‘గేట్’ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015 రాసేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్లను, పరీక్షను ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు గేట్ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 1లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్, దరఖాస్తును నింపడం, పంపించడం వంటివి ఆన్లైన్లోనే పూర్తిచేయాలి. దీంతోపాటు ఫోటో, ఇతర ధ్రువపత్రాలను కూడా ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాలి.
గేట్ జోనల్ కార్యాలయాలకు హార్డ్‌కాపీలను పంపించాల్సిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు, ఈ-చలాన్ విధానాల్లో దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు. జనరల్, ఓబీసీ(పురుష) అభ్యర్థులు రూ.1500, మహిళలు రూ.750, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎగ్జామినేషన్ సిటీ ఛాయిస్‌ను నవంబర్ 21లోగా మార్చుకోవచ్చు. గేట్-2015ను వచ్చే ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 14 తేదీల్లో ఉదయం 9 నుంచి 12, సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 12, 2015న వెలువడే అవకాశాలున్నాయి.
వివరాలకు వెబ్సైట్: http://gate.iitk.ac.in/GATE2015/