చిరంజీవిని గదిలో నిర్బంధించిన 'తమ్ముళ్లు' | TDP MLA candidate Ganji Chiranjeevi house arrest in Mangalagiri | Sakshi
Sakshi News home page

చిరంజీవిని గదిలో నిర్బంధించిన 'తమ్ముళ్లు'

Published Sat, Apr 19 2014 2:10 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

TDP MLA candidate Ganji Chiranjeevi house arrest in Mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుతమ్ముళ్లు శనివారం ఘర్షణకు దిగారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా గంజి చిరంజీవిని టీడీపీ ఎంపిక చేసింది. అ క్రమంలో చిరంజీవికి బీ ఫారం అందజేశారు. ఆ స్థానం టికెట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పోతినేనికి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో పోతినేనితో పాటు ఆయన అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

 

అయితే ఎన్నికలో తన గెలుపుకు కృషి చేయాలంటూ వచ్చిన చిరంజీవిపై పోతినేని వర్గీయులు దాడికి చేసి... అనంతరం చిరంజీవిని గదిలో నిర్బంధించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గంజి చిరంజీవి వర్గీయులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చిరంజీవిని గది నుంచి బయటకు తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement