర్, చంద్రశేఖర్, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.