న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, వ్యాపారవేత్త గౌతమ్ ఖైతాన్కు బెయిల్ అప్పీల్పై ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రూ.3600 కోట్ల వీవీఐపీ ఛాపర్ లావాదేవీల్లో అవకతవకలపై గౌతమ్ ఖైతాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జూలైలో గౌతమ్ ఖైతాన్‌తోపాటు మాజీ ఐఎఎఫ్ అధికారి ఎస్‌పి త్యాగి మరో 19మందిపై ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ డీల్‌లో 360 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న దానిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది.
మనీ లాండరింగ్ కేసులో ఈడీకి నోటీసులు
Published Thu, Oct 30 2014 12:07 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
Advertisement
Advertisement