కోల్‌కతాలో మరో గ్యాంగ్ రేప్
కోల్‌కతా: క్రైస్తవ సన్యాసిని గ్యాంగ్ రేప్ ఉదంతం వివాదం ఇంకా చల్లారకముందే కోలకతాలో మరో గ్యాంగ్‌రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సిటీలోని లేక్ టౌన్ ప్రాంతంలో మార్చి 9న ఓ 28 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ దృశ్యాలను వీడియోతీశారు. విషయం ఎవరికైనా చెబితే, సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు. బాధితురాలు, అతని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులకోసం గాలిస్తున్నామని వారు తెలిపారు.