Gaurav Uppal Collector
-
నల్లగొండ కలెక్టర్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ (నాన్ కేడర్)ను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు జిల్లా కలెక్టర్‌గా అదనపు బా ధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు వ్యవహరిస్తున్న సహాయ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం రవిని అదనపు బాధ్యతల నుంచి తప్పించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అభ్యర్థుల నేర చరిత్ర మీడియాలో ప్రకటించాలి
సాక్షి, నల్లగొండ: ఎన్నికల్లో పారదర్శకత పెంచడంలో భాగంగా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేర చరిత్ర, వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అభ్యర్థులు స్వచ్ఛందంగా ప్రజలకు వెల్లడించాలని జిల్లా కలెక్టర్, నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తేదీ నుంచి ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లకు మూడు సార్లు దిన పత్రికల్లో, మూడుసార్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వివరాలు ప్రకటించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు, నేరాలు రుజువై శిక్ష పడిన కేసుల వివరాలను ప్రజలకు తెలపాలని సూచించారు. దీని కోసం వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో సర్క్యులేషన్లో ఉన్న దిన పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానెళ్లలో ప్రకనటనలు ఇవ్వాలని తెలిపారు. నామినేషన్ల తంతు ముగిసినప్పటి నుంచి ప్రచారం చివరి రోజు వరకు మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ వేర్వేరు తేదీల్లో ఇవ్వాలని, న్యూస్ పేపర్లలో ప్రముఖంగా కనిపించే స్థలంలో ప్రకటనలు ఇవ్వాలన్నారు. కనీసం పన్నెండు సైజ్ పాయింట్‌ను మెయింటైన్ చేయాలని, ఈ ఖర్చు పూర్తిగా అభ్యర్థి భరించాల్సి ఉంటుందని అన్నారు. ఫార్మాట్ సి 1, రాజకీయ పార్టీలు ఫార్మాట్ సి 2లో తెలపాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు ఫార్మాట్ సి 2లో పొందుపర్చిన అంశాలను ఆయా పార్టీల వెబ్ సైట్లో ఉంచాలని తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కేసులు లేని అభ్యర్థులు ప్రకటనలు ప్రచురించాల్సిన అవసరం లేదన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, పానగల్, చందనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. వర్షం కారణంగా ధాన్యం తడిసిందేమోనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఎన్ని క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. ఇంకా ఎన్ని క్వింటాళ్లు తరలించాలి?, ఇంకా ఎంత ధాన్యం వస్తుంది ? రైతులకు డబ్బులను చెల్లిస్తున్నారా తదితర వివరాలను కేంద్రాల ఇన్చార్జిలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని వెంటను కొనుగోలు చేసే విధంగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని, హామాలీలను పెంచాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి కేంద్రాలకు సరిపడా లారీలను ఏర్పా టు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. కొంతమంది మిల్లర్లు ధాన్యం కోటా అయిపోయిందని దించుకోవడానికి ఇబ్బందిపెడుతున్నారని కేంద్రాల ఇన్చార్జిలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కలెక్టర్ స్పందించి మిల్లర్లతో మాట్లాడి అదనపు కోటాను కెటాయించి ధాన్యాన్ని త్వరితగతిన దించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.