Gautham Menon director
-
గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఎఆర్ రెహమాన్ సంగీతంతో ‘బతుకమ్మ’ పాట
తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండగకు ఆదరణ పెరిగిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. ప్రతి ఎడాది బతుకమ్మ సంబరాల్లో భాగం ఒక కొత్త పాటను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎడాది లాగే ఈ సారి కూడా బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సారి బతుకమ్మ పాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఎడాది బతుకమ్మ పాటకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ సమీపంలోనే భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరుపుకుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత ఈ పాటను విడుదల చేయనున్నారు. అంతేగాక ఈ సాంగ్‌ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎడాది అక్టోబర్ 6 నుంచి బతుకుమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. -
స్టార్ డైరెక్టర్‌కు కోర్టులో చుక్కెదురు..!
సాక్షి, పెరంబూరు: డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు మద్రాసు హైకోర్టు చుక్కెదురైంది. కచ్చదీవుల్లోని అంథోనియార్ దేవాలయంలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనడానికి అనుమతి కోరుతూ ఆయన మద్రాసు కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు అందుకు నిరాకరించింది. వివరాలివి.. సినీ దర్శకుడు గౌతమ్‌మీనన్ కచ్చదీవుల్లోని అంథోనియార్ దేవాలయంలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనడానికి ‘ అభ్యంతరం లేదనే’ ( నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ధ్రువపత్రాన్ని స్థానిక పోలీసుల నుంచి పొందాల్సి ఉందన్నారు. అందుకు చెన్నై పోలీస్‌కమిషనర్, ట్రిప్లికేన్ అసిస్టెంట్ పోలీస్‌కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చానని డైరెక్టర్ అన్నారు. అయితే వారు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ పిటిషన్‌ను న్యాయమూర్తి ఎంఎస్.రమేష్ విచారణకు స్వీకరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆయన ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున న్యాయవాది రాజా హాజరై దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై మూడు దేశద్రోహం కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణంగా ఆయనకు కచ్చదీవులకు వెళ్లడానికి అనుమతి నిరాకరించినట్లు వివరించారు. దీంతో న్యాయమూర్తి ఈ ధ్రువపత్రం ఇవ్వడానికి సాధ్యం కాదని దర్శకుడి తరఫు న్యాయవాదికి తెలిపారు. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశారు. -
త్రిష చీర సింగారం
నటి త్రిష చీర సింగారం పురాణంతో తెగ మురిసిపోతున్నారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ విన్నై తాండి వరువాయా చిత్రంలో త్రిషను చీరకట్టుతో ఆవిష్కరించిన జెస్సీ పాత్రను తమిళ ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. ఆ పాత్రకు లభించిన అప్లాజ్ త్రిష జీవితాంతం మరచిపోలేరు కూడా. ఆ తరువాత ఈ చెన్నై చిన్నదానికి అంత పేరు తెచ్చిన పాత్ర లేదన్నది నిజం. అందుకే త్రిష కూడా దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటుంటారు. మరో విషయం ఏమిటంటే త్రిష మార్కెట్ పడిపోతుందనుకుంటున్నప్పుడల్లా గౌతమ్‌మీనన్ ఆమెకో అవకాశం ఇస్తూ ఆదుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అజిత్ సరసన నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రంలో మరోసారి త్రిషను చీరలో బహు సుందరంగా చూపించనున్నారట. ఇటీవల వినాయక చతుర్ధశి రోజున స్టైలిష్ గెటప్‌లో అజిత్, చీర కట్టు సింగారంతో త్రిష నటించిన సన్నివేశాల్లో మెరిసిపోయారు. ఈ జంటను చూసిన అజిత్ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారట. తల (అజిత్) సరన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ త్రిషేనని, సరైన జోడి కూడా వీరేనని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నా యి. దీని కంతటికీ కారణం దర్శకుడు గౌతమ్‌మీనన్ అని ఆయనకి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే ఇటీవల కన్నడ చిత్ర రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ అక్కడ టూపీస్ దుస్తులు ధరించి గ్లామరస్లా దుమ్ము లేపారు. ఈ వ్యవహారంలో ఆమె అందాలను ఆహా అంటూ సొంగ కార్చుకుంటూ ఆశ్వాదించిన వారు కొందరైతే ఈ వయసులో ఈమెకు ఎక్స్పోజ్ అవసరమా? అంటూ విమర్శ లు గుప్పిస్తున్నారు మరి కొందరు. ఇలాంటి వాటిని పక్కదోవ పట్టించడానికే త్రిష తన చీర పురాణం అందుకుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.