Galaxy A7
-
వెనుకవైపు 3 కెమెరాలతో శాంసంగ్ ఫోన్
న్యూఢిల్లీ : వెనుక వైపు మూడు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హువావే పీ20 ప్రొ మాదిరి, గెలాక్సీ ఏ7 అనే స్మార్ట్‌ఫోన్‌ను వెర్టికల్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్‌లో వెనుకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ ధర రూ.23,990గా నిర్ణయించింది. బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న మరో వేరియంట్ ధర రూ.28,990గా పేర్కొంది. వెనుక వైపు మూడు కెమెరాలు కలిగిన ఫోన్లలో, శాంసంగ్ ధరనే తక్కువగా ఉంది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ షాపు, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ కొత్త ఓపెన్ చేసిన ఓపెరా హౌజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 29 నుంచి అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ ఏ7 విక్రయానికి వస్తుంది. బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ7 స్పెషిఫికేషన్లు... 6.0 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే పైన, కింద బెజెల్స్ అద్భుతమైన సౌండ్ అనుభవం కోసం డోల్బే అట్మోస్ సపోర్ట్ వెనుక వైపు గ్లాస్‌ప్యానల్ ఫోన్ వెనుక ఎడమవైపు టాప్‌లో మూడు కెమెరాలు 8 ఎంపీ, 24 ఎంపీ, 5 ఎంపీలతో బ్యాక్ కెమెరాలు 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2.2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7885 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ , 6జీబీ ర్యామ్ 6జీబీ స్టోరేజ్, 128జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరణ మెమరీ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 7.5 ఎంఎం థిక్నెస్ -
ఆ ఫోన్లపై మళ్లీ ధర తగ్గింపు
న్యూఢిల్లీ : శాంసంగ్ తన ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లపై రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ధరలను తగ్గించింది. గెలాక్సీ ఏ5(2017), గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్ ఫోన్ ధరను రూ.4000 మేర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తంగా కలిపి లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10వేల రూపాయల మేర ఈ స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గాయి. లాంచ్ అయినప్పుడు రూ.27,990గా ఉన్న గెలాక్సీ ఏ5(2017), ప్రస్తుతం రూ.17,990కి అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా రూ.30,900గా ఉన్న గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్, రూ.20,990కు దిగొచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆగస్టులో వీటి ధరను రూ.5000 మేర తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ప్రధాన ఆకర్షణ తమ గెలాక్సీ ఎస్7- స్టయిల్ డిజైన్, తక్కువ వెలుతురు ఆప్టిమైజేషన్లో కెమెరా, కెమెరా యూఎక్స్, అదేవిధంగా దుమ్ము, నీళ్లను తట్టుకునే సామర్థ్యంతో ఏపీ68 రేటింగ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కేవలం స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే విభిన్నంగా ఉంటాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపు సమానం. గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా... గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్ 5.7 అగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3600 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, శాంసంగ్ పే సపోర్టు, 1.9 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఎస్ఓసీ, 16ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. -
శాంసంగ్ నుంచి కొత్త 4జీ ఫోన్లు
♦ గెలాక్సీ ఏ7, ఏ5 విడుదల ♦ 20కి చేరిన మోడళ్ల సంఖ్య ♦ కంపెనీ డెరైక్టర్ మను శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ 4జీ విభాగంలో దూకుడు మీద ఉంది. తాజాగా గెలాక్సీ ఏ7, గెలాక్సీ ఏ5 మోడళ్లను హైదరాబాద్ వేదికగా సోమవారం విడుదల చేసింది. దీంతో కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టిన 4జీ మోడళ్ల సంఖ్య 20కి చేరుకుంది. ఈ విభాగంలో సంస్థ మార్కెట్ వాటా 62 శాతానికి ఎగసిందని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ బిజినెస్ డెరైక్టర్ మను శర్మ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో భారత్‌కు దిగుమతైన స్మార్ట్ఫోన్లలో ఈ మోడళ్ల వాటా 60 శాతముందని చెప్పారు. టెల్కోలు 4జీ సేవలను విస్తరిస్తుండడంతో ఈ మోడళ్ల అమ్మకాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 55 కోట్ల ఫీచర్, 17 కోట్ల స్మార్ట్‌ఫోన్ వాడకందారులు ఉన్నారు. స్మార్ట్ఫోన్లలో 14 కోట్ల మంది 2జీ, 3జీ యూజర్లున్నారు. వీరు 4జీకి అప్‌గ్రేడ్ అవుతున్నారని మను శర్మ తెలిపారు. ఇవీ ఏ7, ఏ5 ఫీచర్లు.. గెలాక్సీ ఏ7 మోడల్‌ను 5.5 అంగుళాల స్క్రీన్, 3 జీబీ ర్యామ్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారు చేశారు. ధర రూ.33,400 ఉంది. గెలాక్సీ ఏ5ను 5.2 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీతో డిజైన్ చేశారు. ధర రూ.29,400 ఉంది. రెండు మోడళ్లలోనూ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, లాలీపాప్, 1.6 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ వరకు సపోర్ట్ చేసే మైక్రో ఎస్డీ స్లాట్, 7.3 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. వైడ్ సెల్ఫీ, పామ్ సెల్ఫీ, బ్యూటీ ఫేస్ ఫీచర్ ఉంది. ఫింగర్ స్కానర్, ఫాస్ట్ చార్జింగ్ వంటివి అదనపు హంగులు. 300 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లింక్, 50 ఎంబీపీఎస్ వరకు అప్‌లింక్ స్పీడ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.