Gauravelli Reservoir
-
నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్
అక్కన్నపేట (హుస్నాబాద్): ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామా?.. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, అందులో సూచించిన దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోవడం మామూలైపోయింది. కానీ అన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే నట్టేట మునగడం ఖాయం. తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వాహనం నడిపి ఏకంగా ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ.. హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్లను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి హుస్నాబాద్ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌కు రోడ్డుపై సరైన అవగాహన లేక గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బంగారు లొద్దితండా దాటాక రామవరం వైపు వెళ్లాల్సిన ఉన్నా.. గుడాటిపల్లి వైపు మళ్లారు. మ్యాప్‌లో చూపించినట్టుగా ముందుకువెళ్లారు. కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీళ్లు నిలిచాయేమో అనుకుని ముందుకెళ్లాడు. క్యాబిన్ వరకూ నీళ్లు వచ్చాయి. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం స్థానికులు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు. రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించాలి నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టడంతో వెళ్లడానికి దారి లేదని స్థానికులు తెలిపారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర నీరు నిలిచి ఉంటుందని వివరించారు. రోడ్డుకు అడ్డుగా పెద్ద గోడ నిర్మించాలని.. లేకుంటే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఇంతకుముందు సెప్టెంబర్ 7న ఓ లారీ డ్రైవర్ ఇలాగే గూగుల్ మ్యాప్ చూస్తూ.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లారని.. ఇప్పుడు డీసీఎం వ్యాన్ వెళ్లిందని తెలిపారు. -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
దిగ్బంధంలో ‘గుడాటిపల్లి’
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుడాటిపల్లికి వెళ్లే రోడ్డు, కట్ట మూసివేత పనులు శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల పహారా మధ్య ప్రారంభమయ్యాయి. దాదాపు 400మందికి పైగా పోలీసులు మోహరించారు. గుడాటిపల్లిలో నిర్వాసితులను ఆ పనుల వద్దకు రానీయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో కట్టడి చేశారు. నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గ్రామస్తులు రోడ్డుపైనే దాదాపు5 గంటలకి పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని మహిళలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌కు, మిగిలిన వారిని మద్దూరు, చేర్యాల పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో పెండ్యాల సౌజన్య అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. కాగా, అర్ధరాత్రి నుంచి కట్టనిర్మాణ పనులు చేపట్టడంతో తాగునీరు సరఫరా అర్ధాంతరంగా ఆగిపోయింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కట్ట నిర్మాణ పనులు రాత్రికి రాత్రే ప్రారంభించడం ఏమిటని? పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిర్వాసితులు దుమ్మెత్తిపోశారు. కాగా, గుడాటిపల్లి గ్రామంతో పాటు పరిధిలోని తండాలను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. నిర్వాసితుల ఆందోళన కవరేజ్ చేసేందుకు మీడియాను సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా, ఇన్నేళ్లుగా కలసిమెలసి ఉన్న గుడాటిపల్లి వాసులు ఇక అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావడంతో కంటతడి పెట్టారు. హుస్నాబాద్, గౌరవెల్లి, నందారం క్రాస్ ఇలా పలుచోట తాత్కాలికంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో సర్పంచ్ పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాత్రి 9 గంటలకు గౌరవెల్లి ప్రాజెక్టు సమీపంలోని గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చు న్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని. కానీ ప్రభుత్వం ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. పరిహారం వచ్చేంత వరకు తాను ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఆయనకు తోడుగా కొందరు యువ తీయువకులు సైతం దీక్షలో కూర్చున్నారు. -
ఆడబిడ్డల గోడు పట్టదా?
హుస్నాబాద్: ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది. ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్‌గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్ పెంచుతూ పోయారు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాబితా నుంచి తొలగింపు మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హుస్నాబాద్ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్‌రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదేం న్యాయం? మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం? – చుంచు రాణి, నిర్వాసితురాలు వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా? గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం. – భూక్య శిరీష, నిర్వాసితురాలు -
గౌరవెల్లి నిర్వాసితులకు రూ.8లక్షల పరిహారం
930 కుటుంబాలకు లబ్ధి.. రూ. 80 కోట్ల మేర వ్యయం సాక్షి, హైదరాబాద్: వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయం దిగువన సుమారు లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురౌతున్న నిర్వాసిత కుటుంబాలకు వన్‌టైం సెటిల్మెంట్ కింద పరిహారంగా రూ. 8 లక్షలు చెల్లించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీని ద్వారా 930 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, సుమారు రూ. 80 కోట్ల వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పరిహారానికి సంబంధించి మంగళవారం శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.40 టీఎంసీలు మాత్రమే ఉండగా, దాన్ని ప్రస్తుత ప్రభుత్వం 8.23 టీఎంసీలకు పెంచింది. ఆయకట్టును సైతం 1.2 లక్షల ఎకరాల నుంచి 1.6 లక్షల ఎకరాలకు పెంచారు. దీంతో ఇక్కడ నిర్వాసితులవుతున్న కుటుంబాల సంఖ్య 687 నుంచి 930కి పెరిగింది. వీరికి ఇప్పటివరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మొత్తంగా అన్నిరకాల లబ్ధిలతో కలిపి రూ.7.22 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడి నిర్వాసితుల్లో చాలామంది తమకు వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారం చెలిస్తే ముంపు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేస్తామని ముందుకు రావడంతో అందుకు అనుగుణంగా పరిహారాన్ని రూ. 8 లక్షలకు పెంచుతూ నిర్ణయం చేశారు.