GANGULA prabhakarreddy
-
నీళ్లివ్వకుంటే ప్రాజెక్టుల ముట్టడి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లివ్వకుంటే సంబంధిత ప్రాజెక్టులను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. నీళ్లిచ్చేదీ, లేనిదీ చెప్పడానికి ఈ ఒక్కరోజే గడువు అని కలెక్టర్‌తో స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల మేర నీళ్లున్నా హంద్రీ–నీవా, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, వెలుగోడు, కేసీ కెనాల్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఆగస్టు రెండు నుంచి నీటిని విడుదల చేస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాలవ శ్రీనివాసులు, జలవనరుల శాఖాధికారులు ప్రకటించినా.. ఇంతవరకు అతీగతీ లేదన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు గంగుల బిజేంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన కార్యాలయంలో కలిసి ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ తనకు ఒక్కరోజు సమయమిస్తే జలవనరుల శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని నీటిని విడుదల విషయాన్ని చెబుతాననడంతో అందుకు వారు అంగీకరించారు. నీళ్లు విడుదల చేసేదీ, లేనిదీ ఒక్కరోజులో చెబితే దాని ప్రకారం రైతుల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు శ్రీశైలం నీటిని కర్నూలు జిల్లా రైతాంగానికి ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. పట్టిసీమ పేరుతో రాయలసీమ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నెల క్రితం ముందస్తు వానలతో రైతులు అరుతడి పంటలు వేసుకున్నారని, ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో అవి ఎండుతున్నా అధికారులు నీటిని ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. కలెక్టర్, జలవనరుల శాఖాధికారులు అమరావతి డైరెక్షన్లో నడుస్తూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అదృష్టం వరించినా సీఎం దక్కనీయడం లేదు: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండి అదృష్టం వరించిందని, అయితే.. ఈ నీరు రైతుల పొలాలకు దక్కకుండా సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా అనంతపురానికి తీసుకెళ్తున్నారన్నారు. కేసీ కెనాల్లో నీళ్లు లేవని, ఎస్ఆర్బీసీకి 500 క్యూసెక్కులను మాత్రమే వదిలారని, దీంతో ఆరుతడి పంటలు కూడా ఎండిపోతుండడంతో అన్నదాతకు దిక్కుతోచడంలేదని వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల్లో వేసిన ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని, కేసీ కెనాల్, నిప్పులవాగుకు నీళ్లు వదలాలని కోరుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. -
గొడిగెనూరులో టెన్షన్..టెన్షన్
► ప్రభుత్వ స్థలంలోని దిబ్బలను దగ్గరుండి తొలగించిన ఎమ్మెల్యే ► విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న గంగుల బిజేంద్రారెడ్డి ► పని ప్రదేశంలో మోహరించిన ఇరువర్గాలు..పరిస్థితి ఉద్రిక్తం ► సర్వే చేశాకే పనులు చేపడతామని నచ్చజెప్పిన డీఎస్పీ ► ముందు జాగ్రత్తగా గ్రామంలో పికెట్ చాగలమర్రి: గొడిగెనూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామంలో రోడ్డు నిర్మాణం సందర్భంగా నీళ్ల ట్యాంక్ నుంచి సచివాలయం వరకు దిబ్బల తొలగింపు పనులు ఇందుకు కారణమయ్యాయి. ఈనెల 12న గ్రామంలోని రస్తాకు ఇరువైపులా ఆక్రమణలు తొలగింపు విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడి చల్లారక ముందే బుధవారం ఉదయం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ రెవెన్యూ, పోలీసు అధికారులతో గ్రామానికి చేరుకుని ప్రొకైన్, ట్రాక్టర్ల సహాయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డుకు కుడి వైపు ఉన్న దిబ్బలు తొలగించి అందులో మట్టి వే యిస్తున్నారు. విషయం తెలుసుకున్న గంగుల బిజేంద్రారెడ్డి గ్రామానికి హుటాహుటిన చే రుకున్నాడు. ఒకవైపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా తన వర్గం వారితో, మరోవైపు గంగుల బిజేంద్రారెడ్డి తన అనుచరులతో పనుల వద్ద మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తుల్లో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యే తీరు పై మహానాడులో ఫిర్యాదు - గంగుల ప్రభాకర్‌రెడ్డి గొడిగెనూరు గ్రామం విషయంపై మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం చాగలమర్రి లోని ఆపార్టీ నాయకుడు కుమార్‌రెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఘర్షణలు జగిరి పదిరోజులు కూడా కాక ముందే ఎమ్మెల్యే ఒక వర్గం వారికి వత్తాసు పలికి దగ్గరుండి దిబ్బలు పూడ్చడం తగదన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోలేదన్నారు. ఎమ్మెల్యే టీడీపీలో చేరిన తరువాత దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. నియోజక వర్గంలోని ప్రజలంతా కలిసి భూమా అఖిలప్రియను ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆమె అందరికి సమానంగా చూడాలని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు బిజేంద్రారెడ్డి, గంధంరాఘవరెడ్డి, బాబులాల్, కుమార్‌రెడ్డి, పత్తినారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టువిడవని ఇరువర్గాలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐలు ఓబులేసు, కేశవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగేంద్రప్రసాద్, సూర్యమౌలి, మోహన్‌రావు తదితరులు గొడిగెనూరుకు చేరుకుని ఇరువర్గాల వారిని సర్ది చెప్పే యత్నం చేశారు. నిబంధనల ప్రకారం రోడ్డు పనులు చేపట్టామని, నిలిపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అఖిలప్రియ అధికారులకు తెగేసి చెప్పారు. ముందుగా భూమా వర్గానికి సంబంధించిన రేకుల షెడ్డు తొలగించిన తర్వాతే పనులు చేపట్టాలని మరోవైపు గంగుల బిజేంద్రా రెడ్డి పట్టుబట్టారు. పోలీసు అధికారులు నాలుగు గంటల పాటు ఇరువర్గాల వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలు పట్టువిడవలేదు. చివరకు సర్వేయర్ ద్వారా ప్రభుత్వ స్థలాన్ని కొలిచి అందరి ఆక్రమణలు తొలగించి రోడ్డు పనులు మొదలు పెడతామని నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పేర్కొనడంతో వారు శాంతించి వెనుతిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.