Gas problem
-
Medi Tips: గ్యాస్ సమస్యా? తగ్గించుకోండిలా!
కడుపులో గ్యాస్‌తో పొట్ట ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్లేవరకు ఓ సమస్యే. ఎంతో ఇబ్బందిగానూ ఉండవచ్చు, మరి ఈ గ్యాస్ సమస్య తగ్గాలంటే పాటించాల్సిన సూచనలివి...– తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. అది కూడా బాగా నమలి తినడం. – గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమలడం. – కొవ్వు ఎక్కువగా ఉండేవీ, డీప్ ఫ్రైలు, వేపుళ్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. – కాఫీ, టీ పరిమితంగా తీసుకోవడం. – సోడాలు, కార్బొనేటెడ్ అండ్ కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం.– సరిపడనివారు ΄ాలూ, ΄ాల ఉత్పాదనలకు దూరంగా ఉండటం. – ΄÷గ, ఆల్కహాల్ అలవాట్లు పూర్తిగా మానేయడం. – రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. – బరువు పెరగకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడంఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు.. -
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/గచ్చి బౌలి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఉదయం హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పితోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. సాధారణ పరీక్షల్లో భాగంగానే ముఖ్యమంత్రి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చి నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్టిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చి నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రిని పరీక్షించిన తర్వాత ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఉదయం పొత్తికడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పారని, దీంతో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చి సీటీ, ఎండోస్కోపీ పరీక్షలు చేశామని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కడుపులో ఒక చిన్న అల్సర్ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అయితే దీనిని మందుల ద్వారా నయం చేయవచ్చని వివరించారు. ఇతర అన్ని రకాల పరీక్షలు సాధారణంగానే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రికి అవసరమైన మందులు ఇచ్చామని చెప్పారు. కాగా, రాత్రి 7.15 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్ ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సీఎం సత్వరంగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సత్వరం కోలుకోవాలని, స్వస్థత చేకూరాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. -
గ్యాస్ట్రిక్ నొప్పి.. గుండె నొప్పి.. తేడా తెలుసుకోవడం ఎలా?
నవీన్‌కి ఒకరోజున ఉన్నట్టుండి గుండె నొప్పిగా అనిపించింది. కంగారు వేసింది. వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగు తీశాడు. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి భయపడాల్సిన పనేమీ లేదని, గ్యాస్ట్రిక్ ట్రబులేననీ చెప్పి పదిరోజులపాటు రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో పాంటాప్రజోల్ టాబ్లెట్ ఒకటి వేసుకోమని, కొంతకాలం పాటు పులుపులు, పప్పులు, మసాలాలకు దూరంగా ఉంటే అదే తగ్గిపోతుందని చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?►గ్యాస్ నొప్పి కూడా ఛాతీ లో రావడం వల్ల గుండె నొప్పి ఏమో అనుకోవడం సహజం. అయితే కొద్దిపాటి పరిశీలనతో తేడాని గుర్తించవచ్చు.►గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి ఉంటుంది.ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది.►ఇక గ్యాస్ నొప్పి మనం వేలుతో పాయింట్ చేసేంత ప్లేస్లోనే ఉంటుంది. అది కూడా ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంటుంది.►మరొక ముఖ్యమైన విషయం ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.►ఎందుకంటే గ్యాస్ పడుకున్నప్పుడు వెనక్కి వెళ్తుంది. కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుంది.►అలా అనిపించినప్పుడు రెండు గ్లాసుల పల్చటి మజ్జిగ తాగాలి. అప్పుడు కడుపులోని గ్యాస్, తేన్పుల రూపంలో బయటకి వస్తుంది.►ఒకవేళ అలా తగ్గకపోతే గ్లాసుడు నీళ్లలో ఈనో పాకెట్ కలుపుకు తాగండి. ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయల లాంటి కూరగాయలు తినండి. ►పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే కొద్దిరోజులకు గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.►రోజు పొద్దున్నే పరగడుపున గ్లాసుడు నీళ్లలో అర చెంచాడు జీలకర్ర వేసి మరిగించి, గోరువెచ్చగా అయ్యాక తాగాలి. చదవండి👉🏾: Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
కింది నుంచి గ్యాస్పోతోందా?
కింది నుంచి గ్యాస్ పోయే సమస్య కేవలం ఆరోగ్యపరమైనది మాత్రమే కాదు. ఇది సామాజికంగా కూడా చాలా ఇబ్బందికరమైనదే. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను సైతం నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. కొన్ని కొన్ని చిన్న సూచనలతో దీన్ని చాలావరకు నివరించవచ్చు. ఆ సూచనలివే... సరిపడని ఆహారాలకు దూరంగా ఉండాలి : మనకు సరిపడని ఆహారాల కారణంగా కూడా కింది నుంచి గ్యాస్ పోతుంటంది. ఉదాహరణకు కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది. వారు పాలు తాగగానే కింది నుంచి గ్యాస్ పాస్ కావడం మొదలవుతుంది. మనకు సరిపడని ఆహారపదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ ముప్పు తప్పిపోతుంది. కొన్ని రకాల కూరలకు దూరంగా ఉండండి : చాలామందికి క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్ వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ నిండుతుంది. కింది నుంచి గ్యాస్ పోయేవారు మాత్రం ఇలాంటి ఆహారాలకు కాస్తంత దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం అవసరం. మిగతావారికి ఈ ఆహారాలు చాలా ఆరోగ్యకరమని గుర్తించండి. కేవలం గ్యాస్ ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం మాత్రమే వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి : ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం కూడా కింది నుంచి గ్యాస్‌పోయే సమస్యకు ఒక కారణం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడినప్పుడు అది కడుపు ఉబ్బరం ఎక్కువ కావడానికి దారితీస్తుంది. అందుకే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలవంటివి తగ్గించాలి. అలాగే కూరల్లో, పెరుగులో వేసుకునే ఉప్పు కూడా తగ్గించడం మంచిది. మలబద్దకం నివారణతో : తగిననన్ని పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇందుకోసం పొట్టుతీయని కాయధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. రోజూ కనీసం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం తగ్గి కింది నుంచి గ్యాస్ పాస్ కావడం కూడా తగ్గుతుంది. చ్యూయింగ్‌గమ్ నమలడం మానేయండి : చ్యూయింగ్‌గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో అది నమిలే సమయంలో గాలిని ఎక్కువగా మింగడమూ జరుగుతుంటుంది. ఇలా మింగిన గాలే చాలాసందర్భాల్లో గ్యాస్ రూపంలో కింది నుంచి పోతూ ఉంటుంది. అలాగే మనం ఆహారాన్ని నమిలి మింగే సమయంలోనూ గాలిని మింగుతూ ఉంటాం. అయితే ఇలా మింగే గాలితో పోలిస్తే చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో మింగే గాలి మరీ ఎక్కువ. అందుకే చ్యూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో గ్యాస్ ఎక్కువగా పోతుంటే... వారు ఆ అలవాటు తగ్గించుకోవాలి. కృత్రిమ చక్కెరలు / గ్యాస్ ఉండే కార్బొనేటెడ్ డ్రింక్‌లతో : కృత్రిమ చక్కెరలు/గ్యాస్ నిండి ఉండే కూల్‌డ్రింక్స్ వంటి శీతలపానియాల వల్ల కూడా కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. మనం శీతలపానియాలు తాగగానే కడుపు ఉబ్బరంగా ఉండటం చాలామంది గమనించే ఉంటారు. ఇలా చేరిన గాలి కూడా చాలా సందర్భాల్లో కింది నుంచి పోతూ ఉంటుంది. అందుకే కింది నుంచి గ్యాస్పోయేవారిలో శీతలపానియాలు తాగుతుంటే... ఆ అలవాటును బాగా పరిమితం చేసుకుంటే మంచిది. బాగా నమిలి మింగాలి : వేగంగా నమిలి మింగడం కంటే... నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగేవారిలో గాలి లోపలికి చాలా తక్కువగా ప్రవేశిస్తుంది. అదే గబగబా నమిలి మింగుతుంటే కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్లి... అది కింది నుంచి పోయే అవకాశం ఉంది. అందుకే మనం తినే ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినడం కంటే... తక్కువ (చిన్న చిన్న) మోతాదుల్లో ఎక్కువ సార్లు తింటుండాలి. ►ఇక ఆహారంలో కొవ్వులు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే జీర్ణమయ్యే వ్యవధి పెరుగుతున్నకొద్దీ కింది నుంచి గ్యాస్‌పోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆహారంలో కొవ్వులను తగ్గించాలి. కొవ్వులు తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. ►స్థూలకాయం ఉన్నవారిలో, ఒంటి బరువు ఎక్కువగా ఉన్నవారిలో కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువ. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో అల్లం, పుదీనా వంటివి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. అందుకే కింది నుంచి గ్యాస్‌పోయే వారు వాటిని ఎక్కువగా వాడటం మంచిది. -
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కోసం...
ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు. ►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు. ►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ►దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తొలగి పోతుంది. ►గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. -
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా?
గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏ టాబ్లెట్‌లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే... ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ. జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్‌ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. ఇవీ ఫలితాలు... ⇒ మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. ⇒ వీరిలో ప్రతికూల సంకేతాలు ⇒ గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి ⇒ సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు. ⇒ హార్ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు ⇒ రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్ ⇒ తీవ్రమైన ైపైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు రాజగోపాల్ శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ : shuddh colon care opp GVK entry gate Road No. 4, Banjara Hills hyderabad. 8008002032, 8008002033 -
గ్యాస్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం..
కోలన్ హైడ్రోథెరపీ! పదేళ్ల నుంచి మలద్ధకంతో బాధపడుతున్న 40 ఏళ్ల రమేష్‌కి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. కారణం...? 42 సంవత్సరాల హరిత ఒకప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాక సతమతం అయిపోయేది. తరచూ గ్యాస్ సమస్యతో, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉండేది. ఈ సమస్యలతో నలుగురిలోకి వెళ్లాలన్నా సంశయించే హరిత ఇప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంటోంది. ఈ మార్పు వెనుక ఉన్నది....? రమేష్ హరితల సమస్యలకు మంచి పరష్కారాన్ని చూపించిన కొత్త చికిత్స కోలన్ హైడ్రో థెరపీ. మలబద్ధకం, గ్యాస్ సమస్య, ఇతర జీర్ణకోశ సమస్యలేమున్నా సరే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న కోలన్ హైడ్రోథెరపీ మంచి పరిష్కారం అందిస్తుంది. దీనికోసం ఖరీదైన మందులేవీ అక్కర్లేదు. స్వచ్ఛమైన గోరువెచ్చని నీరు చాలు. పెద్దపేగు లోపలికి ఈ నీటిని పంపించి దానిలో పేరుకుపోయి ఉన్న మలినాలను పూర్తిగా తొలగించి పేగు మొత్తాన్ని శుభ్రపరచడమే కోలన్ హైడ్రోథెరపీ. సహజసిద్ధంగా కండరాల్లో ఉండే సంకోచ వ్యాకోచాలను ఈ థెరీపీ మరింత మెరుగుపరుస్తుంది. శరీరంలో నుంచి మలినాలన్నీ వెళ్లిపోతాయి కాబట్టి దీనివల్ల శరీరం మొత్తం ఆరోగ్యవంతమవుతుంది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రో థెరపీ అందించే పరికరాల్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. శుద్ధ్ గ్రావిటీ డీయూ-01 వీటిలో ఒకటి. ఈ పరికరంలో నీరు వివిధ దశల్లో ఫిల్డర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి ఆ వీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. ఈ నీరు దేని ద్వారా కూడా పంపు చేయబడదు. కేవలం గురుత్వాకర్షణ బలంతో మాత్రమే లోపలికి ప్రవహిస్తుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్వవస్థ కూడా దీనిలో ఉంటుంది కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్స్ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు అరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. ఇవీ ఫలితాలు.. మలబద్ధక నివారణ, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్కి మంచి పరిష్కారం. మలినాలతో పాటు హానికర బాక్టీరియా వెళ్లిపోతుంది కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం చేకూరు తుంది. ఇది నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. వీళ్లకి వద్దు... గర్భిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్న వాళ్లు, రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, అల్పరేటిన్ కోలైటిస్ తీవ్రమైన పైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు రాజగోపాల్, డెరైక్టర్ శుద్ధ్ కోలన్ కేర్ -
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
42 ఏళ్ల భూషణ్ ఎనిమిదేళ్లుగా తిన్నది సరిగా అరగక, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. మలబద్ధకం తీవ్ర స్థాయిలో బాధపెడుతున్నది. ఎవరికైనా ఏమని చెప్పుకొంటాడు..! అతను ఏ పని చేస్తున్నా అతని ఆలోచన మాత్రం ఈ సమస్యల చుట్టూనే తిరుగుతున్నది. అలాంటి పరిస్థితిలో తన అనారోగ్యాలను తీసేసే మంత్రదండం గురించి తెలిసిందతనికి. అదే కోలన్ హైడ్రో థెరపీ. వెంటనే మా దగ్గర మెడికల్ కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఈ కొత్త థెరపీ గురించి వివరంగా తెలుసుకున్నాడు. తన సమస్యలన్నీ డాక్టర్‌కు తెలిపిన తరువాత 5 సిట్టింగ్‌ల ప్యాకేజీతో చికిత్స చేయించుకున్నాడు. భూషణ్ ఇప్పుడు శారీరకంగా, మానసికంగా నూతనోత్తేజంతో ఉల్లాసంగా ఉంటున్నాడు. మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలి వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. మలబద్ధకం ఎందుకు..? తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ప్రసాద్. కోలన్ హైడ్రోథెరపీ మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించి అక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలి న్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితమయ్యే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజీ చికిత్స తీసుకుంటున్న వారు మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజీ మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. ఈ ప్యాకేజీ నెలలో పూర్తి చేయబడుతుంది. అని వివరించారు శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జీ పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి. ఇవీ ప్రయోజనాలు - గ్యాస్ సమస్యల పరిష్కారం - మలబద్ధకం నుంచి ఉపశమనం - ఒత్తిడి నుంచి విముక్తి - జీర్ణక్రియ మెరుగవుతుంది - పెద్దపేగులో కదలికలు మెరుగవుతాయి వీరికి పనికిరాదు గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు.