ganji Chiranjeevi
-
ఈ ఒక్క వీడియో చూస్తే... లోకేష్ గుండె గుబేల్
-
‘మంగళగిరిలో లోకేష్‌ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
లోకేష్‌కూ అనుమానమే.. మంగళగిరి నుంచి పోటీకి దూరమేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. సీట్ల కేటాయింపులపై ఇప్పటికీ ఏమీ తేల్చకపోవడం, మరోవైపు వైఎస్సార్సీపీలో జరిగిన మార్పులతో తాము కూడా అభ్యర్థులను మార్చాలని అధిష్టానం ఆలోచన చేస్తుండటంతో సీటు ఆశిస్తున్న నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాలలో అస్పష్టత కొనసాగుతోంది. పొన్నూరులో కూడా ధూళిపాళ్లను ఎంపీగా పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు నగరానికి వస్తే మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. రెండు నియోజకవర్గాలలో ఇన్చార్జులను కాదని కొంతమంది నేతలు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, వారు బహిరంగంగానే గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. లోకేష్‌కూ అనుమానమే మంగళగిరిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే స్థానంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించడంతో తెలుగుదేశం ఆలోచనలో పడింది. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నా, చివరి నిముషంలో ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని మంగళగిరి పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమలో కోవెలమూడి వర్సెస్ ఉయ్యూరు గుంటూరు పశ్చిమలో నియోజకవర్గ ఇన్చార్జిగా కోవెలమూడి రవీంద్ర(నానీ) ఉండగా, అతనికి పోటీగా ఎన్ఆర్ఐలు మన్నవ మోహనకృష్ణ, ఉయ్యూరు శ్రీనివాస్, నియోజకవర్గ నేతలు డాక్టర్ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో తమ సొంత ప్రచారం సాగిస్తున్నారు. చివరి నిముషంలో పొత్తులో తెనాలి జనసేనకు ఇస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజాను రంగంలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి గుంటూరు పశ్చిమ బాధ్యతలు వైఎస్సార్ సీపీ అప్పగించడంతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బదులుగా గుంటూరు పశ్చిమలో పోటీ చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం–జనసేన మధ్య ‘తెనాలి’ రగడ తెనాలిలో తెలుగుదేశం–జనసేన మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఈ సీటు తమకే కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పట్టుపడుతున్నారు. జనసేన తరపున తాను తెనాలి నుంచి పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పలుమారు ప్రకటించుకున్నారు. ఆలపాటి రాజా పేద యువతుల వివాహానికి మంగళసూత్రం ఉచితంగా ఇస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మిచాంగ్ తుఫాన్ బాధిత రైతుల పరామర్శ కోసం చంద్రబాబునాయుడు వచ్చినప్పుడు ఆయన బలప్రదర్శన చేశారు. మరోవైపు రోజు మార్చి రోజు నాదెండ్ల మనోహర్ ఇక్కడే ప్రెస్‌మీట్ పెడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రైతు సమస్యలు, వ్యాపారుల సమస్యలపై నేరుగా వెళ్లి వారిని కలుస్తున్నారు. తాడికొండలో శ్రావణ్‌కు పొగ రాజధాని ప్రాంతమైన తాడికొండలో ప్రస్తుతం ఇన్చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తొలినుంచి ఓ వర్గం పావులు కదుపుతుంది. అందులో భాగంగా గత ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు ఎదుట వారు శ్రావణ్‌కుమార్‌కు సీటు ఇవ్వకుండా శతవిధాలా అడ్డుపడ్డారు. దీంతో శ్రావణ్‌కుమార్‌ను బాపట్ల ఎంపీగా, అక్కడ ఎంపీగా పోటీ చేసిన మాల్యాద్రిని ఇక్కడకు సీటు కేటాయించగా శ్రావణ్‌కుమార్ వర్గం కూడా గట్టిగా పట్టుబట్టడంతో తిరిగి ఎక్కడ వారిని అక్కడే ఉంచేశారు. ఇప్పుడు కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన గేరా రవిబాబు, తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన తోకల రాజవర్థన్‌లు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజవర్ధన్‌కు రాయపాటి వర్గం అండగా నిలబడింది. ప్రత్తిపాడులో ఆర్.ఆర్. రగడ ప్రత్తిపాడులో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయనకు మద్దతుగా ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పెత్తనాన్ని కూడా వారు వ్యతిరేకించడంతోపాటు బహిరంగంగానే తమ అసమ్మతిని బయటపెడుతున్నారు. పెదనందిపాడు, గుంటూరు రూరల్‌లో కూడా రామాంజనేయులు అనుకూల, వ్యతిరేకవర్గాలు బాహాబాహీకి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్తిపాడు, తాడికొండలలో ప్రస్తుతం ఇన్చార్జులుగా ఉన్న వారి సామాజిక వర్గాలకు చెందిన నేతలనే వైఎస్సార్సీపీ ఇన్చార్జులుగా ప్రకటించడంతో ప్రత్తిపాడు, తాడికొండలలో కూడా అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తూర్పులో హెచ్చరికలు, కొట్లాటలు గుంటూరు తూర్పులో నియోజకవర్గ ఇన్చార్జిగా మహ్మద్ నసీర్ ఉండగా, అతనికి పోటీగా గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సయ్యద్ ముజీబ్ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నసీర్, ముజీబ్ గ్రూపుల మధ్య గొడవలు పెరిగి పోలీసు స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి ఇరుగ్రూపుల మధ్య నెలకొంది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా నసీర్ అహ్మద్ తీరుపై కార్యకర్తలు, నాయకుల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట ఇక ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అసలు పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారు. నియోజకవర్గానికి వచ్చి కూడా సంవత్సరాలు దాటిపోతుండటం, మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి కోసం కూడా వెతుకులాటలో ఉంది. ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ నేతలు ఎంపీగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బయట వ్యక్తులను తీసుకువచ్చే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉంది. -
YSRCP: గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన జారీ చేసింది. చదవండి: (కట్టని రాజధాని గురించి ఉద్యమాలా?: సీఎం జగన్) -
లోకేష్ కు బిగ్ షాక్ ఇచ్చిన చిరంజీవి
-
సీఎం జగన్ సారథ్యంలో పనిచేయడం సంతోషం: గంజి చిరంజీవి
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన గంజి చిరంజీవి
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గంజి చిరంజీవి
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి టీడీపీలో కీలకనేత గంజి చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇకపోతే.. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజికవర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. చదవండి: (ఇది నిప్పుతో చెలగాటమాడటమే.. ప్రతిపక్షాలకు మంత్రి కొట్టు హెచ్చరిక) -
చేనేతవర్గం నాయకులపై చిన్న చూపు
-
టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా
మంగళగిరి: టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహా ఏ ఒక్క సామాజికవర్గానికి గౌరవం లేదని మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. తనకు జరిగిన అవమానానికిగానూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీలో జరిగిన అవమానంపై కన్నీటి పర్యంతమయ్యారు. 2014లో సీటు ఇచ్చినట్లే ఇచ్చి తనను సొంత పార్టీ నేతలే ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఓడించిన వారే ఇప్పుడు పార్టీని నడిపిస్తూ దాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి దూరం చేసేందుకే తనకు పార్టీ రాష్ట్ర పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. మంగళగిరి ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదన్నారు. అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. చేనేత నాయకుడుగా ఉన్న తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు మానసికంగా హత్య చేశారన్నారు. 2019లో చివర వరకు తనకే సీటు అని చెప్పి మోసం చేసినా పార్టీ కోసం భరించాననన్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు, కుట్రలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. తన ఆవేదన గురించి లోకేష్‌తో పాటు టీడీపీ నాయకులందరికి తెలిసినా పట్టించుకోలేదని వాపోయారు. ఎన్టీఆర్ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీసీ, ఎస్టీ, ఎస్టీలతోపాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేవారితో కలిసి నడుస్తానని తెలిపారు. -
టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా
-
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేత గంజి చిరంజీవి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరాను. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. అయితే టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానపరిచారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది. ఆ ఒక్క సీటును కుమారుడి కోసం లాగేసుకొని మాకు ద్రోహం చేశారు. లోకేష్ కోసం ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన నన్ను పక్కకు పెట్టారు. పార్టీని నేను మోసం చేస్తే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఒకవేళ పార్టీ నన్నుమోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తాడు. 2019 చివరి వరకు సీటు నీదే అని నమ్మించి టికెట్ ఇవ్వకుండా తీవ్రంగా అమానించారని' గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని) -
గంజి చిరంజీవి అన్నలాగా మంచి మెజార్టీ ఇవ్వండి!
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటి నుంచీ.. ఏదో ఒక విధంగా తప్పులో కాలేస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. మంగళవారం మరోసారి నెటిజన్లకు ఆయన మంచి ముడిసరుకు అందించారు. మంగళవారం దుగ్గిరాల మండలం చింతలపూడిలో జరిగిన సభలో మరోసారి అలాగే మాట్లాడి, టీడీపీ నేతలను, కార్యకర్తలను విస్మయానికి గురిచేశారు. తన పార్టీ గురించి చేసిందీ, చేయనిదీ చెప్పుకుంటూ.. ‘గతంలో గంజి చిరంజీవి అన్నకు ఇచ్చిన మెజార్టీనే నాకూ ఇచ్చి గెలిపించాలని’ ఓటర్లను కోరారు. అయితే ఈ మాటలు విన్న కార్యకర్తలు, నాయకులు విస్మయానికి గురయ్యారు. చప్పట్లు కొట్టాలో వద్దో అనే సందిగ్ధంలో ఉండగా లోకేశ్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలయిన విషయం తెలిసిందే. -
'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ ఇన్ చార్జి గంజి చిరంజీవి తీరుపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులను చిరంజీవి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరంజీవి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ బాలాజీ తెలిపారు. -
ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసిన చిరంజీవి
(ఎన్.నాగరాజు-మంగళగిరి) గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి అభ్యర్థి గంజి చిరంజీవి ఎట్టకేలకు పోలీసుల అండతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా తులసీ రామచంద్ర ప్రభు పేరును టిడిపి నిన్న ప్రకటించింది. అతని ఎంపిక పట్ల వ్యతిరేకత రావడంతో పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పోతినేని శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్లు కూడా అతను ప్రచారం చేసుకున్నారు. చివరకు తెల్లవారుఝామున 3 గంటలకు గంజి చిరంజీవికి పార్టీ బిఫాం ఇచ్చారు. ఉదయం నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరిన చిరంజీవిని పోతినేని శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకున్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతినేని అనుచరులు అతనిని నిర్భంధించారు. చివరకు అతనిపై దాడికి కూడా దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిరంజీవిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయాలనుకున్న చిరంజీవి ఇంత గొడవ జరగడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. పోలీసుల రక్షణతో బయటపడిన చిరంజీవి ర్యాలీ లేకుండా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మంగళగిరి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ కూడా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ విధంగా మంగళగిరిలో టిడిపి నాయకులు, కార్యకర్తలు విడిపోయి ఘర్షణ పడే స్థితికి చేరుకున్నారు. -
చిరంజీవిని గదిలో నిర్బంధించిన 'తమ్ముళ్లు'
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుతమ్ముళ్లు శనివారం ఘర్షణకు దిగారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా గంజి చిరంజీవిని టీడీపీ ఎంపిక చేసింది. అ క్రమంలో చిరంజీవికి బీ ఫారం అందజేశారు. ఆ స్థానం టికెట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పోతినేనికి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో పోతినేనితో పాటు ఆయన అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఎన్నికలో తన గెలుపుకు కృషి చేయాలంటూ వచ్చిన చిరంజీవిపై పోతినేని వర్గీయులు దాడికి చేసి... అనంతరం చిరంజీవిని గదిలో నిర్బంధించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గంజి చిరంజీవి వర్గీయులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చిరంజీవిని గది నుంచి బయటకు తీసుకువచ్చారు.