సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
వివరాల ప్రకారం.. అనకాపల్లి చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. కేరళలో గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో, కేరళ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి వచ్చి కేరళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వరాహ మూర్తిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. వరాహా మూర్తి గంజాయి కేసులో పట్టుబడటంతో అతడిని మండల అధ్యక్ష పదవి నుంచి జనసేన పార్టీ తొలగించినట్టు సమాచారం.
గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు
కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి
కేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు
కూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న @JaiTDP,… pic.twitter.com/QGrLCcuB8I— YSR Congress Party (@YSRCParty) September 7, 2024
Comments
Please login to add a commentAdd a comment