gazetted
-
ఏపీపీఎస్సీ ప్రకటన: గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ (జీఎస్ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను ప్రకటించారు. షెడ్యూళ్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచారు. తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహించనున్నారు. -
ఇస్రోలో ఉద్యోగం సాధించిన ఇల్లెందు వాసి..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పట్టణానికి చెందిన కోట సాయిపవన్‌తేజ్ ఉద్యోగం సాధించాడు. గ్రూప్–1 గెజిటెడ్ స్థాయి కలిగిన శాస్త్రవేత్తగా అతడు ఉద్యోగం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాయిపవన్‌తేజ్‌కు చిన్నతనం నుంచే చదువు మీద మక్కువ. తల్లిదండ్రులు కోట విజయ్‌కిశోర్‌బాబు, లావణ్య పవన్‌తేజ్ పదో తరగతిలో ఉన్నప్పుడే అగ్నిప్రమాదంలో మృతిచెందారు. అయినా పట్టుదలతో చదివాడు. ఇంటర్ అనంతరం జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా స్థాయిలో 502 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరీలో 59వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2021లో ఇంజనీరింగ్‌లో 82 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఏడాదిలోనే ఇస్రో వారు ఢిల్లీ ఐఐటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించగా సాయిపవన్‌తేజ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్–1 గెజిటెడ్ పోస్టుకు ఎంపికయ్యాడు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (గగన్యన్ ప్రాజెక్టు)కు ఎంపికయ్యాడు. కాగా, శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిపవన్‌తేజ్‌ను ఎమ్మెల్యే హరిప్రియతోపాటు మున్సిపల్ చైర్మన్ డీవీ, విద్యాబోధన చేసిన ఎంసీ నాగిరెడ్డి, కేఎస్వీ సుధాకర్, శ్రీను, అర్వపల్లి రాధాకృష్ణ, ప్రసాద్ అభినందించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు చదవండి: భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త -
కలల సాకారానికి కలిసి నడుద్దాం
డైరీ ఆవిష్కరణ సభలో టీజీవోలకు మంత్రి కేటీఆర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో మేలు చేకూరుతుందని ప్రజలు కన్న కలలను నెరవేర్చడానికి గెజిటెడ్ అధికారులు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన డైరీని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్న ఉద్యోగులు, అధికారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బ్రహ్మాండమైన పీఆర్సీ ఖాయం! హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. నాడు ఉద్యమ సెగను రగిలించింది ఉద్యోగులేనని, అటువంటి ఉద్యోగులకు బ్రహ్మాండమైన పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మహమూద్ అలీ మాట్లాడుతూ ఉద్యమానికి మూలస్తంభాలుగా నిలిచిన అధికారులు అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జేఎసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. గతంలో ఉద్యమ వేదికలుగా నిలిచిన డైరీ ఆవిష్కరణ సభలు.. ఇకపై బంగారు తె లంగాణ దిశగా ఉద్యోగులను, అధికారులను కార్యోన్ముఖులను చేసే వేదికలు కావాలన్నారు. అదనంగా పనిచేస్తాం: టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులు, అధికారులు మరింత కష్టపడేందుకు సిద ్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేయాలని, ప్రతినెలలో ఒక రోజు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని టీజీవో కార్యవర్గం తీర్మానించిందన్నారు. కార ్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, రాష్ట్ర నాయకులు పురుషోత్తమ్‌రెడ్డి, రామేశ్వర్రావు, విష్ణువర్థన్‌రావు, మధుసూదన్‌గౌడ్, కృష్ణయాదవ్, సుజాత, సబిత, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
పెల్లుబికిన నిరసన
మంత్రి మండలి నిర్ణయంపై గెజిటెడ్ ప్రొబెషనరీ అభ్యర్థుల ఆగ్రహం ఒకరి ఆత్మహత్యాయత్నం కొనసాగుతున్న ధర్నా సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారంజరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితుల్లో కొంతమంది బెంగళూరులో అత్మహత్య యత్నం కూడా చేయడం గమనార్హం. వివరాలు... 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ దర్యాప్తులో తేలడంతో సదరు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంత్రి మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ పోస్టులకు నూతన నోటిఫికేషన్ విడుదలకు అంగీకారం తెలిపింది. ఇక 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు తాజాగా పరీక్షలు రాయదల్చుకుంటే వయోపరిమితి సడలింపు ఇవ్వడానికి మంత్రిమండలి సభ్యులు సమ్మతించారు. అయితే అప్పటి నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసుకుని ఉద్యోగానికి ఎంపికయిన 362 మంది అభ్యర్థులు ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఒకరిద్దరు చేసిన పనికి ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేయడం సరికాదని వారు వాపోయారు. ఇదిలాఉండగా ఫ్రీడం పార్క్ వద్ద ఉషారాణి అనే అభ్యర్థి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తప్ప తాము ఎవరితోనూ మాట్లాడబోమని అభ్యర్థులు తేల్చి చెప్పారు. గురువారం రాత్రి పొద్దుపోయేంతవరకూ బాధిత అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేస్తూనే ఉన్నారు.