గంజాయితో పట్టుబడిన నిందితులను చూపిస్తున్న వరంగల్ పోలీసు అధికారులు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్ వరంగల్ జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడు. నిజామాబాద్ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వరంగల్ పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కొందరి కేసులు, పీడీయాక్టు నమోదు చేశారు. అయినా జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. వరంగల్ పోలీసులకు శుక్రవారం జిల్లాకు చెందిన గంజయివాలా రూ.30 లక్షల గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తూ హసన్‌పర్తి పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి పోలీసులు గంజాయి వాలాపై గతంలో నిజామాబాద్‌లో ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు గంజాయివాలాలు జిల్లా కేంద్రం నుంచి నాందేడ్‌కు వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సోహైల్ కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు అక్కడి పోలీసుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment