Gajwel tour
-
ఆరోగ్య ప్రొఫైల్.. గజ్వేల్ నుంచే
మనం ఎన్ని కోట్లు సంపాదించి పిల్లలకు ఇచ్చామనేది ముఖ్యం కాదు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అందించామన్నదే కీలకం. కోట్లు సంపాదించి పెట్టి వాతావరణ కాలుష్యం ఇస్తే ఏం ప్రయోజనం? ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. పిల్లలను పెంచినట్లు మొక్కలు పెంచాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉండాలి.. అందుకు ప్రజల ఆరోగ్య రికార్డును తయారు చేయాలి.. దీనికి గజ్వేల్ నియోజకవర్గమే నాంది కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఫారెస్టు కళాశాల, పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురిపిస్తున్న మహిళలు అనంతరం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, మహతి ఆడిటోరియాలను ప్రారంభించి.. వంద పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరి ఆరోగ్య రికార్డు ఉంటుంది. ఇలాగే మన రాష్ట్రం లోనూ తయారు చేయాలని కేసీఆర్ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లెడ్ గ్రూప్, ఇతర వివరాలు తెలిస్తే వెంటనే చికిత్స అందుతుందన్నారు. ములుగు అటవీ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ముందుగా గజ్వేల్ నియోజకవర్గం ఎక్స్‌రే పేరుతో ప్రతి ఒక్కరినీ పరీక్షించి రికార్డు సిద్ధం చేయాలని చెప్పారు. తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశించారు. గజ్వేల్‌లో నిర్మించిన ఆడిటోరియం పేరు ‘మహతి’అని.. ఈ పేరు తానే పెట్టానని చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప సంగీత విద్వాంసులు నారద, తుంబురులని, నారద మహాముని వద్ద ఉన్న వీణ పేరు ‘మహతి’ అని చెప్పారు. ఇలాంటి ఆడిటోరియం ప్రతీ నియోజకవర్గంలో నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పా రు. అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. అక్కడే సంపద సృష్టించాలని అందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కథానాయకులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు.. జనవరి చివరి నాటికి గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాలో ప్రవహిస్తాయని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం జలాలతో కొండపోచమ్మ సాగర్ ప్రాం తమంతా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో ఔషధ, సుగంధ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ‘వికారాబాద్ హవా.. లాకో మరీదోంకా ధవా..’(వికారాబాద్ ప్రాంతంలోని ఔషధ మొక్కల గాలి లక్షల రోగాల ఉపయోగపడే ఔషధం) అనే నానుడి ఉండేదని కేసీఆర్ అన్నారు. అటువంటి వాతావరణం కొండపాక ప్రాంతంలో తీసుకురావాలన్నారు. జర గజ్వేల్‌పై దృష్టి పెట్టండి.. తాను వివిధ పనుల నిమిత్తం బిజీగా ఉండి నియోజకవర్గంపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నానని, మంత్రులూ.. మీరే గజ్వేల్‌పై జర కన్నేసి నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ చమత్కరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో నిర్మించిన అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తన కార్యాలయంలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారిని ప్రియాంకా వర్గీస్ స్ఫూర్తి అని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ కార్పొషన్ చైర్మన్ దామోదర్ గుప్త, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్రావు, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, సతీష్‌కుమార్, పీసీసీఆర్ ఆర్ శోభ, డీన్ చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. ఏమ్మా.. కిలో టమాటా ఎంత? రాయపోలు(దుబ్బాక): గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. గజ్వేల్‌కు చెందిన కూరగాయల వ్యాపారి అడివమ్మను పలకరించారు. ఏమ్మా వ్యాపారం ఎలా ఉంది.. టమాటా కిలో ఎంత అంటూ ప్రశ్నించారు. బాగుంది సారూ.. అని ఆమె చెప్పగానే ‘మరి నాకు కూరగాయలు ఏమైనా ఇస్తావా’.. అంటూ అడిగారు. దీనికి ఆమె సంతోషంగా నవ్వులు కురిపిస్తూ.. ‘అయ్యో ఎంతమాట సారూ.. ఏం కావాలంటే అది ఇస్తాను..’అంటూ నాలుగైదు రకాల కూరగాయలను కేసీఆర్‌కు ఇవ్వబోయింది. అందుకు బోణీ అయిందా అంటూ.. ఆయన తన జేబులోంచి రూ.2 వేల నోటును తీసి అడివమ్మకు ఇచ్చారు. దీంతో ఎంతో సంబరపడిన అడివమ్మ.. కేసీఆర్‌కు రెండు చేతులు జోడించి దండం పెట్టింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. మాంసం వ్యాపారులు, చేపల వ్యాపారులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ పూర్తయితే అన్ని చెరువులు నీటితో నిండుతాయని, అప్పుడు మన చేపలే అమ్ముకుందామని వ్యాపారులతో అన్నారు. మోడల్ సీఎం కేసీఆర్ హరీశ్‌రావు నియోజకవ ర్గం ఎలా ఉండాలో చేసి చూపించిన కేసీఆర్ అని, గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మహతి ఆడిటోరియం లో ఆయన మాట్లాడారు. ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రం, ఉద్యానవన వర్సిటీ, సమీకృత మార్కెట్, మహతి ఆడి టోరియం అన్నీ ఒకే రోజు ప్రారంభమయ్యాయని.. ఇది గజ్వేల్ చరిత్రలో శుభదినం అన్నా రు. ఒక్క గజ్వేల్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికి తాగునీరు అందిం చిన ఘనత తెలంగాణదని, ఆ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. -
ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వేల్ పర్యటనకు ఆదివారం విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్‌లో బహిరంగ సభకు దాదాపు 4 వేల మంది సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనను పర్యవేక్షించేందుకు ఒక అదనపు డీజీ ర్యాంకుగల అధికారితోపాటు ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించింది. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించింది. మరోవైపు ఢిల్లీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని కాన్వాయ్‌తోపాటు సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది. ఒక దానిలో ప్రధానితోపాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్లో డీజీపీ, సీఎస్ తదితరులు వెళ్లనున్నారు. మూడో హెలికాప్టర్లో ప్రధాని భద్రతా సిబ్బంది ప్రయాణించనుండగా మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలను తెప్పించారు. గజ్వేల్‌లో సభ కోసం 3 వేల ఆర్టీసీ బస్సులను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డిపోల నుంచి తరలిస్తున్నారు. మరో వెరుు్య ప్రైవేట్ బస్సులనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లపై మంత్రి హరీశ్ సమీక్ష గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. సభావేదిక, ఆ తర్వాత హెడ్‌రెగ్యులేటర్ వద్ద పైలాన్ తుది దశ పనులను పరిశీలించారు. -
గజ్వేల్.. జిగేల్..
- సకల హంగులతో రూపురేఖలు మారుస్తా: సీఎం కేసీఆర్ వెల్లడి గజ్వేల్: ఒకటి రెండేళ్లలో గజ్వేల్‌కు అన్ని హంగులు కల్పించి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పరుస్తామని, పట్టణ ముఖచిత్రాన్నే మార్చివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించి, రూ. 98.72 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మర్కుక్ పీహెచ్సీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాండవుల చెరువులో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మార్చి 12న ఇచ్చిన మాట ప్రకారం మోడల్ కాలనీ, వంద పడకల ఆసుపత్రి, ఆడిటోరియం, బాల, బాలికల ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. మోడల్ కాలనీలో సుమారు 2,500 నుంచి 3 వేల మందికి జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్టు చెప్పారు. కాలనీ వాసులకు రోడ్లు, మంచినీరు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లు వంటి సదుపాయాలను కల్పిస్తామనీ, విరివిగా మొక్కలు నాటుతామన్నారు. మోడల్ కాలనీకి రింగ్ రోడ్డు, నాలుగు వరుసల రోడ్ల నిర్మాణాలతో అనుసంధానం చేస్తామన్నారు. గజ్వేల్ నగర పంచాయతీ వాసులకు మరో 7, 8 నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామన్నారు. దీంతోపాటు మంత్రి హరీశ్‌రావు ఆలోచన మేరకు గజ్వేల్‌లో భూగర్భ డ్రైనేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం పర్యటనలో విలేకరులకు తప్పిన ముప్పు గజ్వేల్‌లో శనివారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో కాన్వాయి వెంట ఓపెన్‌టాప్ వాహనంలో ఉన్న విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లకు పెనుప్రమాదం తప్పింది. మీడియా ప్రతినిధులు వాహనంలో వెళ్తున్న సమయంలో రోడ్డుపై కిందకు వేలాడుతున్న వైర్లు ఓపెన్‌టాప్ వాహనంలోని నలుగురు విలేకరులకు తాకాయి. దీంతో వారు అరుస్తూ, వాహనంలోనే పడిపోగా, డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. స్వల్పంగా గాయపడ్డ విలేకరులను పలువురు పరామర్శించారు. -
గజ్వేల్‌లో కేసీఆర్ పాదయాత్ర
గజ్వేల్: మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వినతిపత్రాల్లో సూచించిన విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
12న గజ్వేల్‌కు సీఎం రాక
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం - నాచగిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం - ఆ తర్వాత నగర పంచాయతీలో పర్యటన గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన దాదాపు ఖరారైంది. ఈనెల 12న నగర పంచాయతీలో పర్యటించనున్నారనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జనవరి 20న ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ పర్యటించడానికి తాజాగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ రోజు ముందుగా వర్గల్ మండలం నాచగిరి బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత గజ్వేల్‌కు చేరుకొని నగరపంచాయతీ పరిధిలోని రామాలయం మీదుగా ఎస్సీ కాలనీలో పర్యటిస్తారు. పట్టణంలోని వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటారు. ఎస్సీ కాలనీలోని పిడిచెడ్ రోడ్డు మీదుగా ముందుకు సాగుతారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శిస్తారు. ఇక్కడ నిర్మించతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం, ఆడిటోరియానికి సంబంధించి స్థల సేకరణ విషయమై అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్న భోజనాన్ని ముగించుకొని హైదరాబాద్ వెళ్తారు. ఈ విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు ధ్రువీకరించారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని శాఖల వారీగా అధికారులు సమీక్షల్లో నిమగ్నమయ్యారు. -
బస్తీబాట రేపే
* గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన .. * అధికారులు ఉరుకులు.. పరుగులు * ఏర్పాట్లపై జేసీ శరత్ సమీక్ష * ‘ఆహార భద్రత’, ‘ఆసరా’ పథకాల అమలుపై ఆరా గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు..పరుగులు పెడుతోంది. ఈనెల 20న గజ్వేల్ నగర పంచాయతీలో సీఎం కేసీఆర్ బస్తీబాట నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై సమీక్షల్లో మునిగిపోయారు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ శరత్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో కలిసి ‘ఆహార భద్రత’, ‘ఆసరా’ పథకాలు అర్హులకు అందాయా....? లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. సరుకుల పంపిణీలో వెనుకబడిన పలువురు డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వరకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయకపోతే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపైనా చర్యలుంటాయన్నారు. ప్రస్తుతం ఆహార భద్రత, ఆసరా పథకాల్లో పేర్ల గల్లంతైన అర్హులకు వెంటనే న్యాయం చేసే దిశగా పథకాలు మంజూరు చేయాలని జేసీ ఆదేశించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలో నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాపుపై ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి తదితరులతో కలిసి సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై సైతం ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు సైతం నగర పంచాయతీకి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అంశాల వారీగా రెండురోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. -
వరి విత్తనాల సబ్సిడీ పునరుద్ధరణ
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో వరి విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించారు.. గజ్వేల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.. ప్రస్తుతం కూడా వరి విత్తనాలపై రూ.2 కోట్ల సబ్సిడీ యథాతథంగా అందనున్నది. జిల్లాను జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి తొలగించడం వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు వరి విత్తనాలపై సబ్సిడీ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే సమస్య తీవ్రతను చాటడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ఈ క్రమంలో ఆయన సబ్సిడీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ కథనం.. వరి సాగులో జిల్లా రైతాంగానికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందువల్లే ఈ ప్రాంతం మెతుకుసీమగా ఖ్యాతికెక్కింది. మిగతా పంటలతో పోలిస్తే వ రికి ఎన్ని కష్టనష్టాలెదురైనా వరి పట్ల అన్నదాత మొగ్గు చూపుతున్నాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంటకు జిల్లాను ‘జాతీయ ఆహారభద్రతా పథకం’ జాబితా నుం చి తొలగించడంవల్ల ప్రతి ఏటా ఇస్తున్న కొద్దో గోప్పో విత్తనాల సబ్సిడీకి మంగళం పాడటానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జిల్లాకు సుమారు 90వేల హెక్టార్ల లో వరి సాగైతే 36వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సి డీ కింద పంపిణీ చేశారు. ఈ లెక్కన రైతులకు రూ. 1.80 కోట్లకుపైగా సబ్సిడీ వర్తించింది. ఈసారి 40వేల క్వింటాళ్ల వరి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని ల క్ష్యంగా నిర్ణయించారు. దీని ప్రకారం రైతులకు రూ.2కోట్ల సబ్సిడీ వర్తించనుండగా...ప్రభుత్వ నిర్ణయంతో రైతులంతా షాక్‌కు గురయ్యారు. ఈ విషయా న్ని ముందుగానే పసిగట్టిన ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో జిల్లాలోని వ్యవసాయశాఖపై రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఆ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన హుక్యానాయక్, ఇప్పటివరకు జేడీఏగా వ్యవహారించిన ఉమాహేశ్వరమ్మ గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సమస్యను విన్నవించారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పం దించిన సీఎం జిల్లాకు వరి విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో కలెక్టర్ ద్వారా వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదన వెళ్లింది. రెండుమూడు రోజుల్లో ఇది క్లియర్ అయ్యి సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ వర్గాలు‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించాయి.