Galaxy Note 9
-
బిగ్‌సిలో గెలాక్సీ నోట్9ను లాంచ్ చేసిన పూజా హెడ్గే
-
‘శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9’ విడుదల
కృత్రిమ మేధ (ఏఐ) కలిగిన అధునాతన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ నోట్ 9’ మార్కెట్లో విడుదలైంది. స్క్రీన్‌షాట్‌ను వాయిస్ ద్వారా సైతం పంపగలిగే బిక్స్బితో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్.. 6.4 అంగుళాల డిస్ప్లే, 845 స్నాప్‌డ్రాగ్ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లను కలిగిఉన్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. 128 జీబీ ధర రూ.67,900 కాగా, 512 జీబీ ఫోన్ ధర 84,900 ఉన్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ను ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థలు వివిధ నగరాల్లో అట్టహాసంగా నిర్వహించాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్: హైటెక్‌సిటీ బిగ్ సీ షోరూంలో సీఎండీ యం బాలు చౌదరి, సినీనటి పూజా హెడ్గే ఫోన్‌ను విడుదలచేశారు. సంస్థ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జి బాలాజి రెడ్డి, అమిత్విగ్ (సేల్స్అవుట్ హెడ్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరు: సంగీతా మొబైల్స్ స్టోర్‌లో నటి, ‘భరత్ అనే నేను’ ఫేమ్ కైరా అద్వానీ ముఖ్య అతిథిగా విచ్చేసి ‘నోట్ 9’ విడుదలచేశారు. ఎండీ ఎల్.సుభాష్ చంద్ర, శామ్సంగ్ ఇండియా సౌత్ హెడ్ శశి కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి: సెలెక్ట్ స్టోర్‌లో చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తొలి ముగ్గురు కస్టమర్లకు కలెక్టర్ చేతుల మీదుగా ఫోన్ అందజేసినట్లు సెలెక్ట్ సీఎండీ వై.గురుస్వామి నాయుడు తెలిపారు. -
2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్లను ఆపిల్ ఎప్పుడు లాంచ్ చేస్తుందో కూడా తెలిసిపోయింది. ఇద్దరు జర్మన్ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో లాంచ్ చేయనుందని తెలిసింది. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్‌లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి. ఆపిల్ అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్ల గురించి ఇంటర్నెట్లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్ ఐఫోన్ల పేరు ఐఫోన్ ఎక్స్ఎస్గా, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్‌గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్టైలస్ ఫీచర్ అంటే ఆపిల్ పెన్సిల్ సపోర్టుతో ఈ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయట. స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని తీసుకొస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ రెండూ కూడా కంపెనీ ఏ12 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తాయని, 4జీబీ ర్యామ్, ప్రముఖ ఫేస్ఐడీ ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం. ధర విషయంలో 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ మోడల్ 899 డాలర్లుగా.. 6.46 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ వేరియంట్ 999 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ వేరియంట్ ధర 650 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్‌లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఇది లభ్యమవుతుందని టాక్. -
గెలాక్సీ నోట్ 9పై కళ్లు చెదిరే డిస్కౌంట్
అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9ను గత వారమే మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ బిగ్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ గెలాక్సీను కొనుగోలు చేయాలని భావించే వారికి, ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లపైనే పేటీఎం మాల్ కోంబో డీల్‌ను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9పై ఫ్లాట్ 6000 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్ పేటీఎం వాలెట్లలో క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లు పొందనున్నారు. డివైజ్ కస్టమర్ వద్దకు చేరాక 12 రోజుల అనంతరం ఈ క్యాష్‌బ్యాక్‌ను క్రెడిట్ చేయనున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. దాంతో పాటు పేటీఎం మాల్లో గెలాక్సీ నోట్ 9 బుక్ చేసుకున్న వారికి శాంసంగ్ గేర్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌పై రూ.18,000 డిస్కౌంట్ లభించనుంది. కోంబో ఆఫర్లో భాగంగా శాంసంగ్ గేర్ స్పోర్ట్‌ను కేవలం రూ.4,999కే అందిస్తుంది. అదేవిధంగా తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది? దాని ధరెంత ఉంటుంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు... 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాడ్ హెచ్‌డీప్లస్ రెజుల్యూషన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 9810 ప్రాసెసర్ 6 జీబీ/8 జీబీ ర్యామ్ 128 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరో 512 జీబీ స్టోరేజ్ పెంపు అంటే మొత్తంగా 1 టీబీ స్టోరేజ్ అందుబాటు 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ డాల్బీ అట్మోస్ ఎస్ పెన్, బారో మీటర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ -
అద్భుతంగా ఉన్న గెలాక్సీ నోట్ 9..
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్లో శాంసంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. అదరగొట్టే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ విడుదల చేసింది. డిస్ప్లే, డిజైన్... శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్దగా 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ (1440x 2960పిక్సల్స్)ను గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. ముందు, వెనుక భాగాల్లో ఉన్న బాడీకి ఈ ప్రొటెక్షన్ ఉంది. ఇక ఈ ఫోన్ మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. గెలాక్సీ నోట్ 5 మాదిరిగా ఫోన్ ఎడ్జ్‌లను అద్భుతంగా తీర్చిదిద్దడం దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. మిడ్నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్లో మరో ప్రత్యేకత ర్యామ్, స్టోరేజ్. ర్యామ్ స్టోరేజ్ ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. 6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లలో దీని రూపొందించారు. ర్యామ్‌తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్లో శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక మైక్రో ఎస్డీ కార్డుతో మరో 512 జీబీ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. దీంతో మొత్తంగా ఈ ఫోన్ 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది. మంచి ప్రదర్శనను ఇస్తుంది. 6జీబీ ర్యామ్ ఆప్షన్లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. గెలాక్సీ నోట్9 స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇండియన్ వేరియెంట్లో శాంసంగ్ సొంత చిప్సెట్ అయిన ఎగ్జినోస్ 9810 ను ఏర్పాటు చేశారు. గెలాక్సీ నోట్ 9 కెమెరా, మిగతా ఫీచర్లు... 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ డాల్బీ అట్మోస్ ఎస్ పెన్, బారో మీటర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ ధర, లభ్యత... గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. నేటి నుంచి అక్కడ ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధర తదితర వివరాలను మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే గెలాక్సీ నోట్ 9 ను భారత మార్కెట్లోనూ లాంచ్ చేయనున్నారు.