gautam khaitan
-
అగస్టా కేసులో ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో న్యాయవాది గౌతం ఖెతాన్‌కు చెందిన రూ.8.46 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అటాచ్ చేసింది. రెండో దశ విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. వెల్లడించని విదేశీ ఖాతాలను ఆయన కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో సింగపూర్, మారిషస్ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఖెతాన్ పొందినట్లు విచారణలో తేలిందని ఈడీ వివరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో ఆయన ఆస్తులు కలిగి ఉన్నారని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అగస్టా కేసులో నిందితుడిగా ఉన్న ఖెతాన్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి ఆయనను జనవరి 25న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆదాయపన్ను శాఖ వివరాలను ఆధారంగా చేసుకుని తాజాగా ఆయనపై మరో కేసును ఈడీ నమోదు చేసింది. -
ఆ స్కాంలో పీఎంవో హస్తముంది!
యూపీఏ హయాంలో పీఎంవో చెప్పడంతోనే.. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోర్టుకు తెలిపిన ఎస్పీ త్యాగీ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) కార్యాలయం (పీవోఎం) ప్రమేయం కారణంగానే బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా ఒప్పందంలోని నిబంధనలు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో మార్పులు చేసి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న ఈ కేసులో శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం కోర్టులో హాజరుపరుచగా.. విచారణ కోసం నాలుగురోజులపాటు వారిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. వీవీఐపీ హెలికాప్టర్లలో మార్పులు తన ఒక్కడి నిర్ణయం ప్రకారం జరగలేదని, ఈ కొనుగోలు ఒప్పందంలో పాలుపంచుకోవాలని 2003లో అప్పటి పీఎంవో కోరిందని, 2004లో పీఎంవో హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోరిందని ఆయన చెప్పుకొచ్చారు. వీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచారని, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
అగస్టా కేసులో తొలి వికెట్
వాయుసేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి అరెస్టు ► విచారణకు పిలిచి అరెస్టు చేసిన సీబీఐ న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో సంచలనం రేపిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టుల పర్వం మొదలైంది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న కేసులో 2013లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. శుక్రవారం ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. ‘ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి 2005లో అప్పటి వైమానిక దళ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. అరెస్టు చేసిన వారందరినీ.. శనివారం కోర్టులో ప్రవేశపెడతాం. తర్వాత రిమాండ్ కోరతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి దెవ్ప్రీత్ సింగ్ తెలిపారు. కాగా, ఇటలీ మధ్యవర్తి గుయిడో హ్యాష్కే, కార్లో గెరోసా నుంచి ముడుపులు తీసుకున్నట్లు అంగీకరించిన ఖైతా¯ŒS.. ఈ ముడుపులు డీల్‌ను ప్రభావితం చేసేందుకు మాత్రం కాదని వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీవీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా 2005లో త్యాగి అంగీకరిచినట్లు తెలిపాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. -
‘అగస్టా వెస్ట్ ల్యాండ్’ కేసులో కీలక మలుపు
-
మనీ లాండరింగ్ కేసులో ఈడీకి నోటీసులు
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, వ్యాపారవేత్త గౌతమ్ ఖైతాన్కు బెయిల్ అప్పీల్‌పై ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రూ.3600 కోట్ల వీవీఐపీ ఛాపర్ లావాదేవీల్లో అవకతవకలపై గౌతమ్ ఖైతాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో గౌతమ్ ఖైతాన్తోపాటు మాజీ ఐఎఎఫ్ అధికారి ఎస్పి త్యాగి మరో 19మందిపై ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ డీల్‌లో 360 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న దానిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది.