gannavaram mla
-
ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: గన్నవరం(ఏపీ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. -
40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి..
విజయవాడ: రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే అజెండాగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. బీజేపీ ఎక్కడ బలపడుతుందోనన్న అనుమానంతో చంద్రబాబే మత రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. బీజేపీకి భయపడే చంద్రబాబు హిందూ అజెండాని ఎత్తుకున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని ఆయన వివరించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పుకునే చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే, హడావిడిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని వంశీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఒక నెల ఆలస్యం అయితే నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్వలాభం కోసం రాజ్యాంగం ప్రస్థావన తెచ్చే చంద్రబాబు.. ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్టపై అక్రమ కట్టడాన్ని నిర్మించుకొని నివాసముంటున్నారని నిలదీశారు. ఎన్నికలంటే చంద్రబాబుకి భయం కాబట్టే తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం చేసే సాహసం కూడా చేయలేని చంద్రబాబు తమది జాతీయ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందనే సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్ముతాడని ఆయన ఎద్దేవా చేశారు. -
సుందరయ్యా... నిన్ను మరవమయ్యా..
సాక్షి, కృష్ణా : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను గన్నవరం వాసులు మూడుసార్లు తమ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన గన్నవరం ప్రాంతంపై ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. అయితే ‘రెడ్డి’ అనే కులసూచికను తొలగించుకుని నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు బంధాలు, బాంధవ్యాలు అడ్డుగా నిలుస్తాయని భావించిన ఆయన వివాహ అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. అంతే కాకుండా తండ్రి నుంచి వంశపార్యంపరగా వచ్చిన ఆస్తులను కూడా నిరుపేదలకు వితరణ చేశారు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లోనూ, తరువాత 1962, 1978లలో మళ్లీ ఆయననే విజయం వరించింది. పేదలకు కిలో రూపాయి బియ్యాన్ని అందించాలని మొదలైన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది సుందరయ్యే. -
ముదిరిన ‘ఇన్నర్’ వివాదం
* బెయిలొద్దు.. జైలుకే వెళ్తానన్న ఎమ్మెల్యే వంశీ * బుజ్జగించిన ఎంపీ కొనకళ్ల, బచ్చుల అర్జునుడు * టీడీపీలో అంతర్మథనం సాక్షి, విజయవాడ : ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. దీనికి కావాల్సిన స్థల సేకరణ నిమిత్తం రామవరప్పాడులోని పేదల ఇళ్ల తొలగింపునకు అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా అక్కడికొచ్చిన అధికారులను అడ్డుకున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పటమట పోలీసులు కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులకు సర్దిచెప్పడానికి వెళ్లిన తనను ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడంతో వంశీ తీవ్ర మనస్తాపం చెందారు. ఆ వెంటనే గన్మెన్లను వెనక్కిపంపాలని నిర్ణయించడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనపై పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా తానే పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్వచ్ఛందంగా సరెండరై జైలుకు వెళతానని, బెయిల్ కూడా తీసుకోనని చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఎంపీ కొనకళ్ల బుజ్జగింపులు ఈ పరిణామ క్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణ వంశీతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించారు. ఎంపీ సోదరుడు కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు వంశీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై కేసు పెట్టడాన్ని వంశీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి తనపై కేసులు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దేవినేని బాజీకి చెందిన ఇన్నోటెల్ హోటల్ గురించి మాట్లాడడంతో ఈ విధంగా తనపై అక్రమ కేసులు పెట్టించారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి తాను మంత్రి ఉమాతో ఫోన్లో మాట్లాడితే పాకలు తీసేందుకు ఇప్పుడే నోటీసులు ఇవ్వరని హామీ ఇచ్చారని, తెల్లవారేసరికి రెవెన్యూ, పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తనకు, గ్రామ సర్పంచ్‌కు, ఎంపీపీలకు కూడా ముందుగా సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారని బచ్చులను నిలదీశారు. మంత్రి ఉమాతోనూ సమావేశం రామవరప్పాడులో పేదలకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులు హడావుడి చేయడంపై చర్చించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వంశీమోహన్, అర్జునుడు, బుల్లయ్యలు ఉమా క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉమా ఫోన్లో తొలుత వంశీతో మాట్లాడిన తరువాత ఆయన వెళ్లారు. అధికారులు తొందర పడి నోటీసులు ఇచ్చేందుకు రావడం సరికాదని ఉమా అభిప్రాయపడినట్లు తెలిసింది. కలెక్టర్, ఎంపీలతో.. సోమవారం రాత్రి ఎంపీ కొనకళ్ల నారాయణ, కలెక్టర్ బాబు.ఎ.లతో ఎమ్మెల్యే వంశీమోహన్ సమావేశమయ్యారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే 159 ఇళ్లు తొలగించడమే కాకుండా మరో 500 ఇళ్లు తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే పేదల ఇళ్లు తొలగించాలని వంశీ చేసిన డిమాండ్‌కు వారు సానుకూలంగా స్పందించారు. -
బెయిల్ వద్దు.. జైలుకు వెళ్తా: వంశీ
పోలీసులు తన మీద పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా... స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన తన ఇద్దరు గన్‌మెన్‌ను కూడా వెనక్కి పంపారు. తన మీద కేసు పెట్టడం వెనక పార్టీలో జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఒత్తిడి ఉందని ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వంశీని బుజ్జగించేందుకు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అధికారులు ఏ ధైర్యంతో తన మీద కేసు పెట్టారని ఈ సందర్భంగా వంశీ వాళ్లను అడిగారు. ధర్నాను విరమింపజేయడానికి తాను వెళ్తే.. ధర్నాలో తనను ఎ1గా పేర్కొంటూ కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. కలెక్టర్ ద్వారా తన మీద కేసు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దాంతో ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకి ఎలాగోలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తం విషయాన్ని నేరుగా సీఎంకు వివరిస్తామని, ఆందోళన కార్యక్రమాన్ని విరమించాలని, పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లొద్దని కోరారు. కాసేపట్లో సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి అన్ని విషయాలనూ వంశీ ఆయన దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ను కూడా క్యాంపు కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
రికార్డింగ్ డ్యాన్సుల్లో.. చిందేసిన ఎమ్మెల్యే!!