Ganja smuggler
-
గంజాయి స్మగ్లింగ్ కేసులో జనసేన నేతపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. అనకాపల్లి చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. కేరళలో గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో, కేరళ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి వచ్చి కేరళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వరాహ మూర్తిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. వరాహా మూర్తి గంజాయి కేసులో పట్టుబడటంతో అతడిని మండల అధ్యక్ష పదవి నుంచి జనసేన పార్టీ తొలగించినట్టు సమాచారం. గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తికేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులుకూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న @JaiTDP,… pic.twitter.com/QGrLCcuB8I— YSR Congress Party (@YSRCParty) September 7, 2024 -
ఇదీ చంద్రబాబు గంజాయి నీతి..
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని.. ద్వంద్వ నీతికి తాను నిలువెత్తు నిదర్శనమని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అండగా ఉంటుందని కూడా చేతల్లో చూపించారు. ఇందుకు సంబంధించిన ఓ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న.. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవికి పార్టీలోకి తిరిగి ఎర్రతివాచి పరిచారు. తద్వారా గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డా అని నిరూపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నర్సీపట్నం కేంద్రంగా అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచర వర్గమే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ను యథేచ్ఛగా నిర్వహించింది. అధికారం కోల్పోగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో దుష్ప్రచారం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. 2013లో గంజాయి స్మగ్లింగ్ ముఠాపై అప్పటి హైదరాబాద్ పోలీసులు దాడిచేసి కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితురాలిగా ఉన్న జాహ్నవిని తెలంగాణ పోలీసులు 2022 మేలో అరెస్టుచేశారు. దాంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తుదితీర్పు వచ్చేవరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని కూడా చెప్పారు. కానీ, జాహ్నవి మాత్రం టీడీపీలో క్రియాశీలంగానే కొనసాగుతోంది. అలాగే, ఆమెపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. దీంతో జాహ్నవిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కానీ, ఆమెపై ఉన్న స్మగ్లింగ్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ పార్టీలో ఆమెపై సస్పెన్షన్‌ను తొలగించి టీడీపీలోకి ఆమెను తిరిగి ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. -
వాట్సాప్ గ్రూప్‌లో గంజాయి ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేశాడు వానపల్లి నాగసాయి అనే పెడ్లర్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కేంద్రంగా హోల్‌సేల్‌గా ఈ గ్రూప్ ద్వారానే అమ్మడం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి ఈ గ్రూప్ ద్వారానే ఆర్డర్లు తీసుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. మంగళవారం జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి వివరాలు వెల్లడించారు. నాగసాయి కేటరింగ్ నుంచి గంజాయి సరఫరా దాకా.. నర్సీపట్నం వాసి నాగసాయి కేటరింగ్ పని చేసేవాడు. ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, చింతూరు తదితర చోట్లకు తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొందరు గంజాయి పండించే వారితో పాటు సరఫరా చేసే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కేటరింగ్ వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోవడంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న గంజాయి విక్రేతలు, సరఫరాదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీరందరి నంబర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఎవరికైనా గంజాయి అవసరమైతే వాళ్లు ఇందులో ఆ వివరాలు పోస్టు చేసేవారు. వెంటనే ఏజెన్సీలోని గంజాయి రైతులను సంప్రదించి ఆర్డర్ ప్రకారం సరుకు సమీకరించేవాడు. అక్కడ కేజీ రూ.1,500కు ఖరీదు చేసి, ఆర్డర్ ఇచ్చిన వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు అమ్మేవాడు. తీగ లాగితే డొంక కదిలింది.. ఇటీవల అంబర్‌పేట పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి 2 కేజీల గంజాయి స్వా ధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మలక్‌పేట పరిధిలో మరో ఇద్దరిని అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు సీజ్ చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ గంజాయిని సాయి సరఫరా చేసినట్లు తేలింది. దీంతో అతడిపై నిఘాపెట్టారు. కాగా, నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ప్రేమ్‌సింగ్ అనే గంజాయి వ్యాపారి.. ఇటీవల నాగసాయిని సంప్రదించాడు. తనకు 40 కేజీల గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వరకు తీసుకొస్తే రూ.2 లక్షలు చెల్లించి తీసుకుంటానని చెప్పాడు. ఆ సరుకును వాసన రాకుండా సాయి ప్యాక్ చేశాడు. దీన్ని బస్తాల్లో కట్టి ప్రైవేట్ బస్సులో ఎంజీబీఎస్ వద్ద దిగాడు. అప్పటికే నిఘా ఉంచిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం వలపన్ని పట్టుకున్నారు. -
ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్ వరంగల్ జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడు. నిజామాబాద్ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వరంగల్ పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కొందరి కేసులు, పీడీయాక్టు నమోదు చేశారు. అయినా జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. వరంగల్ పోలీసులకు శుక్రవారం జిల్లాకు చెందిన గంజయివాలా రూ.30 లక్షల గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తూ హసన్‌పర్తి పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి పోలీసులు గంజాయి వాలాపై గతంలో నిజామాబాద్‌లో ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు గంజాయివాలాలు జిల్లా కేంద్రం నుంచి నాందేడ్‌కు వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సోహైల్ కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు అక్కడి పోలీసుల విచారణలో తేలింది. -
పోలీసులు తనిఖీలు... స్మగ్లర్ అరెస్ట్
విజయవాడ: విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా గంజాయి స్మగ్లర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీలలో భారీగా పోలీసులు పాల్గొన్నారు.