శాంసంగ్ గెలాక్సీ ఏ7 స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : వెనుక వైపు మూడు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హువావే పీ20 ప్రొ మాదిరి, గెలాక్సీ ఏ7 అనే స్మార్ట్‌ఫోన్‌ను వెర్టికల్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్‌లో వెనుకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ ధర రూ.23,990గా నిర్ణయించింది. బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న మరో వేరియంట్ ధర రూ.28,990గా పేర్కొంది. వెనుక వైపు మూడు కెమెరాలు కలిగిన ఫోన్లలో, శాంసంగ్ ధరనే తక్కువగా ఉంది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ షాపు, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ కొత్త ఓపెన్ చేసిన ఓపెరా హౌజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 29 నుంచి అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ ఏ7 విక్రయానికి వస్తుంది. బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ7 స్పెషిఫికేషన్లు...
6.0 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
పైన, కింద బెజెల్స్
అద్భుతమైన సౌండ్ అనుభవం కోసం డోల్బే అట్మోస్ సపోర్ట్
వెనుక వైపు గ్లాస్‌ప్యానల్
ఫోన్ వెనుక ఎడమవైపు టాప్‌లో మూడు కెమెరాలు
8 ఎంపీ, 24 ఎంపీ, 5 ఎంపీలతో బ్యాక్ కెమెరాలు
24 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2.2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7885 ప్రాసెసర్
4జీబీ ర్యామ్ , 6జీబీ ర్యామ్
6జీబీ స్టోరేజ్, 128జీబీ స్టోరేజ్
512జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
7.5 ఎంఎం థిక్‌నెస్
Comments
Please login to add a commentAdd a comment