
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ (నాన్ కేడర్)ను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు జిల్లా కలెక్టర్‌గా అదనపు బా ధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు వ్యవహరిస్తున్న సహాయ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం రవిని అదనపు బాధ్యతల నుంచి తప్పించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.